Comedian Raju Srivastav dies at 58 ప్రముఖ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

Comedian raju srivastava passes away at 58 weeks after being on ventilator

Raju Srivastava, Raju Srivastava heart attack, Raju Srivastava health update, Raju Srivastava news, Raju Shrivastava, Raju Shrivastav, Raju Srivastav, Raju Srivastava AIIMS, Raju Srivastava latest news, Sunil Pal, sunil pal news, Raju Srivastava Instagram, Raju Srivastava shows, Raju Srivastava comedian, Raju Srivastava videos, Sunil Pal videos

Raju Srivastava, who suffered a heart attack while working out at the gym on August 10, is no more. The comedian passed away today, September 21, after a long fight. Raju Srivastava's family members - his wife, son and daughter - are currently at AIIMS. He will be cremated on Thursday, September 22, in Delhi.

ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

Posted: 09/21/2022 02:33 PM IST
Comedian raju srivastava passes away at 58 weeks after being on ventilator

ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్ చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రికి తరలించారు. నెల రోజులుగా ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసిన ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

నెల రోజులుగా వెంటిలేట‌ర్‌పై ఉన్న శ్రీవాత్స‌వ ఇవాళ ఉద‌యం 10.20 నిమిషాల‌కు మ‌ర‌ణించిన‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి. తన హాస్యంతో రాజు శ్రీవాస్తవ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాడు. హాస్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రాజు శ్రీవాస్తవను గజోధర్‌ భయ్యాగా పిలుచుకుంటారు. ఈ పేరుతో తనదైన శైలిలో హాస్యాన్ని పండించాడు. కాన్పూర్‌లో 25 డిసెంబర్ 1963న జన్మించిన రాజు శ్రీవాస్తవ తండ్రి రమేశ్‌ చంద్ర శ్రీవాస్తవ. ఆయన ప్రముఖ కవి.ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో రాజు శ్రీవాత్స‌వ 1980 నుంచి ఉన్నారు. అయితే2005లో జ‌రిగిన గ్రేట్ ఇండియ‌న్ లాఫ‌ర్ ఛాలెంజ్ కామిడీ షోతో అత‌ను పాపుల‌ర్ అయ్యారు.

1982లో రాజు శ్రీవాస్తవ ముంబైకి వెళ్లాడు. జీవన పోరాటం ఇక్కడే ప్రారంభమైంది. సినిమారంగంలోకి ప్రవేశానికి ముందు తొలి రోజుల్లో జీవనోపాధి కోసం ఆటోరిక్షాను సైతం నడిపాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అనిల్‌ కపూర్‌ తేజాబ్‌ ద్వారా శ్రీవాస్తవ బాలీవుడ్‌లోకి అడుగుపెటారు. తనదైన కామెడీతో సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మైనే ప్యార్ కియా, బాజీఘ‌ర్‌, బాంబే టు గోవా, ఆమ్‌దాని అఠానీ, ఖ‌ర్చా రుప‌య్యా లాంటి సినిమాల్లో అత‌ను న‌టించారు. బిగ్ బాస్ మూడ‌వ సీజ‌న్‌లో అత‌ను కాంటెస్టెంట్‌గా పోటీప‌డ్డారు. యూపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్మెంట్ కౌన్సిల్‌కు చైర్మెన్‌గా చేశారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే చాల ఇష్టమున్న నటుడు శ్రీవాత్సవ్.. అచ్చం అమితాబ్‌ బచ్చన్‌లాగే మాట్లాడడం, శైలిని అనుకరించడం.. బిగ్ బి వాయిస్‌ను మిమిక్రీ చేయడం ప్రారంభించాడు. అమితాబ్‌ వాయిస్‌ను అనుకరించినందుకు తొలిసారిగా రూ.50 పారితోషికంగా అందుకున్నాడు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. క‌మీడియ‌న్ శ్రీవాత్స‌వ మృతి ప‌ట్ల నివాళి అర్పించారు. శ్రీవాత్స‌వ సంపూర్ణ ఆర్టిస్ట్ అని, చాలా స‌న్నిహితంగా ఉండే వ్య‌క్తి అని, సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ అత‌ను యాక్టివ్‌గా పాల్గొనేవాడ‌ని, ఆయ‌న కుటుంబానికి, అభిమానుల‌కు సంతాపం తెలుపుతున్న‌ట్లు రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles