missamma 1995 movie special story

హాస్యానికి మారుపేరు ‘‘మిస్సమ్మ’’

పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు జాతికే గర్వించదగ్గ నటుడు నందమూరి తారకరామరావులు నటించారు. వీరిద్దరు వున్నప్పటికీ ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషించింది మాత్రం సావిత్రి. అంతేకాకుండా ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి వంటి ఎంతోమంది నటులు నటించారు. నటి సావిత్రి ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకర్షించడమే గాక.. చక్కని అభినేత్రిగా పేరు తెచ్చుకుంది. యొతిష్ బెనర్ఝీ అనే బెంగాలీ రచయిత రచించిన ‘‘మన్మోయీ గర్ల్స్ స్కూల్’’ అనే హాస్య రచన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు చక్రపాణి, పింగళి నాగేంద్రరావులు కలం పట్టగా.. ఎల్వీ ప్రసాద్ తన దర్శకత్వంతో ఎంతో వినోదాత్మకంగా రూపొందించారు. ఇక పాటలు, మాటల విషయానికొస్తే.. రచయితగా పింగళి నాగేంద్రరావు అద్భుతమైన పాటలను రూపొందించారు. ఈ పాటలు ఈనాటికీ మన తెలుగువారిని అలరిస్తూనే వున్నాయి. 

 

సినిమా కథ : ఈ సినిమాలోని కథ.. నిజ జీవింతంలోనే జరిగివుండదు కదా.. ఊహించలేనిది కూడా. అయినా చక్రపానిగారు తన సామర్థ్యంతో ఈ సినిమా కథాంశాన్ని ఎంతో అద్భుతంగా రచించి, చరిత్రలోనే నిలిచిపోయేటట్లు చేశారు. అంతేకాకుండా ఈ చిత్రానికి విచత్రంగా ప్రచారాలు కూడా చేశారు. 

మిస్ మేరీ పాత్రలో నటించిన సావిత్రి, తనకు సరిగ్గా పరిచయం కూడా కాని ఒక అబ్బాయి ఎమ్టీరావుకి భార్యగా నటించడానికి సిద్ధపడుతుంది. కానీ వీరిద్దరు ఇలా నటించడానికి కారణాలేంటి..? అసలు మేరీ ఎవరు..? వీరిద్దరు ఎలా పరిచయమవుతారు..? సావిత్రికి ఎన్టీ రామారావు భార్యగా ఎందుకు నటిస్తుంది..? ఇవన్నీ తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్లాల్సిందే.. 

వాళ్ళిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకు ముందే తెలిసి పోతుంది. కూటికోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను 'ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని' భయపెట్టి ఎమ్టీరావు తమ వెంట తీసుకెళతాడు. అక్కడ నాయుడు తప్పిపోయిన తన పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో ఒక బడిని నడుపుతుంటాడు. ఆ బడికి సెక్రటరీగానే గాక అందులోనే మాస్టారుగా వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని వింటాడు. తానో పెద్ద డిటెక్టివ్ ననే భ్రమతో బళ్ళో పిల్లల్ని గాలికొదిలేసి, బర్రెను వెదుకుతూ తనూ గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బళ్ళోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడమూ, వాళ్ళచేత ఆయుర్వేద మందులు నూరించడమూ మాత్రమే తెలిసినవాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ఎక్కడ ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యా భర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి, మారు పేర్లతో వచ్చిన వీళ్ళిద్దరినీ వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు.

తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ యేమోననే అనుమానం ఆ 'డిటెక్టివ్' రాజుది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు 'కూతురూ-అల్లుడూ' అని వరసలు కలిపేస్తాడు. ఈ వరసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ, తన కోపాన్నంతా ఎమ్టీరావు మీద చూపిస్తూంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటిదగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగి పోయింది. అప్పిచ్చిన డేవిడ్ "బాకీ తీర్చొద్దు నన్ను పెళ్ళి చేసుకో" అని వేధిస్తుంటాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి, అటు వాడితోనూ, ఇటు ఎమ్టీరావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది.

 

అయితే నాయుడి చిన్న కూతురు ఎమ్టీరావుతో చనువుగా ఉంటుంది. కానీ ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయే సరికి ఎమ్టీరావు కంగారు పడి ఆమెకు కిరస్తానీ దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టుగా నాయుడు "నువ్వు కాకపోతే మ అల్లుడికి (ఎమ్టీరావుకి) పిల్లే దొరకదనుకున్నవా? మా పిల్లనే ఇచ్చి చేస్తాం." అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి, మేరీని కలిసి, ఎమ్టీరావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు.ఈ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది.

తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ యేమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒక నాటి అర్ధరాత్రి తన అసిస్టెంటుతో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి, ఆమె పడక మీదికి టార్చ్ లైటు వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెళకువ రావడం, డిటెక్టివులు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలతనిద్రలో ఒక పీడకల.. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్ళి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎమ్టీరావు కనిపిస్తారు. దాంతో ఆమెకు ఎమ్టీరావు మీద అనురాగం అంకురిస్తుంది. కథ తిరగవలసిన మలుపులన్నీ తిరిగి సుఖాంతమవుతుంది.

చివరగా : మొదట్లో ఈ సినిమాలో మేరీ పాత్రకోసం భానుమతిని తీసుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ నిలిపివేసి.. తర్వాత సావిత్రిని తీసుకొని రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా తెరకెక్కించారు. అందులో మీనాకుమారి మేరీ పాత్రను పోషించింది. 

maya bazar movie special story

అద్భుతానికి నిర్వచనం ‘‘మాయాబజార్’’

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక వార్తాపత్రికలు, వివిధ టెలివిజన ప్రసారాలు ప్రత్యేకమైన వ్యాసాలను అందించాయి. చరిత్రలోనే తనదైన ముద్రవేసుకుని తెలుగు చిత్రసీమకు ప్రతీకగా నిలిచిపోయింది ఈ మాయాబజార్. బహుశా అద్భుతం అనే మాట ఈ సినిమా ద్వారానే ప్రచారంలోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఎన్నో జనరంజక చిత్రాలను అందించిన విజయా సంస్థ తెలుగు అభిమానులందరికీ అందించిన మరో కళాఖండమే ఈ చిత్రం.  భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు వంటి అపురూపమైన చిత్రాలను తెరకెక్కించిన కేవీరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

మొదట ఈ చిత్రం కథతో 1936వ సంవత్సరంలో శశిరేఖా పరిణయం అనే ఒక చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రానికి మరొక పేరు మాయాబజార్. అదే పేరునే ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే... మహాభారతంలోని కొన్ని పాత్రలను తీసుకొని ఒక కల్పిత చిత్రాన్ని చిత్రీకరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక చిత్రా కథావస్తువు. ఈ చిత్రంలో దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడు (మహాభారతంలో ఇతడు పుట్టలేదు) వివాహం శశిరేఖతో కుదురుతుంది. కానీ ఘటోత్కచుడు తన ఆశ్రమంలోని అభిమన్యుడితో ఈమె వివాహం జరిపించడం కోసం శశిరేఖను అపహరిస్తాడు. ఆ తరువాత ఘటోత్కచుడే మాయా శశిరేఖా అవతారం దాల్చి కౌరవులను ముప్పతిప్పలు పెడతాడు. ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు. 

 

సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు ఒక మహాఅద్భుతమనే చెప్పాలి. ఈయన తన పాటలలో కొత్త పదాల్ని కూడా మనకు పరిచయం చేశాడు.  మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్లగా ఆడుకుంటున్న శశిరేఖ.. ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది!

ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. 

అప్పట్లో నలుపు తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్‌స్టోన్ అనే ఒక సంస్థ 2010 జనవరి 30 న రంగుల్లో విడుదల చేశారు. మాయాబజార్ పాత సినిమాలో సౌండ్ ట్రాక్‌లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70 ఎం.ఎం కి మార్చి డీటీఎస్ కి మార్చారు. ఇందుకోసం 165 మంది నిపుణులు దాదాపు ఏడాది సమయం పాటు పనిచేశారు. ఇది ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు.

telugu legend actor sr ntr

తెలుగుజాతికి వన్నె తెచ్చిన తారకరాముడు

నవరస నటనా సార్వభౌమునిగా  పేరుగాంచిన  స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో  అతి పేద కుటుంబంలో  జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ పెంచుకున్నారు. 1940లో మెట్రిక్యులేషన్ పాసయిన అనంతరం  విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలో ఇంటర్మీడియట్ లో చేరారు. చదువుతున్న రోజుల్లోనే రామారావు ఇంటి భాధ్యతలను నెరవేర్చేందుకు  విజయవాడలోని హోటళ్లకు  సైకిల్ మీద వెళ్లి పాలను సరఫరా చేసేవారు. అనంతం చిన్న దుకాణంలో క్లర్కుగా పనిచేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరిలో కాలేజీ విద్యార్థులంతా కలిసి విశ్వనాథ సత్యన్నారాయణ  రచించిన డ్రామాను ప్రదర్శించాలనుకున్నారు.  

దీనిలో ఎన్ టిఆర్ స్ర్తీ పాత్రను పోషించారు. ఇదే అతని మొదటి నాటకరంగ అనుభవంగా చెబుతుంటారు. 1945వ సంవత్సరంలో ఎన్ టిఆర్ గుంటూరులోని  ఆంధ్రా క్రిష్టియన్ కాలేజీలో బిఎలో చేరారు. ఈ సమయంలోనే రామారావు చేసినపాపం అనే నాటకాన్ని వేశారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ నటుడు స్వర్గీయ కొంగర జగ్గయ్య, కెవిఎస్ శర్మ, తదితరులు కూడా నటించారు. డిగ్రీ పూర్తయిన తరువాత రామారావు మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి విజయం సాధించి మంగళగిరిలో సబ్ రిజిష్ర్టార్ గా చేరారు. నటనారంగంలో  దిగిన తరువాత  తన ఉద్యోగాన్ని వదిలి వేశారు. ఎన్ టిఆర్ మొదట 1949లో మనదేశం సినిమాలో ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించారు. రామారావుకు  ఈ అవకాశాన్ని దర్శకులు ఎల్ వి ప్రసాద్ ఇచ్చారు. అనంతరం  బిఎ సుబ్బారావు దర్శకత్వంలో పల్లెటూరి పిల్ల సినిమాలో నటించారు. ఈ సినిమాలోనే అక్కినేని నాగేశ్వర రావు, అంజలి దేవిలో పాటు నటించారు.

 

ఆ కాలంలో ఈ సినిమా 100 రోజులు ఆడి, కమర్షియల్ గా విజయం సాధించింది. తరువత కెవి రెడ్డి దర్శకత్వంలో పాతాళభైరవిలో రామారావు నటించడంతో అతనికి ఆ సినిమా పెద్ద బ్రేక్ నిచ్చింది. ఈ సినిమాలో రామారావు రాజు పాత్రతను పోషించారు. 1957లో మాయాబజార్ లో నటించి తన నటనతో ఎందరినో మెప్పించారు. అనంతరం క్రిష్ణునిగా 17 చిత్రాల్లో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. 1952లో కర్నన్ అనే తమిళ చిత్రంలో నటించి అక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు. తరువాతి కాలంలో దానవీర శూరకర్ణ, లవకుశ, శ్రీరామాంజనేయ యుధ్దం, శ్రీరామ పట్టాభిషేకం తదితర పౌరాణిక సినిమాల్లో నటించారు.

భూకైలాస్ చిత్రంలో రావణాసురి పాత్రను ధరించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఘనత రామారావుకు  దక్కింది. రాముడు, రావణుడు, భీముడు, శివుడు, అర్జునుడు, కర్ణుడు , ధుర్యోధనుడు తదితర పాత్రలకు ప్రాణం పోసిన నటునిగా పేరుతెచ్చుకున్నారు.  అనంతం అనేక సాంఘిక చిత్రాలలో హీరోగా , సోదరునిగా  మెప్పించారు. 1963లో వచ్చిన లవకుశ రామారావుకు ఎంతో పేరును తెచ్చిపెట్టింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అనంతర కూడా ఎన్ టిఆర్  నటనకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేజర్ చంద్రకాంత్ తదితర సినిమాలలో నటించారు. 44 ఏళ్లపాటు సినీ రంగాన్ని ఏలిన ఆయన మొత్తం 320 సినిమాల్లో నటించారు. రామారావు మూడు నేషనల్ అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. రామారావు సినీరంగ సేవలకు గుర్తింపుగా ఎన్ టిఆర్ నేషనల్ అవార్డును 1966లో ప్రకటించారు. 

 

రాజకీయ దురంధరుడు

నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఒక చారిత్రక ఘట్టంగా మిగులు తుంది. 1983లో జరిగిన ఎన్నికల్లోతెలు గుడేశం పార్టీ అఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన అనంతరం  రామాావు అనేక ప్రజా సంక్షేమ పథకాలు చేప్పట్టి ప్రజల మెప్పు పొందారు. తెలు గువాడి  ఆత్మస్థయిర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా వినిపంచడంలో బేష్ అనిపించుకున్నారు. . విజయవంతంగా  ఐదేళ్ల పాలనను  పూర్తి చేసుకున్నారు. అయితే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య  రీతిలో తెలుగుదేశం ఓటమి పాలై తిగిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అయితే 1994లో జ రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకుని  తిరిగి అధికారం చేజిక్కించుకుంది. అయితే 1995లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  ఎన్ టిరామారావు ను అవిశ్వాస తీర్మానంతో పదవి నుండి తొలగించి అతనే అధికార భాధ్యతలు చేపట్టారు. 1996 జనవరి 18న ఉదయం గుండెపోటుతో  నందమూరి తారక రామారావు కన్నుమూశారు. అప్పుడు అతని వయసు 72 సంవత్సరాలు. 

director bapu special story

తెలుగు వారు మరచిపోలేని బాపు

అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు. అందమైన ద్వంద్వ సమాసంగా ఆ జంటని సమాదరించారు. బాపు-రమణల స్నేహరాసిక్యతకు నిండుమనసుతో నీరాజనాలెత్తారు. వారిద్దరుకారు ఒక్కరేనని తీర్మానించారు తెలుగువారు. బాపు అరవై అయిదేళ్ల చిత్రకారుడు, యాభై ఏళ్ల చలనచిత్రకారుడు.  తెలుగు సంస్కృతికీ సంప్రదాయాలకు అందచందాలకు బాపు గీసిన తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు.

సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ఈయన అసలు పేరు. తెలుగువాడే కాని, పుట్టింది ప.గో.జి. నరసాపురమే గాని పెరిగిందీ చదివిందీ యావత్తూ మద్రాసులోనే. తండ్రి వేణుగోపాలరావు వృత్తిరీత్యా లాయరు. లక్షింనారాయణ లాయర్ కావాలని తండ్రి ఆకాంక్ష. ‘బాపు’ తండ్రి పెట్టుకున్న ముద్దుపేరు. ఆయన నోటి వాక్యాన బాపు పేరు ఇంటింటి పేరు అయింది. ఖండాంతరాలలో కూడా యీ పేరు అభిమానులను సంపాయించుకుంది. ఆ తరువాత భాగ్యవతిని పెళ్లాడి ఓ ఇంటివారయ్యారు. అది పంధొమ్మిది వందల పిఫ్టీసిక్స్. పెళ్లికూతురు గోవిందరాజుల సుబ్బారావు గారి అమ్మాయి. కొన్నాళ్లు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోలో జర్నలిస్టుగా పనిచేశారు. బాపు గీత అన్ని భాషా పత్రికలలోనూ విరివిగా కనబడి తీరిక లేకుండా అందరినీ అలరించడం మొదలుపెట్టింది.

బాలానంద సంఘం నుంచి బాల పత్రికలోంచి బాపు బొమ్మల కథ మొదలైంది. తర్వాత సాధనమున పనులు సమకూరి, నూత్నయవ్వనదశలోనే కవర్ డిజైన్లు, కామిక్సూ, కార్టూన్లు వేయడం మొదలుపెట్టారు. 1955లో ఆంధ్రపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా చోటు సంపాదించారు. ‘మనవాళ్లు’ శీర్షికన జేబు కార్టూన్లు, ‘గిరీశం’ పేరు మీద స్ట్రిప్ కార్టూన్లూ పేల్చారు. తెలుగునాట యిలాంటి శీర్షికలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. వీటికో ఛందస్సు, వ్యాకరణం, అలంకారం కూర్చింది మనవాళ్లేనని చెప్పడానికి, చెప్పుకోవడానికి మనం వెనకాడక్కరలేదు. అరవైలో రమణ సినిమారంగ ప్రవేశం చేశారు.

బాపు అప్పుడప్పుడు సరదాగా సినిమాలకు పబ్లిసిటీ చిత్రచిత్రంగా చేస్తుండేవారు. బాపు ఫ్రీస్టయిల్ అక్షరాలు వెల్లువగా వచ్చేశాయి. గుండ్రంగా రాయడానికి మనమెందుకు, పోత అక్షరాలను కంపోజ్ చేసుకోవచ్చు కదా అంటూ విప్లవించాడు బాపు. ఇంక అంతే! పుస్తకాల నిండా పత్రికలలో శీర్షికలు, సినిమా పోస్టర్లలో, సైన్ బోర్డులూ అన్నిటా బాపు చేరాతలు నిండిపోయాయి. ప్రింటింగ్ ప్రెస్‌ల వారు గిరాకీని గమనించి బాపు అక్షరాల్ని పోతలు పోయించారు. డెస్క్‌టాప్ ప్రింటింగ్ వచ్చాక రకరకాల బాపు వొరవళ్లని సాప్ట్‌వేర్‌గా రూపొందించేశారు. ఇప్పుడు బాపు బ్రష్, బాపు నిబ్ లాంటి రకరకాలు. అక్షర చరిత్రలో లిపి పరంగా ఒక నూతన అధ్యాయాన్ని సృజించిన బాపు అ-క్షరం. ‘జ్యోతి ’

1967లో ‘సాక్షి ’గా కావ్యరూపం దాల్చింది. బాపు చిత్రకారుడే కాదు గొప్ప చిత్ర దర్శకుడన్నారు. చాలా తక్కువ ఖర్చుతో అంటే రెండున్నర లక్షల్లో సాక్షి చిత్రం పూర్తయింది. డెరైక్టర్‌తోబాటు నటీనటులు, సాంకేతిక వర్గానికి మంచి పేరు తెచ్చింది. తాష్కెంటు ఫిలిం ఫెస్టివల్‌కి ఎంపిక అయింది. సినీజనులు బాపుని తొలి చిత్రంతోనే అభిమానించారు.

శ్రీరామరాజ్యం, భాగవత కథలు సీరియల్‌కీ బాపు గీసిన, గీసుకున్న బొమ్మల గురించి ప్రస్తావించడం బాపుకి ఇష్టం ఉండదు ‘అదేమీ విశేషం కాదు, అది కేవలం నా వీలుకోసం నేను చేసుకునే ఏర్పాటు. అదీ కాస్తో కూస్తో గీతలు వచ్చు కాబట్టి ’’ అంటారు. ఈ సందర్భంలో బాపు శ్రద్ధకి, ఓపికకి ఎవరైనా నమస్కరించాల్సిందే.

madhura singer mohammad rafi songs in telugu also

ఏ బాషలో పాడిన ఈయన గానం మధురం

ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ సినిమాలో ఆయన పాడినవి తెలుగు పాటలు కాదు. కబీర్‌దాసు కీర్తనల్ని హిందీలోనే పాడారు. నాగయ్య మీద గౌరవంతో రఫీ ఆనాటి మద్రాసుకి వచ్చి, పారితోషికం కూడా తీసుకోకుండా ఉచితంగా ఆ సినిమాలో విశేషం.

నాగయ్య అంటే అంత గౌరవం ఉండేది ఆనాటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు. ఇక రఫీ తెలుగులో పాడింది ఎన్టీఆర్ నటించిన 'భలే తమ్ముడు' చిత్రంలో. 'ఎంతవారు కాని వేదాంతులైనగాని వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్' పాటతో ప్రారంభించి ఈ సినిమాలోని అన్ని పాటలనూ రఫీ పాడటం ఒక విశేషం. అగ్రనటులు ఎన్టీఆర్, ఏయన్నార్‌కు ఘంటసాల తప్ప మరో గాయకుడెవరూ పాడని ఆ రోజుల్లో 'భలే తమ్ముడు' చిత్రనిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య ముంబాయి నుంచి రఫీని తీసుకువచ్చి పాడించడం సంచలనం సృష్టించింది.

ప్రతి రోజూ పాటల రికార్డింగ్స్‌తో ఎంతో బిజీగా ఉండేవారు రఫీ. పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉండేది. అటువంటి వ్యక్తి పుండరీకాక్షయ్య అడగ్గానే మద్రాసు వచ్చి చిత్రంలోని ఆరు పాటలను నాలుగు రోజుల్లో పాడేశారు. 'భలే తమ్ముడు' చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి రాశారు. తన గీతాల్లోని భావాన్ని ఆయన రఫీకి ఉర్దులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడంతో రఫీ పని మరింత సులువయింది. 'భలే తమ్ముడు' చిత్రం తరువాత మళ్లీ రఫీ తెలుగులో పాటలు పాడింది ఎన్టీఆర్ చిత్రంలోనే కావడం మరో విశేషం.

హిందీలో విజయవంతమైన 'గీత్' చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న 'ఆరాధన' లో ఆయన అద్భుతమైన పాటలు పాడారు. 'నా మది నిన్ను పిలిచింది గానమై.. నా ప్రాణమై' అనే పాట ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాకి కూడా అట్లూరి పుండరీకాక్షయ్యే నిర్మాత.

రఫీ తెలుగులో పాటలు పాడిన మూడో చిత్రం 'అక్చర్ సలీం అనార్కలి'. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సలీంగా నటించిన నందమూరి బాలకృష్ణకు తన స్వరాన్ని రఫీ అందించడం విశేషం. 'తారలెంతగా మెరిసినో చందురుని కోసం..' వంటి పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు రఫీ. ప్రముఖ సంగీత దర్శకుడు సి.రామచంద్ర ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించడం మరో విశేషం.

  • missamma 1995 movie special story
  • maya bazar movie special story
  • telugu legend actor sr ntr
  • director bapu special story
  • madhura singer mohammad rafi songs in telugu also