Kcr delhi sonia abroad

kcr delhi sonia abroad, trs president congress president

kcr delhi sonia abroad

29.gif

Posted: 09/02/2012 06:47 PM IST
Kcr delhi sonia abroad

       kcr_eeffeeeeహెల్త్ చెకప్ కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. తెలంగాణ తేవడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారట. తెలంగాణపై ఈ నెల మూడో వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నదనీ, దీనిపై చర్చించడానికి కాంగ్రెస్ పెద్దలు తనను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించడంతో రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నట్లు కేసీఆర్ తన సన్నిహితుల ద్వారా మీడియాకు లీకులు చేశారు. ఢిల్లీలో సోనియా లేరు.ఆమె ఎప్పుడు తిరిగి వచ్చేది కచ్చితంగా ఎవరూ చెప్పడం లేదు. తెలంగాణలాంటి సున్నితమైన అంశాలను పర్యవేక్షించే ప్రణబ్ ముఖర్జీ రాష్ర్టపతి అయ్యారు. కేసీఆర్ మాత్రం తెలంగాణపై చర్చించడానికి ఢిల్లీకి రమ్మనీ మీడియాకు లీకులందిస్తున్న తీరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
       ఢిల్లీలో ఎవరితో సంప్రదింపులు చేస్తారంటే...ఈ దఫా కొత్తగా యువనేత రాహూల్ను కలుస్తారనే లీకుల్ని కూడా విడుదల చేశారు. తెలంగాణ ఇస్తే పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తారా? లేదా? అనే అనుమానం రాహూల్కు వుందట. సోనియాగాంధీ విదేశాల నుంచి వచ్చే లోపల రాహూల్ అనుమానాల్ని కేసీఆర్ నివ్రుత్తి చేస్తారట. దాని కోసం ముందుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారనీ పార్టీలోని కొందరు నాయకులు పనిగట్టుకుని మీడియా ప్రతినిధులకు ఒకరి చాటుకు మరొకరికి మరీ చెబుతున్నారు. ఇదేమంటే...మీకు మాత్రమే ‘ప్రత్యేకం’ అంటున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ మార్చ్కు టీజేఏసీ, ఢిల్లీలో దీక్షకు బీజేపీ కసరత్తులు చేస్తున్నాయి.
        ఈ తరుణంలో కేంద్రం తెలంగాణ ప్రకటన చేస్తుందనీ, తనను రమ్మందనీ, తాను వెళ్తున్నట్లు కేసీఆర్ మీడియాకు లీకులు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాహూల్ గాంధీతో మాట్లాడటానికి వెళ్తున్నారంటూ మీడియాకు లీకులు చేయడాన్ని ఎవరూ నమ్మడం లేదు. రాహూల్ గాంధీ తనసొంత రాష్ర్టంపైనే పూర్తి అవగాహన లేదనీ, అంతే పెద్ద రాష్ర్టమైన ఏపీపై ఏం అవగాహన ఉంటుందనీ, అది విభజనతో కూడుకున్నదనే విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. రాష్ర్టాన్ని విడగొట్టేంత రాజకీయ పరిణితి రాహూల్ చెందాడనీ తాము అనుకోలేదనీ, కేవలం కేసీఆర్ మైలేజీ కోసమే కొత్త నాటకాలకు తెరలేపాడనే వారు ఉన్నారు. మొత్తానికి విదేశాల నుంచి సోనియా వస్తే కానీ, ఈ సమస్యపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదనేది నగ్న సత్యం. అప్పటి దాకా కేసీఆర్ ఢిల్లీలో ఎవరెవర్ని కలుస్తారో చూడాలి మరి. వీటిని కూడా లీకులు చేస్తారో, లేక సీక్రెట్ గా పెడుతారో!

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp lagadapati warning
Director pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more