నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కృషికి తగ్గ ఫలితం లభించినప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో ఇప్పటికే పలు చిత్రాల విజయాలు నాకు తెలియజేశాయి. ఇప్పుడు మరోసారి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నా అన్నారు హన్సిక. ఈ బ్యూటీని ఇంత ఆనందానికి గురి చేసిన చిత్రం ‘ఓకే ఓకే’. పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? ఇది తమిళ చిత్రం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్, హన్సిక జంటగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యింది.
ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించడంతోపాటు హన్సిక చేసిన పాత్రకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఓకేఓకేలో నేను మీరా పాత్ర చేశాను. ఈ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత మీరాకి దూరమయ్యామే అనిపించింది. అంతగా ఈ పాత్రలో ఒదిగిపోయాను అని చెప్పారు. తమిళంలో హన్సిక అందుకున్న నాలుగవ విజయం ఇది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హన్సిక చేతిలో 7 సినిమాలున్నాయి. వాటిలో విష్ణు సరసన ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. అలాగే, త్వరలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఒక సినిమా అంగీకరించారు. ఇంకా తమిళంలో శింబుతో రెండు సినిమాలు, సూర్య సరసన ఒక సినిమా, ఆర్యతో ఒక సినిమా, ఇంకా పేరు (మరో హీరో) ఖరారు కాని ఒక సినిమా చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని చిత్రాలా? అని హన్సికను అడిగితే -‘‘ఈ చిత్రాలకు పర్‌ఫెక్ట్‌గా డేట్స్ కేటాయించాను. అందుకని నో ప్రాబ్లమ్. కెరీర్ ఇంత బిజీగా ఉండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ ప్రేక్షకులు అభిమానించడంవల్లే ఇంత జోష్‌గా సినిమాలు చేయగలుగుతున్నాను. అందుకని ప్రేక్షకులకు, నా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పారు.
ఈ అందాల భామ సంగతి గొప్పలు చెప్పి... చంకలు కొట్టుకుంటుందని టాలీవుట్ వర్గాలు అంటున్నాయి. హన్సిక చేతిలో ఏడు సినిమాలు ఉన్నంత మాత్రనా.. గొప్ప హీరోయిన్ అయిన నట్లు ఫీలైపోతుందని టాలీవుడ్ హీరోయిన్స్ అంటున్నారు. ఎంతైన హీరోయిన్స్ కాదండి.. ఎవరి పోటి వారికి ఉంటుంది. పోటీ ఉంటేనే.. కదా తనలోని నటన బయటపడుతుందని సినీ ప్రముఖులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more