కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని అల్లుడుగా చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? అన్నీ కలిసివస్తే ఆయన రేపటి భావి ప్రధాని కూడా. రాహుల్ తన కూతుర్ని పెళ్లాడితే 15కోట్లు కట్నం ఇస్తానంటోంది ఓ మహిళ. అంతటితో ఊరుకోకుండా తన డిమాండ్ ను సాధించుకునేందుకు ఆమె ఏకంగా నిరవధిక నిరాహార దీక్షకే దిగింది. ఏమిటా కథ అంటారా? ఆ మహిళ పేరు ఓం శాంతి శర్మ. చెదురుమదురు వర్షాలను కూడా ఖాతరు చేయకుండా ఆమె జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష సాగిస్తోంది. మౌనంగానే భగవంతుడికి ప్రార్థనలు చేస్తోంది. ఇంతకూ ఆమె మనోగతం ఏమై ఉంటుంది? అందరు తల్లులూ కోరుకున్నట్టే ఆమె కూడా తన కూతురికి ఒక మంచి భర్తను చూపించాలంటూ ప్రార్థనలు చేస్తోంది. ఇందులో విశేషం ఏమీ లేకపోవచ్చు. అయితే ఆమె కోరికలో ఓ ప్రత్యేకత మాత్రం ఉంది.
కాంగ్రెస్ యువనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తన కూతుర్ని పెళ్లాడాలని ఆమె కోరుకుంటోంది. రాహుల్ ఈ పెళ్లికి ఒప్పుకుంటే 15కోట్ల రూపాయలు కట్నం కూడా ఇస్తానంటోంది. మౌనవ్రతంలో ఉన్నందున ఆమె తన డిమాండ్లను నోటితో చెప్పకుండా ఓ ప్లకార్డుపై రాసి పెట్టి మరీ దీక్షకు కూర్చుంది. ప్లకార్డులో ఉన్న సమాచారం చూస్తే ఓం శాంతి శర్మ స్వస్థలం రాజస్థాన్ రాజధాని జైపూర్. అత్తమామలు, తల్లిదండ్రుల ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేస్తోంది. మౌనవ్రతంలో ఉండటంతో ఆమె మాట్లాడటం కానీ లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం కానీ చేయడం లేదని, రోజంతా ఇక్కడే కూర్చుని ప్రార్థనలు చేస్తోందని ప్రత్యక్ష సాక్షులన్నారు. కాగా ఆమెకు మతిస్థిమితం లేనట్టు కనిపిస్తోందని దీక్షకు అనుమతి కూడా తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు న్యూఢిల్లీ రేంజ్ అడిషనల్ డీసీపీ మాత్రం నిరాకరిస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more