భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ అన్నీ పదవులకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఇదేమి కొత్త విషయం కాదు. ఆ పార్టీ నాయకులకు వింతమే కాదు. ఎందుకంటే.. అద్వానీ అలిగిన ప్రతీసారీ ఇలానే చేస్తాడని పార్టీ లో సీనియర్ రాజీకీయ నాయకులు అంటున్నారు. అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేయడం గత ఎనిమిదేళ్లలో ఇది మూడోసారి. పాక్ పర్యటనలో జిన్నాపై ప్రశంసలు కురిపించినందుకు తీవ్ర విమర్శలు రావడంతో 2005 జూన్ ఏడో తేదీన పార్టీ అధ్యక్షునిగా తొలిసారి రాజీనామా చేశారు. అప్పట్లో జిన్నాను ఆయన 'లౌకిక' నేతగా కొనియాడారు. ఈ వివాదం సద్దుమణగడంతో నాలుగు రోజుల నాయకత్వ సంక్షోభం అనంతరం అద్వానీ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. సంక్షోభ నివారణ జరిగినా ఆర్ఎస్ఎస్, అద్వానీకి మధ్య సంబంధాలు నీరుగారిపోయాయి.
రాజీనామా వెనక్కి తీసుకొని ఏడు నెలలు గడవకుండానే అద్వానీ పార్టీ అధ్యక్ష పదవికి 2005 డిసెంబర్ 31న మళ్లీ రాజీనామా చేశారు. జిన్నా ప్రశంసల వివాదానికి పూర్తి చరమగీతం పాడుతూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ప్రస్తుత అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు అప్పగించారు. ప్రస్తుతం మోడీకి పదోన్నతి కల్పించడంపై అలకపూనిన అద్వానీ మూడో సారి రాజీనామా చేశారు. అయితే ముఖ్య నేతల బుజ్జగింపులతో బిజెపిలో సంక్షోభం ముగిసింది. అద్వానీ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పటం విశేషం. అద్వానీతో పార్టీ సీనియర్ నేతల సమావేశం ముగిసింది. అనంతరం అద్వానీ నివాసంలోనే రాజ్ నాథ్మాట్లాడుతూ మోహన్ భగవత్ సూచన మేరకే అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్వానీ చెప్పినట్లు తెలిపారు. బీజేపీకి మార్గ నిర్దేశం చేసే పెద్ద దిక్కు అద్వానీ అన్నారు. ఈసారి రాజీనామా చేసి 24గంటలు గడవక ముందే .. అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకున్నట్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more