భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో తల పెట్టిన ‘నవ భారత యువ భేరి ’ కి వచ్చిన విషయం తెలిసిందే. తొలిసారిగా హైదరాబాద్ కి వచ్చిన మోడీ ఎన్నిక శంఖారావానికి ఇక్కడి నుండే శ్రీకారం చుట్టారు. ఎప్పటి నుండో మోడీ వస్తున్నాడని ప్రచారం చేసిన ఈ సభ సక్సెస్ అయిదా ? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దీని పైనే చర్చ. యూత్ లో తెగ ఫాలోయింగ్ ఉన్న మోడీ సభకు రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా యువకులు వచ్చారు. మరి మోడీ ప్రసగం యువతను ఆకట్టుకుందా అంటే కాస్తంత ముక్కే విరుస్తున్నారు. మోడీ యువతకు ఎన్నో విషయాలు చెబుతాడని, భవిష్యత్తులో ప్రధాని అయితే ఏం వరాలు కురిపిస్తాడో, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అందులో యువత పాత్ర ఏ విధంగా ఉండాలి అని దిశా నిర్ధేశం చేస్తాడని ఆశించారు. కానీ అనుకున్నంతగా ఏమీ చెప్పలేదని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల పై నొప్పి తెలియకుండా పంచ్ లు విసిరే మోడీ నిన్న మాత్రం ఎన్నికలే లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తూ యువత విషయాల్ని చాలా తక్కువ ప్రస్తావించారు. స్పీచ్ ఇస్తున్నంత సేపు కాంగ్రెస్, చైనా, పాకిస్దాన్ వంటి మాటలే ఎక్కువగా వినిపించాయి. మోడీ నుండి ఏదో ఆశించి, ఎక్కడి నుండో వచ్చిన యువతకు ఏమి ఒరగలేదని, స్పీచ్ లో ఫైర్ తగ్గిందని అనుకుంటున్నారు. సభకు అయితే భారీగా జనం వచ్చారు కానీ, మోడీ ఇచ్చిన స్పీచ్ లోనే పస లేదని అనుకుంటున్నారు. కమలనాధులు జనాన్ని చూసి సభ సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటుంటే, యూత్ మాత్రం కాస్తం నిరాశతో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more