Ram charan teases tamannaah about marriage

Ram Charan teases Tamannaah about marriage,Tamanna and Ram Charan Chit Chat Show,Ram Charan Instant Comedy Punch, Ram Charan and Tamanna Special Chat Show, Ram Charan Spontaneuous Comedy Satires, Ram Charan and Tamanna Chemistry

Ram Charan teases Tamannaah about marriage

Charan.gif

Posted: 05/07/2012 01:32 PM IST
Ram charan teases tamannaah about marriage

Ram Charan teases Tamannaah about marriage

రానా పెళ్లి గురించి రామ్ చరణ్ చాలా బాధపుడుతున్నాడట. అందుకోసం రానా పెళ్లి విషయంలో హీరోయిన్ తమన్నా హెల్ప్ అడిగినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ అడిగిన వెంటనే తమన్నా కూడా ఓకే చెప్పిందని టాలీవుడ్ న్యూస్. 'రచ్చ' సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్‌చరణ్‌, తమన్నా జంటతో టామ్‌ అండ్‌ చెర్రీ' పేరిట ఓ టీవీ ఛానల్‌ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చరణ్‌, తమన్నాలు 'రచ్చ' సినిమా అనుభూతులూ, అనుభవాలతోబాటు, తమ వ్యక్తిగత విషయాలను కూడా ముచ్చటించుకున్నారు. ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవడం, అభినందించుకోవడం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా తమన్నాను అలనాటి కథానాయిక రాధతో పోల్చాడు చరణ్‌.

'మా డాడ్‌ కాంబినేషన్లో అప్పట్లో డ్యాన్స్‌ పక్కాగా, పోటాపోటీగా రాధాగారు చేసేవారు. ఇద్దరూ డ్యాన్స్‌ చేస్తుంటే ముచ్చటేసేది. ఇప్పటి కాలంలో మళ్లీ మీరు (తమన్నా) అలా రాధగారిలా డ్యాన్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా 'వానా వానా వెల్లువాయే' పాటలో మీ డ్యాన్స్‌ అదుర్స్‌' అంటూ చరణ్‌ పొగడటంతో తమన్నా ఆనందంతో సిగ్గు మొగ్గయింది. తన స్నేహితుల కోసం 'రచ్చ' సినిమా ప్రత్యేక షోను తాను ముంబైలో ఏర్పాటుచేశానని, 70 మంది మిత్రులు చూశారని తమన్నా చెప్పింది. తన తల్లి తనకు ఉత్తమ విమర్శకురాలు అని చెప్పింది. రచ్చ సినిమా ఆమెకు బాగా నచ్చిందట.

Ram Charan teases Tamannaah about marriage

ఇదే సందర్భంలో తమన్నా ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది. తాను ఏ హీరోతో నటిస్తే, ఆ హీరోకి పెళ్లి అయిపోతోందని తమన్నా ఓ సెంటిమెంట్‌ తెరపైకి తెచ్చింది. 'అల్లు అర్జున్‌తో బద్రీనాథ్‌ చేస్తుండగా అతనికి పెళ్లయింది. కార్తీతో ఓ సినిమా చేస్తుండగా అతనికి అయిపోయింది. అలాగే, యన్టీఆర్‌తో ఊసరవెల్లి చేస్తుండగా అతనూ ఓ ఇంటివాడైపోయారు. ఇక మీతో (చరణ్‌) రచ్చ చేస్తుండగా మీకూ పెళ్లి కుదిరిపోయింది' అంది తమన్నా నవ్వుతూ. సరిగ్గా ఇదే సమయంలో చరణ్‌ ఆమెకు ఓ సలహా ఇచ్చాడు. 'రానాతో ఓ సినిమా చేయాండి. అప్పుడు నీకూ పెళ్లయిపోతుంది' అన్నాడు. దాంతో ఆమె పగలపడి నవ్వింది. మరి 'రానాతో చేస్తావా ?' అని రెట్టించి అడిగాడు చరణ్‌. క్షణం ఆలోచించి తమన్నా, 'నేను ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు రానాతో చేస్తాను...సరా !' అంది గడుసుగా. ఇలా సరదా సరదాగా...ఒక్కోసారి ప్రశ్నకు సూటి సమాధానంతో మరోసారి ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఆసక్తికరంగా సాగింది.

Ram Charan teases Tamannaah about marriage

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh mahesh babus svsc
Sachin tendulkars new hairstyle causes much grief to his fan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more