Mla chiranjeevi and balakrishna political

MLA Chiranjeevi and Balakrishna Political, 150 Chiru MOvie, Balakrishna entry in politics, TDP Party , Chandra babu Naidu, Nandamuri taraka ramarao,

MLA Chiranjeevi and Balakrishna Political

Chiranjeevi.gif

Posted: 01/17/2012 03:19 PM IST
Mla chiranjeevi and balakrishna political

Chiranjeevi and Balakrishna Political

సినిమా నుండి రాజకీయాల్లోకి వచ్చి మెగా స్టార్ ఎమ్మెల్యే చిరంజీవి తన స్థానాన్ని నిరుపించుకున్నాడు.  చిరు రాజకీయల్లోనే ఉంటే ఇక  సినిమాల్లో నటించడని అప్పట్టలో పుకార్లు షికార్లు చేసినాయి. కానీ చిరు తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేసిన తరువాత కాంగ్రెస్ లో  చిరు మెగాస్టార్ గా మారిపోయాడు.  కాంగ్రెస్ అధిష్టనం సైతం చిరుకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన విషయం తెలిసిందే. చిరు రాష్ట్ర రాజకీయల్లో  అయితే  సీఎం కూడా  చిరు మాటను గౌవరవించే స్థాయిలో చిరు ఎదిగిపోయాడు. చిరు రాజకీయల్లో ఒక్కొ మొట్టు ఎక్కుతూ ముందు పోవటం  చూస్తుంటే.. రాబోయే రోజుల్లో  చిరు సీఎం అయిన ఆశ్చర్యం లేదని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు.

          అయితే చిరంజీవి రాజకీయాల్లో ఉండటం వలన  సినిమా అభిమానులకు   చిరు దూరం అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.  ఎమ్మెల్యే చిరంజీవి ఇప్పటి వరకు 149 సినిమాల్లో నటించి విజయం  సాదించారు. కానీ చిరు చర్రితలో నిలిచిపోవలంటే .. 150 సినిమా తప్పని సరిగా ఎమ్మెల్యే చిరంజీవి  నటించాలి.  గతంలోని చిరు 150వ సినిమా చేస్తానని మెగా అభిమానులకు మాట ఇచ్చారు. అదీ ఇప్పుడు నిజం కాబోతుందట.

మళ్ళీ సినిమాలలో నటిస్తానని, త్వరలోనే తన 150వ సినిమా ప్రారంభం కానుందనిఎమ్మెల్యే చిరంజీవి అభిమానులకు హామీనిచ్చారు. సంక్రాంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలసి బెంగళూరు నగరంలోని గెస్ట్‌హౌస్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ని కర్ణాటాంధ్ర మెగాస్టార్ బ్లడ్ బ్రదర్స్ సేవా సమితి తరఫున అభిమానులు సోమవారం కలిశారు. ఆయనతో దాదాపు 30 నిముషాలపాటు చర్చలు జరిపారు.  150వ సినిమాతో మళ్లీ అభిమానుల చెంతకు వస్తానని చిరంజీవి ప్రకటించడంతో అభిమానులు పులకించారు. సమితి అధ్యక్షుడు బి.జి.నాగేంద్ర తమ సంస్థ అమలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మెగాస్టార్‌కు వివరించారు.

చిరంజీవి సినిమాల నుంఢి రాజకీయాల్లోకి వెళ్లటంతో .. ఇక సినిమా ఇండస్ట్రీలో నేనే అంటూ   నటుడు క్రీ.శే.లు నందమూరి  తారక రామారావు కొడుకు  నందమూరి  బాలకృష్ణ అనేక సార్లు అనటం జరిగింది. బాలయ్య తన సినిమాల సంఖ్యను సెంచరీ చేయ్యాలనే ఉద్దేశంతో సినిమాల బిజీగా ఉన్నడని తెలుస్తోంది.  కానీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు (బావ) కోసం బాలయ్య రాజకీయాల్లోకి వస్తాడని తెలుగు దేశం సీనియర్ నాయకులు అంటున్నారు.  అదీ ఎంత నిజమో  బాలయ్య చేబుతాడు.

నాన్న అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవకు అంకితమవుతానని ప్రముఖ తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాశీర్వాదం ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని ఆయన పేర్కొన్నారు. నాన్నగారి ఆశయసాధనకు కృషి చేస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. తన తల్లి జ్ఞాపకార్థం ప్రారంభించిన బసవతారకం మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికై నిధుల సేకరణకోసం ఆయన మస్కట్‌లో పర్యటించారు. దీనిలో భాగంగా ఓ విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ తనకు లభించిన ఘన స్వాగతాన్ని ఎన్నడూ మరచిపోనన్నారు. కేన్సర్ రోగుల కోసం నిర్మించిన బసవతారకం స్మారక ఆస్పత్రిని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. 

అంటే బాలయ్య రాజకీయాల్లోకి రావటం నిజమేనని తెలుస్తుంది.  బాలయ్య రాజకీయాల్లోకి వస్తే.. చిరు సినిమాల్లోకి వెళ్లతాడట,  మొత్తం చిరు 150వ సినిమా తెరపైకి వెక్కటానికి సిద్దంగా ఉందని తెలియటంతో.. చిరు అభిమానులు సంక్రాంతి సంబరాలలో  మెగా సంబరం కూడా కలిసి వచ్చినట్లైందట. బాలయ్య రాజకీయల్లోకి వస్తానని చెప్పటంతో.. బాలయ్య అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tanikella bharani turns full time director
Supreme court directs y s vijayamma to withdraw transfer petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more