హీరోయిన్‌ని చేయాలని శ్రీదేవి తన కూతుళ్ల కడుపు మాడ్చుతోంది. పిల్లల దగ్గర చాలా కఠినంగా ఉంటుంది’’ అని కొంతమంది అనడం నేను విన్నాను. ఆ మాటలు నాకెంతో బాధ కలిగిస్తాయి. ఏ తల్లయినా తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటుంది కానీ కడుపు మాడ్చాలనుకోదు. నేను సెలబ్రిటీ అయినందుకు ఇలాంటి నిందలు భరించాల్సి వస్తోంది అన్నారు శ్రీదేవి ఆవేదనగా. ఒకప్పుడు వెండితెరను ఏలిన ఈ అందాల సుందరికి నేటికీ ఎంతోమంది అభిమానులున్నారు. దాదాపు 15ఏళ్ల గ్యాప్ తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంలో నటించారామె. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంలో ఈ చిత్రం విశేషాలు చెబుతూ శ్రీదేవి తన మనసుని ఈ విధంగా ఆవిష్కరించారు..నా నాలుగవ ఏట నుంచి మేకప్ వేసుకోవడం మొదలైంది. పెళ్లయ్యేంతవరకు సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ప్రతి స్త్రీ పెళ్లి చేసుకుని సెటిలవ్వాలనుకుంటుంది. నాకూ ఆ కోరిక ఉండేది. అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా కుటుంబానికి అంకితమయ్యాను. సినిమా అనే పెద్ద ప్రపంచంలోంచి కుటుంబం అనే చిన్న ప్రపంచలోకి అడుగుపెట్టాను. ఆ చిన్ని ప్రపంచం నాకెంతో ఆనందాన్నిచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత వారి ఎదుగుదలకు సంబందించిన ఏ అంశాన్ని మిస్ కాకూడదనుకున్నాను. పిల్లలు తొలి అడుగు వేసినప్పుడు, ‘మమ్మీ’ అని తొలిసారి పిలిచినప్పుడు స్వయంగా విని ఆనందపడ్డాను. మొదటిసారి స్కూల్‌కి వెళ్లినప్పుడు.. ఇలా మా అమ్మాయిలు జాన్వి, ఖుషీలకి సంబంధించినది ఏదీ మిస్ కాలేదు. ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లయ్యారు. నేను సినిమాల్లో నటిస్తే చూడాలనుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో దర్శకుడు బాల్కీ సతీమణి గౌరి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ గురించి చెప్పారు.
గౌరి చెప్పిన కథ నా హృదయాన్ని హత్తుకుంది. చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తే బాగుంటుందనుకున్నాను. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రతి భార్య ఇందులో నా పాత్రతో తనని తాను పోల్చుకుంటుంది. భర్త, పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియని ఓ మహిళ అనుకోకుండా ఒంటరిగా న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. బయటి ప్రపంచం తెలియని తను అక్కడ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఎన్ని తంటాలు పడుతుంది? ఇండియాలో ఉన్నప్పుడు తన విలువ తెలుసుకోని కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆమె సేవలను ఎలా కొనియాడారు? అనేది ఈ చిత్రకథ. ఏళ్ల తర్వాత కెమెరా ముందుకొచ్చినా నాకు కొత్తగా అనిపించలేదు. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు జాన్వి, ఖుషికి స్కూల్ ఉండేది. స్కూల్ నుంచి నేరుగా షూటింగ్ జరుగుతున్న స్టూడియోకి వచ్చేవాళ్లు. ఒక్కోసారి ఫ్రెండ్స్‌ని కూడా తీసుకువచ్చేవాళ్లు. ఆ తర్వాత స్కూల్ శెలవులివ్వడంతో నాతో పాటు షూటింగ్స్‌కి వచ్చేవాళ్లు. ఈ చిత్రం షూటింగ్ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. రిలీజ్ కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. టెన్షన్ మాత్రం పడటంలేదు. సినిమా విజయం మీద పూర్తి నమ్మకం ఉంది.
మా పెద్దమ్మాయి జాన్వీని హీరోయిన్‌ని చేయబోతున్నానని, ఫలానా హీరో కుమారుడి సరసన మా అమ్మాయి నటించబోతోందని చాలా వార్తలు వచ్చాయి. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి కాబట్టి.. ఏది పడితే అది తిననివ్వనని కూడా మాట్లాడుకుంటున్నారు. నేనెంత హీరోయిన్ అయినా ఒక తల్లిని. మా అమ్మాయిలు ఒక్క పూట సరిగ్గా తినకపోయినా నేను కంగారు పడిపోతుంటాను. వారికి జలుబు చేస్తే చాలు టెన్షన్ పడిపోతాను. వాళ్లకి పరీక్షలప్పుడు నాకు పెద్ద పరీక్ష. రాత్రిపూట, తెల్లవారుజామున ఇద్దరూ చదువుతుంటే నేను కూడా వాళ్లతో పాటు నిద్ర మానుకుంటాను. ఇవన్నీ తెలియక కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు. మా అమ్మాయిని ఇప్పుడప్పుడే సినిమాల్లోకి పంపించే ఉద్దేశం లేదు. జాన్వి వయసిప్పుడు 15. తనింకా బాగా చదువుకోవాలి.. హీరోయిన్ అవ్వాలా? లేదా? అనేది పూర్తిగా తన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.
నేను వారానికి రెండు సార్లు మా అమ్మాయిలతో టెన్నిస్ ఆడతాను. ఇటీవల ఒక హెల్త్ క్లబ్‌లో ‘మీ ఇద్దరూ సన్నగా ఉండటం కోసం మీ అమ్మగారు కఠినమైన వర్కవుట్లు చేయిస్తున్నారు. అందుకే మీతో పాటు టెన్నిస్ కూడా ఆడుతున్నారు’ అని ఎవరో జాలి చూపించారట. అందుకు జాన్వి నా దగ్గరకు వచ్చి ‘ఎవరేమన్నా పట్టించుకోవద్దమ్మా. నా ఆరోగ్యం కోసం నేను వర్కవుట్ చేస్తున్నాను. అంతేకానీ నువ్వు ఒత్తిడి చేయడంవల్ల కాదు’ అని నాతో చెప్పింది. సరదాగా నవ్వుకున్నాను. నేను హీరోయిన్ కాబట్టి, నా కూతుళ్లు కూడా హీరోయిన్ అవ్వాలని రూల్ లేదు. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంవల్ల నేను చదువుకోలేకపోయాను. కానీ మా పిల్లలకు అలా జరగకూడదు. వాళ్లిద్దర్నీ బాగా చదివించాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మాయిలు రైట్ టైమ్‌లో పెళ్లి చేసుకుని, సెటిలైతే నాకు అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. ఇక నా విషయానికొస్తే.. ఏడాదికి ఒకట్రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా. అది కూడా మంచి కథ, పాత్రలు వస్తేనే ఒప్పుకుంటాను. లేకపోతే.. నాకెలాగూ నా చిన్ని ప్రపంచం ఉంది. నా భర్త, పిల్లలతో ఆ ప్రపంచంలో ఆనందంగా గడిపేస్తా.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more