Adipurush’s teaser and first look to be released on this date ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: అదిపురుష్ విడుదల ఎప్పుడంటే..!

Prabhas starrer adipurush teaser and poster will be unveiled in ayodhya

Prabhas, Kriti Sanon, Adipurush prabhas, Adipurush ramayana prabhas, Adipurush rama prabhas, Adipurush sita, Adipurush kriti sanon, Adipurush ramayan kriti sanon, Adipurush ramayan Saif Ali Khan, Adipurush saif ali khan, Adipurush ravan saif ali khan, Adipurush ravan, Adipurush Sunny Singh, Adipurush om raut, Adipurush Ramayana om raut, Om Raut Tanhaji, Adipurush T Series, Saif Ali Khan, Sunny Singh, Adipurush, Ramayana, Om Raut, Tanhaji, T Series, Bollywood

The teaser and poster of Telugu film industry star Prabhas’s upcoming film Adipurush are set to be unveiled on October 2 on the bank of river Sarayu Ayodhya, Uttar Pradesh. Both Prabhas and Kriti Sanon, who play lead roles in the movie, will be present at the event along with director Om Raut and producer Bhushan Kumar. Apart from Prabhas and Kriti Sanon, Saif Ali Khan and Sunny Singh play important roles in Adipurush.

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: అదిపురుష్ విడుదల ఎప్పుడంటే..!

Posted: 09/27/2022 09:11 PM IST
Prabhas starrer adipurush teaser and poster will be unveiled in ayodhya

కృష్ణంరాజు మరణంతో శోకసంద్రంలో మునిగిన రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులను దుఃఖసాగరంలోంచి బయటకు తీసుకువచ్చేలా గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం‌. ప్రభాస్ ఫ్యాన్స్  అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ఆదిపురుష్‌ నుంచి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్‌డేట్‌ వదిలాడు డైరెక్టర్‌ ఓంరౌత్‌. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఆ తరువాత నటించిన రెండు చిత్రాలు సలార్, రాధేశ్యామ్ రెండు బాక్సాఫీసు వద్ద పెద్దగా సవ్వడి చేయలేదు.

సలార్ కనీస వసూళ్లను రాబ్టటినా.. రాధేశ్యామ్ మాత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. అయితే అభిమానులకు హిట్ చిత్రాన్ని అందించేందుకు అప్పటికే అదిపురుష్ చిత్ర షూటింగ్ ప్రారంభించిన ఆయనకు వ్యక్తిగతంగా కొండంత అండగా నిలిచిన ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ సహా ఆయన కుటుంబాన్ని.. అభిమానులను విషాదంలోంచి బయటకు తీసుకువచ్చేలా అదిపురుష్ చిత్రం టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు దర్శకుడు ఓంరౌత్. అంతేకాదు ఈ సందర్భంగా మూవీ విడుదల తేదీని కూడా చెప్పేశాడు.

ఆదిపురుష్‌ టీజర్‌ను అక్టోబర్‌ 2న అయోధ్య వేదికగా విడుదల చేస్తున్నామని, ఇక మూవీని వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘మా ఈ మ్యాజికల్‌ జర్నీని ఎక్స్‌పిరియన్స్‌ చేసే సమయం వచ్చేసింది. ఆదిపురుష్‌ టీజర్‌, ఫస్ట్‌ పోస్టర్‌ను అయోధ్యలో విడుదల చేస్తున్నాం. ఇక సినిమాను వచ్చే ఏడాది జనవరి 12, 2023లో ఐమాక్స్‌, 3డీలో థియేటర్లోకి రానుంది’ అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. కాగా మైథలాజికల్‌ ఫిలింం‌గా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించగా కృతీ సనన్‌ సీతగా కనిపించనుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా అలరించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Prabhas  Kriti Sanon  Saif Ali Khan  Sunny Singh  Adipurush  Ramayana  Om Raut  Tanhaji  T Series  Bollywood  

Other Articles