Rgv claims threats from jagan aide

RGV claims threats from Jagan aide, Film director Ram Gopal Varma is in news again, YS Jagan, Varma , Casu,

RGV claims threats from Jagan aide

RGV.gif

Posted: 06/01/2012 03:05 PM IST
Rgv claims threats from jagan aide

RGV claims threats from Jagan aide

ఒకటి రెండు రోజుల్లో వర్మ స్వయంగా హైదరాబాద్‌ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడటం వంటి అనేక ఆరోపణలకు సంబంధించి ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైకాపా అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరో తీవ్రమైన అభియోగాలతో కూడిన కేసులో చిక్కుకోబోతున్నారా?. రక్తచరిత్ర రెండవ భాగంలో తనను పోలిన పాత్రకాని, తనకు సంబంధించిన సన్నివేశాలు కాని ఉండరాదంటూ జగన్‌ తనను బెదిరించారంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చేసిన సంచలన వ్యాఖ్యల నేపధ్యంలో జగన్‌పై క్రిమినల్‌ కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.వర్మను జగన్‌ బెదిరించాడంటూ విశాఖజిల్లాలో ఎన్నికల పర్యటనలో ఎంపి రాజ్‌గోపాల్‌ సంచలన ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత మీడియాలో వర్మ ఆ విషయాన్ని నిర్ధారించారు. రక్తచరిత్ర రెండవభాగం చిత్రీకరణ ముగిసిన తరువాత జగన్‌ తనకు అత్యంత సన్నిహిత వ్యక్తిద్వారా బెదిరించారంటూ వర్మ ‘నా ఇష్టం పుస్తం’ విడుదల సందర్భంగా తనతో చెప్పారని, ఎంపీ రాజ్‌గోపాల్‌ వెల్లడించారు. ఆ తరువాత తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులతో వర్మ ఆ విషయం నిజమే అని ధృవీకరించారు. దాన్ని ట్విట్టర్‌లోనూ ఉంచారు. ఇప్పటికే సినీరంగంలో మాఫియా కార్యకలాపాలపై పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్న నేపధ్యంలో సాక్షాత్తూ జగనే తనను బెదిరించారంటూ వర్మ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిం చాయి. అంతేకాకుండా అతడిని బెదిరించిన, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఎవరు అన్నదానిపై కూడా సర్వత్రా చర్చ ప్రారంభమైంది.

కొద్దిరోజుల క్రితం సూరిహత్యకేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్‌ అలియాస్‌ భానుకు తుపా కులు సరఫరా చేసిన కేసులో అరెస్ట్‌ అయిన పులివెందులకు చెందిన మంగళికృష్ణ భానుకు అత్యంత సన్నిహితుడు కావడంతో అతడే వర్మను బెదిరించి ఉంటాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో వర్మ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వర్మ సన్నిహితులు అంటున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan warring to omc mining sasikumar
Lagadapati rajagopal comments on ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more