GodFather Trailer: Chiranjeevi Adds Mega Mark ‘నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’’

Godfather trailer chiranjeevi is the dangerous and mysterious brahma

God Father Trailer, Megastar Chiranjeevi, Salman Khan, Nayanthara, Puri Jagannadh, Satya Dev, Mohan Raja, Thaman S, R B Choudary, Ram Charan, NV Prasad, Konidela Production Company, Super Good Films, Tollywood, Movies, Entertainment

Megastar Chiranjeevi’s much awaited film Godfather is all set to release on October 5. The film’s trailer was released at the pre-release event which took place in Anantpur. The trailer introduces Chiranjeevi’s character Brahma, who has a huge following but also many enemies in the political world. The video also features Nayanthara and Satya Dev’s characters, who are right in the middle of the fight for power.

మెగాస్టార్ గాడ్ ఫాదర్: ‘‘నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’’

Posted: 09/28/2022 07:51 PM IST
Godfather trailer chiranjeevi is the dangerous and mysterious brahma

మెగాస్టార్ చిరంజీవి నటించారన్న మాట చాలు ఆయన అభిమానులు సినిమాను నాలుగు వారాలు గ్యారంటీగా ఆడిస్తారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో చిరంజీవి. సినిమా బాగుందంటే చాలు ఇక ధియేటర్లలో యాభై రోజుల సందడి షురూ. అదే సినిమా బంఫర్ హిట్ అన్న టాక్ వస్తే.. శతదినోత్సవ వేడుకలు గ్యారంటీ.. కానీ అలాంటి నటుడు రీ-ఎంట్రీ ఇచ్చిన తరువాత ఖైదీ నెంబరు 150 మినహాయించి.. మిగిలిన చిత్రాలు అంతగా రాణించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కినా పిరియాడికల్ చిత్రం సైరా నరసింహరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదని అనిపించినా.. బడ్జెట్ తగ్గట్లు వసూళ్లు రాబట్టలేదు.

ఇక ఆ తరువాత.. ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య.. విడుదల నుంచే నెగిటివ్ టాక్ సోంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు విడుదలయ్యే చిత్రం కచ్చితంగా ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండాల్సిందే. అదే మెగా ఫాన్స్ కొరుకుంటున్నారు. కాగా మెగా అభిమానుల ఆశలను అర్థం చేసుకున్న దర్శకుడు మోహన్ రాజా చిరంజీవి కథానాయకుడిగా రూపోందిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా అందరి అంచనాలను మించినట్టుగా తెరకెక్కిందని చిత్ర ట్రైలర్ చెబుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

"ముఖ్యమంత్రి పీకేఆర్ ఆకస్మిక మరణం .. అతని మరణంతో రాజకీయపరమైన డ్రామాలు మొదలుకావడం .. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎవరికివారు వ్యూహాలు పన్నడం .. ఆ పదవికి అన్ని రకాల అర్హతలు వున్న వ్యక్తి" అనే  వాయిస్ ఓవర్ పై 'గాడ్ ఫాదర్' ఎంట్రీ .. ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. 'నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను' అనే చిరూ డైలాగ్ ట్రైలర్ స్థాయిని పెంచింది. 'గాడ్ ఫాదర్'కి అనుకోని సవాళ్లు ఎదురైనప్పుడు అతనికి అండగా నిలిచే సోల్ గా సల్మాన్ ఎంట్రీ చూపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఫైట్స్ .. డాన్స్ మెగా అభిమానులకు పండగ చేస్తాయనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles