Yash keeps the next film details in suspense రాంచరణ్, యష్ లతో నార్త‌న్ మల్టీస్టారర్ చిత్రం..?

Yash and ram charan to team up for director narthan next movie

Filmmaker Narthan, Actor Yash, Kannada Rockstar Yash, Mega Powerstar Ram Charan, Actor Ram Charan, Periodic action drama, Mufti director, Narthan, Pan India Movie, Megastar Chiranjeevi, Project locked, Yash Ramcharan, Ram charan Yash, Ram Charan Yash Narthan, Tollywood, sandalwood, Bollywood, Movies, Entertainment

Kannada filmmaker Narthan, is set to team up with Kannada star Yash and Ram Charan for his next movie. As per the latest social media reports, the RRR actor and the Mufti director met six months ago to discuss the film. And more recently, after Charan gave his formal nod, Megastar Chiranjeevi heard the final script on September 8. He loved it and the project is now locked.

రాంచరణ్, యష్ లతో నార్త‌న్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం..?

Posted: 09/16/2022 06:52 PM IST
Yash and ram charan to team up for director narthan next movie

‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. కేజీఎఫ్‌తో క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్ ధమాకా అంటే ఏంటో చూపించాడు. ఇక ఇటు ఆర్ఆర్ఆర్ చిత్రంతో తన నటనా చాతుర్యాన్ని అఖిలభారత ప్రేక్షకుల ముందు అవిష్కరించి ఔరా అనిపించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్. వీరిద్దరూ కలసి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తే.. బాలీవుడ్ బాక్సీఫీసు రికార్డులు బద్దలే.

కానీ ఇది సాధ్యమా.? అంటే ఔననే అంటూ ఫిల్మ్ నగర్ బొగట్టా. ఈ చిత్ర కథను ఇద్దరు హీరోలకు వినిపించిన దర్శకుడు.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి కూడా వినిపించారని, ఆయన కూడా అమోదముద్ర వేశారని చిత్రపురి టాక్. ఇంతకీ ఈ చిత్ర దర్శకుడు ఏవరు అనేగా.. య‌ష్, రాంచరణ్  మల్టీస్టారర్ చిత్రాన్ని ‘మ‌ఫ్టీ’ ఫేం నార్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు.

ఇప్ప‌టికే ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులను స్టార్ట్ చేసిన చిత్ర‌బృందం త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్ట‌నుంది. కాగా ఈ చిత్రం పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుందని తెలుస్తోంది‌. అంతేకాకుండా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో గ్రాండియ‌ర్‌గా పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొంద‌నుందట‌. ఇప్ప‌టికే రాకింగ్ స్టార్ య‌ష్ ఈ చిత్రం కోసం క‌స‌ర‌త్తులు ప్రారంభించాడ‌ట‌. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టించ‌నుంద‌ని టాక్‌. కేజీఎఫ్ చిత్రం కూడా పీరియాడిక్ యాక్ష‌న్‌ జాన‌ర్‌లో తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles