Vijayashanthi to contest for medak assembly

Vijayashanthi to contest medak assembly, MP vijayashanthi medak assembly, 2014 electiongs, congress party, TRS Party suspend

Vijayashanthi to contest for medak assembly,

పార్లమెంటు నుండి అసెంబ్లీకి షిఫ్టింగ్

Posted: 08/14/2013 04:52 PM IST
Vijayashanthi to contest for medak assembly

మాజీ నటి, ప్రస్తుత రాజకీయ నాయకురాలు , మెదక్ ఎంపీ అయిన తెలంగాణ రాములమ్మ విజయశాంతి ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురై, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన రాములమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయబోతుందా ? ఇన్ని రోజుల నుండి మెదక్ ఎంపీ సీటు నాదే అని, దాని నుండి నన్ను ఎవరూ తప్పించలేరని, దాని పై కన్నేస్తే బాగుండదని పరోక్షంగా టీఆర్ఎస్ అధినేతకే వార్నింగ్ ఇచ్చిన రాములమ్మ ఇప్పుడు వెనక్కి తగ్గిందని అంటున్నారు. ఈమె పార్టీలో ఉండగా కేసీఆర్ మెదక్ ఎంపీ సీటు నుండి ఈమెను తప్పించి, తను కానీ వేరే వారికి కేటాయించాలని భావించి పలువురి ఆశావాహులకు హామీలు ఇవ్వడంతో విజయశాంతి తట్టుకోలేక పోయింది. ఈ మధ్యన పార్టీతో విభేధాలు ఏర్పడటం, తెలంగాణ ఇచ్చేస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రకటించడంతో పరిస్థితులు మారాయి. దీంతో ఈమె బెట్టు వీడి అసెంబ్లీ నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేయడానికి సుఖం వ్యక్తం చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. 2014 ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం. అలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదనే భావన అందరిలో ఉంది. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తుందో రాదో అనే విషయం క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్రం నుండి పోటీ చేస్తే ఏదో ఒక మంత్రి పదవితో హాయిగా ఐదు సంవత్సరాలు వేలాడవచ్చనే ఆలోచనలో విజయశాంతి ఉన్నట్లు తాజా ఇన్ ఫర్మేషన్.  ఒక వేళ టీఆర్ఎస్ విలీనం అయి, కేసీఆర్ మెదక్ ఎంపీ సీటు ఆశిస్తే... వీరిద్దరికి ఎలాంటి జంజాటం లేకుండా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా విజయశాంతి ప్రతిపాదనకు సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. మరి రాములమ్మ మంత్రి అవుతుందో, కేంద్ర మంత్రిగా పార్లమెంటులో అడుగు పెడుతుందో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more