Mahesh Babus mother passes away సూపర్ స్టార్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇకలేరు..

Indira devi veteran telugu actor krishna s wife and actor mahesh babu s mother passes away

Indira Devi, Superstar Krishna, Mahesh Babu, sitara, padmaja, manjula, priyadarshini, mortal remains, Padmalaya Studios, Jubilee Hills, family, friends, well wishers, Telugu cinema, Mahaprasthanam, Hyderabad, Tollywood, Movies, Entertainment

Indira Devi, 70, actor Mahesh Babu’s mother and wife of veteran Telugu actor Krishna, breathed her last in the early hours of Wednesday in Hyderabad, reportedly following a brief illness. A statement from the family said that Indira Devi’s mortal remains will be kept at Padmalaya Studios, Jubilee Hills, for family, friends and well wishers to pay their tributes. The cremation will take place at Mahaprasthanam, Jubilee Hills, Hyderabad.

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ మాతృమూర్తి ఇకలేరు..

Posted: 09/28/2022 12:42 PM IST
Indira devi veteran telugu actor krishna s wife and actor mahesh babu s mother passes away

టాలీవుడ్లో మరో విషాదం అలుముకుంది. సూపర్ స్టార్‌ కృష్ణ సతీమణి, ప్రిన్స్ మహేశ్‌ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ తెల్లవారుజామున పరమపదించారు. అమె మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆమె జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. అలాంటి ఇందిరాదేవి ఇవాళ హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంలో ఘట్టమనేని కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఘట్టనేని ఇందిరాదేవి మరణంవార్త తెలియడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఇందిరాదేవి పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఆమెకు తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సినీహీరో వెంకటేశ్ తదితరులు తుది నివాళి అర్పించారు.

వీరితో పాటు దర్శకులు జీవితా రాజశేఖర్‌, కొరటాల శివ, త్రివిక్రమ్‌, నటులు మురళీ మోహన్‌, మోహన్‌బాబు, నిర్మాతలు అశ్వనీదత్‌, బండ్ల గణేశ్‌, నందమూరి రామకృష్ణ, తమన్‌ తదితరులు ఇందిరాదేవికి తుది నివాళి అర్పించారు. కృష్ణ, మహేశ్‌ సహా ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. నాన్నమ్మ ఇందిరాదేవి పార్థివదేహాన్ని చూసి మహేశ్‌ కుమార్తె సితార తట్టుకోలేకపోయారు. మహేశ్‌ ఒడిలో కూర్చొని  కన్నీటి పర్యంతమయ్యింది. తండ్రి ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చింది. చిన్నారి సితార దుఃఖిస్తుండటం.. అక్కడికి చేరుకున్నవారిని కళ్లు చమర్చేలా చేసింది. కాగా, ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles