Paritala ravi son vs jc diwakar reddy

paritala ravi son vs jc diwakar reddy, jc diwakar reddy, paritala ravi son sriram, tdp, jc diwakara reddy join in tdp, chandrababu naidu, jc brothers, paritala sriram,

paritala ravi son vs jc diwakar reddy

జేసి దివాకర రెడ్డి వర్సెస్ పరిటాల రవి కొడుకు

Posted: 11/07/2013 03:13 PM IST
Paritala ravi son vs jc diwakar reddy

కాంగ్రెస్ పార్టీతో కస్సు బుస్సులాడి.. సైకిల్ ఎక్కటానికి సిద్దమైన జేసి దివాకర రెడ్డికి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఎవరు ఊహించని దెబ్బ జేసి దివాకర్ రెడ్డికి తగిలింది. ఇప్పుడు అనంతపురం వర్సెస్ తాడిపత్రి రాజకీయ కక్షలతో రగిలిపోతుంది. జేసిని అడ్డుకోవటానికి .. పరిటాల రవి కుటుంబం శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

జేసి వేసిన రాజకీయ ఎత్తులు చిత్తైపోతున్నాయి. ఈసారికి జేసీ బహిరంగ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆయన కుమారుడు పవన్ కు తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ ను, జేసీ తమ్ముడు ప్రభాకర రెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్ ను ఇస్తే కనుక తాను టిడిపిలో చేరిపోవాలని చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్చల ఫలితంతో జేసీలొ మౌనం దీనికి కారణం ఏంటని ఆరాతీస్తే మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి కుమారుడు శ్రీరాం , టిడిపిలో జేసీ చేరికను అడ్డుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న జేసి ..తన నోటికి తాళం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి పరిటాల బతికి ఉన్నన్ని రోజులు కూడా జేసీ రాజకీయాలు పారేవికావు.

 

పరిటాల రవి హయంలో నోరు మెదిపెందుకు కూడా ధైర్యం చాలేది కాదు. ఇక పరిటాల హత్యలో జేసీ హస్తం కూడా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా జరిగింది. అయితే అందులో నిజమెంతో తెలియదు కానీ ఆ జిల్లాలోని రవి వర్గం ఇప్పటికీ కూడా అదే ఆరోపణ చేస్తుంటుంది. అయితే ఇప్పుడు జేసీ టిడిపిలోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతుండగా రవి తనయుడు శ్రీరామ్ అడ్డుగా మారటంతో.. జేసికి మళ్లీ పాత తలనొప్పి మొదలైందిని జేసి అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

 

 

జేసి విషయం పై చంద్రబాబు కూడా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిటాల రవి భార్య సునీత కూడా జేసి టీడీపీలో చేరికను తీవ్రంగా వ్యతిరేకించినట్లు పార్టీలోని సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటన్నారు. అయితే దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు త్వరలోనే పరిటాల వర్గంతో మాట్లాడి జేసీ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తానని జేసీ వర్గానికి చంద్రబాబు హమీ ఇవ్వటం జరిగిందని టిడిపి వర్గాలు అంటున్నాయి. అయితే పరిటాల రవి కొడుకు శ్రీరాం మాత్రం.. జేసి టిడిపిలో చేరితో మాత్రం.. మేము రాజకీయాలకు దూరంగా ఉంటామనే విషయాన్ని పార్టీ పెద్దలతో చెప్పినట్లుగా పార్టీలోని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. చంద్రబాబు జేసి విషయాన్ని ఎలా ముగిస్తారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more