దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవి పై అనేక మంది కన్ను వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ లిస్ట్ లో మరొ పేరు చేరిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత, లోకసభ ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్ పేరు వినిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రధాని పదవి రేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉండగా బాల్ థాకరే తాజాగా సుష్మ పేరును ప్రధాని రేసులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. థాకరే పార్టీ పత్రిక సామ్నాలో సుష్మ ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హురాలని థాకరే అంటున్నారు. బిజెపిలో అత్యంత జనాకర్షణ ఉన్న నేత సుష్మా స్వరాజ్ మాత్రమేనని, ఆమె చతురతతో మాట్లాడుతుందని ఆయన అంటున్నారు. బిజెపిలో ప్రధాని అయ్యే అర్హత కేవలం ఆమెకే ఉన్నాయని మీడియా సాక్షిగా థాకరే చెప్పినట్లు తెలుస్తోంది. సుష్మానే ప్రధాని పదవికి అర్హురాలని, తెలివిగల నేత అని, ఆమె మంచి పర్ఫార్మెన్స్‌ను చూపిస్తుందని తాను అనేకసార్లు చెప్పినట్లు థాకరే పేర్కొన్నారు. కోల్ గేటు వ్యవహారంలో సుష్మా మాట్లాడిన తీరును ఈ సందర్భంగా థాకరే ప్రశంసించారు. కాగా అంతకుముందు కూడా బాల్ థాకరే... తనకు సైన్యాన్నిస్తే, దేశం బెండు తీసేస్తానంటూ సవాల్ విసిరారు. 86 ఏళ్ల వయసులోనూ దేశ సమస్యల నుంచి పాక్ క్రికెటర్ల రాక దాకా పార్టీ అధికార పత్రిక సామ్నాలో పదునైన వ్యాఖ్యలతో ఠాక్రే స్పందించారు. "సైన్యాన్ని అప్పగించి చూడండి. నెల రోజుల్లోనే అన్ని సమస్యలూ కొలిక్కి తెస్తాను. ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయాలపై స్పందిస్తూ.." 2014 కన్నా ముందే ఎన్నికలు జరుగుతాయనేది నా అంచనా. దేశంలో అరాచక పాలన సాగుతోందని ఎప్పుడో నేను చెప్పాను. ఇప్పుడది మరింత పతనావస్థకు చేరుకుంది'' అని వివరించారు. ముంబైలో నేర కార్యకలాపాలకు కారణమైన బీహార్‌కు చెందిన వ్యక్తులను పోలీసులు వేటాడటాన్ని బాల్‌ఠాక్రే సమర్థించారు. బీహార్ సిఎం నితీశ్ అభ్యంతరాలపై తీవ్రంగా స్పందించారు. "చట్టాలు చేసేది ప్రజల కోసమా? ఉగ్రవాదుల కోసమా? అని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more