గత కొన్ని సంవత్సరాల నుండి నలుగుతున్న తెలంగాణ అంశం పై కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు నాన్చి ఇప్పుడు ఆఘ మేఘాల మీద కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ మీటింగులు పెట్టి నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న మర్మం ఏమిటో రాజకీయాలు తెలిసిన ప్రతి వాడికి ఇట్టే అర్దం అవుతుంది. 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ కేంద్రంలో పాగా వేయడానికి, తన ప్రత్యర్ది పార్టీ అయిన బీజేపీకి తెలంగాణ ఇచ్చిన క్రికెట్ పోకుండా ఉండటానికి, అదే టైంలో తెలంగాణ లో కూడా తన ప్రత్యర్ది పార్టీ అయిన టీడీపి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే అని స్పష్టంగా అర్ధం అవుతుంది. తెలంగాణ నిర్ణయం ప్రకటించటం ద్వారా.. భావోద్వేగ ఓటుతో తెలంగాణలో అత్యధిక సీట్లను సొంతం చేసుకోని ఇటు రాష్ట్రంలో, అదే సమయంలో సీమాంధ్రలో టీడీపీకి ప్రతికూల పరిస్థితిని సృష్టించడమే ఈ నిర్ణయానికి అసలు కారణం అని రాజకీయ వర్గాలు అనుకుంటున్న మాట. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకొని, అటు సీమాంద్రలో ఉన్న కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుగొని ఓట్లు మూటగట్టుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దగ్గరకు తీసుకొని టీడీపీకి చెక్ పెట్టే ప్లాన్ లోనే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏడాదిన్నగా జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా తనకు బెయిల్ ఇస్తే యూపీఏకు తన మద్దతు ఉంటుందని, దానికి సంబంధించిన అంశం పై విజయమ్మ పలువురు కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇటు తెలంగాణ, అటు జగన్ తో కాంగ్రెస్ లాభం పొంది టీడీపీకి చెక్ పెట్టడానికే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. చూద్దాం కాంగ్రెస్ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో ?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more