How dr afridi helped americans

How Dr Afridi helped Americans? World News, Al Qaeda, Osama bin Laden,

How Dr Afridi helped Americans?

Afridi.gif

Posted: 02/11/2012 01:27 PM IST
How dr afridi helped americans

How Dr Afridi helped Americans?

అల్ ఖైదా నేత, అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను పట్టించింది అప్రిదీ అని అంటున్నారు. అప్రిదీ అంటే పాకిస్థాన్ కు చెందిన క్రికెట్ ప్లేయర్ సాహీద్ అప్రీద్ కాదు , ఇతను కూడా పాకిస్థాన్ డాక్టర్ అఫ్రిదీ. కాకపోతే ఒసామా బిన్ లాడెన్ పట్టించటానికి అమెరికా గూఢచార సంస్థ తరపున పని చేశాడు. అయితే ఈ డాక్టర్ అప్రిదీ కు పాకిస్థాన్ నుండి పెద్ద సమస్య వచ్చిపడింది. అతన్ని పాకిస్థాన్ ప్రభుత్వం దేశ ద్రోహ నేరం కింద జైల్లో పెట్టాలని చూస్తుందట. మరొ పక్క అమెరికా ప్రభుత్వం ఈ డాక్టరు కు చేదోడుగా నిలిచి ఆయనకు అమెరికా పౌరసత్వాన్ని కట్టబెట్టి.. పాకిస్థాన్ కు బలమైన సంకేతాలు పంపాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు పావులు కదుపుతున్నారని నిపుణులు అంటున్నారు
అసలు లాడెన్ ను అమెరికా ఎలా పట్టించాడు?

అప్పటి అమెరికా గూఢచార సంస్థకు ఉప్పందింది. లాడేన్ అబోతాబాద్ లోని ఎత్తు గోడల ఇంట్లో మకాం వేసినట్లు సమాచారం లభించిందిగానీ దాన్ని నిర్థారించుకునేదెలా ? అన్న మీమాంసలో పడిపోయింది. అప్పుడు డాక్టరు అఫ్రిదీ సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని తాజాగా అమెరికా రక్షణ మంత్రి లియాన్ పనెట్టా కూడా ద్రువీకరించారు. లాడెన్ పని పూర్తి చేసేందుకు డాక్టరు అఫ్రీదీ అందించిన సహకారం ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించారు. ఈ నేపత్యంలో అసలు పాకిస్థాన్ వైద్యాధికారి అయిన అఫ్రిదీ .. అమెరికా గూఢచార సంస్థకు ఎలా సహకరించారన్నది ఆసక్తికర అంశంగా తయారైంది.

డాక్టర్ అప్రిదీ ఉన్నత కుటుంబం కలిగి మంచి వ్యక్తిగా పేరుంది. 1990 లో పెషావర్ లోని ఖైబర్ మెడికల్ కాలేజీలో చదివిన ఆయన పెషావర్ చుట్టు పక్కల గిరిజన ప్రాంతానికి వైద్యాధికారిగా పని చేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ కోరిక మేరకు ఆయన ప్రజలకు హెపటైటీస్ టీకాలిచ్చే పేరుతో అబోతాబాద్ ప్రాంతంలో .. అనధికారికంగా ఓ నకిలీ టీకాల కార్యక్రమాన్ని చేపట్టి .. అందులో భాగంగా ఓ నర్సును లాడెన్ నివాసం ఉంటున్న ఇంట్లోకి పంపించాడని తెలుస్తుంది. ఇందుకోసం అప్రిదీ అదే ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని మకాం ఉంటూ.. స్థానికంగా ఒక నర్సును ప్రత్యేకంగా నియమించుకున్నారని పత్రికలు వెల్లడించాయి. పథకం ప్రకారం ఆమె లాడెన్ ఇంట్లోకి వెళ్లి కనీసం ఒక్కరి నుంచైనా రక్తం నమూనా తీసుకురావాలి. ఆ రక్త నమూనాల ఢీఎన్ఏ పరీక్షలో అది లాడెన్ కుటుంబీకులదేనని స్పష్టమైతే.. సీఐఏ కు కావాల్సిన కీలక ఆధారం లభించినట్టే . చివరకు ఆ నర్సు లాడెన్ ఇంట్లో కి విజయవంతంగా వెళ్లగలిగిందని, అయితే ఆమె రక్థ నమూనాలు తేగలిగిందా? లేదా? అన్నది మాత్రం స్పష్టం కావటం లేదని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఇక్కడే డాక్టరు ఒక చేదు అనుభవం ఎదురైంది. తన సహ వైద్యులు కొందరు ఈ విషయన్ని ముందే పసిగట్టారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే డాక్టరు అప్రిదీ సరైన అనుమతులు లేకుండానే జామ్రుద్ ఆసుపత్రి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఐదారు టీకాలుంచే శీతల పెట్టెలను తీసుకున్నట్లు వారు గుర్తించటం జరిగిందట. అలాంటి సమయంలో అబోతాబాద్ ప్రాంతంలో అధికారికంగా ఎటువంటి టీకాల కార్యక్రమం లేకపోయినా అప్రిదీ వీటినెందుకు తీసుకున్నట్టని వారు అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారట. మరికొందరు వైద్యులైతే గత సంవత్సరం అప్రిదీ తరచుగా ఆసుప్రతి విధులకు గైర్హాజరవట్టాన్ని చూసి ఆయనేదో వివాహేతర కార్యకలాపాలు నడిపిస్తున్నాడని తమలో తాము అనుకున్నట్లు కూడా చెప్పుకున్నారట.

లాడెన్ ఆచూకీ కచ్చితంగా నిర్థారణ అయిన వెంటనే.. గత మే 2న అమెరికా సైనికులు ఆ అబోతాబాద్ ఇంటిపై దాడి చేసి లాడెన్ ను హతమార్చిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం సరిగ్గా 3 వారాలకు పాకిస్థాన్ గూఢచార సంస్థ అధికారులు అఫ్రిదీని అరెస్టు అరెస్టు అయిన తరువాత ఆయన భార్య పిల్లలు పెషావర్ లోని ఇంటి నుంచి పరారయ్యారు. అయితే అప్రిదీ పై విదేశీ గూఢచార సంస్థతో చేతులు కలిపి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడటం, దేశ ద్రోహం నేరాలపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే నిర్థారణ అయితే అప్రిదీకి ఉరిశిక్ష తథ్యం. అందుకే అమెరికా ప్రభుత్వం తమకు సహకరించిన అప్రిదీ రక్షణ కోసం ఇప్పుడు నానా తంటాలు పడుతోంది.
మరో ముఖ్యాంశమేమంటే ఒక వేళ పాక్ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గో, లేక మనసు మార్చుకునే అప్రిదీని విడుదల చేసేసినా .. లాడెన్ ను అభిమానించే వారు మాత్రం ఆయనను వదిలిపెట్టబోరనీ, వారంతా అవకాశం దొరికితే ఆయనను కబాబ్ చేసుకుని , నమిలి మింగేయ్యాలన్నంత కోపంతో ఉన్నారని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తుండటం .. అప్రిదీ భవిష్యత్తు పై కమ్ముకున్న నీలినీడలను స్పష్టంగానే పట్టి చూపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana daggubati
State to crack six whips in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more