Cm kiran kumar to tour in medaram ahead of jatara

CM Kiran Kumar to tour in Medaram ahead of jatara,Chief minister N Kiran Kumar Reddy,Andhra Pradesh Chief Minister N Kiran Kumar,Ponnala lakshmaiah,Chief Minister N Kiran Kumar Reddy and Tirupati MLA Chiranjeevi went to Medaram,

CM Kiran Kumar to tour in Medaram ahead of jatara.

CM Kiran.gif

Posted: 02/03/2012 05:47 PM IST
Cm kiran kumar to tour in medaram ahead of jatara

CM Kiran Kumar to tour in Medaram ahead of jatara

ఎవరికైన దేవుడు అంటే భక్తి ఉంటుంది .. కాబట్టి .. మనం దేవుడి నమస్కారించో లేక కాళ్ల మీద పడి మన మనస్సులో ఉన్న కోరికలు తీర్చమని .. కోరుకుంటాం. అదే దేవుడు కాదనుకో ఏం చేస్తాం? ఏదో తూలమో , ఫలమో ఇచ్చి మన పనులు చేయించుకుంటాం. ఒక వేళ ఉద్యోగం చేసే బాస్ దగ్గర మెప్పుపొందలంటే ఏం చేస్తాం? బాస్ పిలవ ముందే వెళ్లి.. ఆఫీసులో జరుగుతున్నవిషయాలను, కొన్ని ఉన్నవి, కొన్నిలేనివి కల్పించి .. బాస్ చేవులో తుమ్మెదల సంగీతం వినిపిస్తాం. ఒక వేళ అప్పటికి బాస్ మనస్సు కరగలేదనుకో.. బాస్ కు ఏం కావాలో తెలుసుకొని, అంటే మందు, మటన్ లేదా చికెన్, లాంటివి పెట్టి మెప్పుపొందాలని చూస్తాం. అయిన బాస్ అప్పటికి కరగలేదనుకో.. ఫైనల్ గా ఖరీదైన గిప్ట్ లు ఇచ్చి, బాస్ చేత కావలసిన పనులు చేయించుకుంటాం. ఇంతవరకు బాగా ఉంది. ఇలాంటివి ఎక్కడైన జరగటం సహజమే.

కానీ తన సొంత లాభం కోసం తన వయస్సును మరచిపోయి .. తనకంటే చిన్నవాడైన ప్రముఖ వ్యక్తి కాళ్లు ఒక మంత్రి పట్టుకోవటం చాలా విడ్డురంగా ఉందని ఆయనను ప్రజా నాయకుడిగా ఎన్నుకున్న ప్రజలు అంటున్నారు. ఇది ఎక్కడో జరిగిన విషయం కాదండి? స్వయాన మన రాష్ట్రంలో జరిగిందేనని చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న మేడారం మహాజాతరలో జరిగిన విషయమని అంటున్నారు.

ఆయన రాష్ట్ర మంత్రి కేబినెట్ లో ఐటి శాఖ మంత్రి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. మేడారంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మల జాతరలో 80 లక్షల నుంచి కోటి మంది భక్తుల నడుమ ఆయన ఈ పని చేశాడట. మేడారంలోని సమ్మక్క-సారలమ్మ జాతర కోసం తన మొక్కులు తీర్చుకోవటానికి రాష్ట్రముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివార్యులతో అక్కడి చేరుకున్నాడట. అక్కడి ఆచారం ప్రకారం సీఎం తన మొక్కులు తీర్చుకుంటున్న సమయంలో అక్కడ విచిత్రమైన సన్నివేశం జరిగిందని, అది చూసిన వారంత అవాక్కయ్యరని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తులాభారం వేశారట. సమ్మక్క-సారలమ్మ తల్లులకు తనెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పిస్తు.. సీఎం బరువు 78కిలోల 500 గ్రాముల ఉండగా అమ్మవార్ల గద్దెల ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తులాభారం వద్ద బంగారం తూకం వేసి మొక్కులు చెల్లించారట. అయితే దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య అమ్మవార్లకు పట్టువస్త్రాలు తీసుకురాగా సమ్మక్క గద్దె వద్ద పూజారి కృష్ణయ్య, సారలమ్మ గద్దెవద్ద పూజారి కాక సారయ్య ప్రత్యేక పూజలు జరిపించారట. అయితే సీఎం పాటు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం వచ్చి పూజలు జరిపించాడట. అక్కడే ఉన్న జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య తన భక్తి భావం చూపించాడని అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు.

పొన్నాల ప్రభు భక్తి

మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. ముఖ్యమంత్రిపట్ల ప్రభు భక్తిని ప్రదర్శించుకున్నారు! జాతరకు వచ్చే సీఎంలు తులాభారం తూగి, బంగారాన్ని (బెల్లం) వనదేవతలకు సమర్పించుకోవడం ఆనవాయి తీ. అయితే, ఆయన కాళ్లను పూర్తిగా త్రాసులో ఉంచేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో పొన్నాల స్వయంగా సీఎం కాళ్లను ఒక్కటొక్కటిగా పట్టుకొని త్రాసులో ఉంచారట. అంతేకాకుండా హనుమంతుని మించిన భక్తి భావంతో ఆయన కాళ్లవద్ద కూర్చున్నారట. పొన్నాలను సీఎం వారించకపోగా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారట. తనకంటే చిన్నవాడైన కిరణ్ కాళ్లను పొన్నాల పట్టుకొని త్రాసులో పెట్టాల్సిన అవసరమేమిటని అక్కడివారు చేవులు కొరుక్కున్నారని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు.

ఒక ఐటి శాఖ మంత్రి ఇలా చేయ్యటం బాగులేదని .. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాంధీభవన్ లో గుసగుసలాడుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress hansika denies affair with prabhu deva
Tamanna to romance mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more