Five years for mudigonda massicar

five years for mudigonda massicar

five years for mudigonda massicar

7.gif

Posted: 07/28/2012 11:50 AM IST
Five years for mudigonda massicar

       ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామంలో ఐదేళ్ల క్రితం ఇక్కడ జరిగిన మారణ కాండ నుండి స్థానికులు, బాధిత కుటుంబాలు ఇంకా తేరుకోలేక పోతున్నాయి. పోలీసుల కాల్పుల్లో తమ వారిని కోల్పోయి నేటికి అయిదేళ్లు గడుస్తున్నా వారి తీపి జ్ఞాపకాలను మరువలేక నాటి పీడకలను గుర్తుకు తెచ్చుకోలేక జీవవచ్ఛవంలా బతుకున్నాయి. 2007కు ముందు వరకూ గ్రామం ఎంతో ప్రశాంతంగా వుండేది. ఇక్కడ సొంత ఇంటి స్థలాల కోసం ప్రజలు అనేక సంవత్సరాలుగా పోరాటం చేశారు. వీరి పోరాటానికి సీపీఎం కూడా సై అంటూ రాష్ట్రవ్యాప్తంగాmudigonda_e భూపోరాటానికి ఉద్యమించింది. అది కాస్తా చివరి అంకానికి చేరుకునే సరికి ఉద్రిక్తలకు దారి తీసింది. దీంతో సీపీఎం రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ కు మద్దతుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు హోరెత్తాయి. సిపిఐకి కంచుకోటగా వున్న ముదిగొండలో దాని తీవ్రత మరీ ఎక్కువగా వుండటంతో ఎవరూ ఊహించని విధంగా గంటల వ్యవధిలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. ముందస్తుగా కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా ముందిగొండకు చేరుకున్నారు. దీంతో పోలీసు, ఆందోళన కారుల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అది మరింత తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే నేలకొరిగారు. మరో 15మంది తీవ్రగాయాలపాలై ఆసుపత్రి పాలయ్యారు. రెప్పపాటులో ఏడుగురి అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.
    ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా అందరి దృష్టి ముదిగొండపై పడింది. కాల్పులకు ప్రభుత్వమే కారణమంటూ సీపీఎం మృతదేహాలతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. దీంతో దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది. అంతేకాకుండా ఘటనకు కారణమైన అదనపు ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5లక్షల నష్టపరిహారాన్ని చెల్లిస్తామన్న హామి ఇచ్చి నెరవేర్చింది.  భూ పోరాటంలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సిపిఐ పార్టీ ముదిగొండలో బహిరంగ సభను నిర్వహించనుంది. కార్యక్రమంలో ఆపార్టీ శాసన సభ పక్షనేత, మిర్యాల గూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి  పాల్గొననున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ministers dharmana results
Bumper offer for rahul gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more