Ravi Teja's Khiladi Movie Review Rating Story Cast and Crew 'ఖిలాడీ‌' మూవీ రివ్యూ

Teluguwishesh 'ఖిలాడీ‌' 'ఖిలాడీ‌' Get information about Khiladi Telugu Movie Review, Ravi Teja Khiladi Movie Review, Khiladi Movie Review and Rating, Khiladi Review, Khiladi Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 97149 2.50 stars, based on 1 reviews
 • చిత్రం  :

  'ఖిలాడీ‌'

 • బ్యానర్  :

  ‘ఎ’ స్టూడియోస్

 • దర్శకుడు  :

  రమేశ్ వర్మ

 • నిర్మాత  :

  సత్యనారాయణ కోనేరు. రమేశ్ వర్మ

 • సంగీతం  :

  దేవిశ్రీప్రసాద్

 • సినిమా రేటింగ్  :

  2.502.50  2.50

 • ఛాయాగ్రహణం  :

  సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు

 • ఎడిటర్  :

  అమర్ రెడ్డి కుడుముల

 • నటినటులు  :

  రవితేజ, డింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌద‌రి, అర్జున్‌, అన‌సూయ‌, ముర‌ళీ శ‌ర్మ‌, ఉన్ని ముకుంద‌న్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్‌, రావు రమేశ్, ముకేష్ రుషిత‌దిత‌రులు

Ravi Teja S Khiladi Review Perfect Mass Masala With Twists

విడుదల తేది :

2022-02-11

Cinema Story

పూజా(మీనాక్షి చౌద‌రి) ఇంటెలిజెన్స్ ఐజీ జ‌య‌రామ్(స‌చిన్ ఖేడ్కర్) కుమార్తె. చాలా తెలివైన అమ్మాయి. క్రిమిన‌ల్ సైకాల‌జీ చ‌దువుతుంటుంది. ఓ థీసెస్ కోసం సెంట్రల్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న మోహ‌న్ గాంధీ(ర‌వితేజ‌)ని క‌లుస్తుంది. హోం మంత్రి గురుసింగం(ముఖేష్ రుషి) రూ.10వేల కోట్లకు సంబంధించిన లావాదేవి వ‌ల్ల తానెలా స‌మ‌స్యల్లో చిక్కుకున్నది, కుటుంబాన్ని పోగొట్టుకుని చేయ‌ని నేరానికి జైలుకు ఎలా రావాల్సి వచ్చింది.. ఓ క‌ట్టుక‌థ‌లా ఆమెకు చెప్తాడు. ఆ క‌థ నిజమ‌ని న‌మ్మిన పూజా.. మోహ‌న్‌గాంధీకి సహాయం చేయాల‌ని నిర్ణయించుకుంటుంది. తండ్రి సంత‌కం ఫోర్జరీ చేసి మ‌రీ అత‌నికి బెయిల్ వ‌చ్చేలా చేస్తుంది.

స‌రిగ్గా గాంధీ బ‌య‌ట‌కు రాగానే అత‌డి జీవితానికి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెలుస్తుంది. అత‌డు ఓ అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ అని, హోంమంత్రి డ‌బ్బు కొట్టేయ‌డానికే ఇట‌లీ నుంచి భార‌త్‌కు వ‌చ్చాడ‌ని, ఇందుకోసం తెలివిగా త‌న‌ని వాడుకున్నాడ‌ని పూజాకు అర్థమ‌వుతుంది. మ‌రి ఆ డ‌బ్బు ఎవ‌రిది? అదెక్కడ దాచారు? ఆ డ‌బ్బుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల‌ని ఆశ‌ప‌డిన గురుసింగం కోరిక తీరిందా?డ‌బ్బును కొట్టేయాల‌న్న గాంధీ కోరిక నెర‌వేరిందా? డ‌బ్బుతో పాటు గాంధీని ప‌ట్టుకోవాల‌న్న సీబీఐ అధికారి అర్జున్ భ‌ర‌ద్వాజ్ (అర్జున్) ల‌క్ష్యం నెర‌వేరిందా? ఈ మొత్తం క‌థ‌లో డింపుల్‌, అనసూయ‌, ఉన్ని ముకుంద‌న్‌, ముర‌ళీ శ‌ర్మల పాత్రలేంటి?అన్నది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
'ఖిలాడీ‌'

విశ్లేషణ

రూ. 10 వేల కోట్ల డ‌బ్బు చుట్టూ తిరిగే క‌థ ఇది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపోందించాడు ద‌ర్శకుడు ర‌మేశ్‌ వ‌ర్మ‌. ఓ తెలివిమీరిన దొంగ‌.. రూ.10 వేల కోట్ల టార్గెట్‌.. ఆ డ‌బ్బు కోస‌మే కాచుకు కూర్చొన్న రెండు ముఠాలు.. ఆ డ‌బ్బును, దొంగ‌ల్ని ప‌ట్టుకు తీరాల‌నే ల‌క్ష్యంతో తిరిగే సీబీఐ అధికారి.. ఇవ‌న్నీ చూస్తుంటే ఓ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన స‌రుకంతా ఈ క‌థ‌లో ఉన్నట్లు అర్థమ‌వుతుంది. ఓ ప‌సందైన థ్రిల్లర్ చిత్రం త‌యారీలో మాత్రం సాగదీత.. కథలో ట్విస్టులు సగటు ప్రేక్షకుడి ఊహించినట్లుగానే సాగడంతో ఈ చిత్రాన్ని ఆస‌క్తిక‌రంగామ‌ల‌చ‌డంలో ద‌ర్శకుడు త‌డ‌బ‌డ్డాడేమో అని అనిపిస్తోంది.

భార్యని, అత్తమామ‌ల హ‌త్యకేసులో శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీగా ర‌వితేజ పాత్రని ప‌రిచ‌యం చేసిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంది. పూజాకు అత‌డు త‌న క‌థ చెప్పడం ప్రారంభించాక రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోతుంది. ర‌వితేజ‌, డింపుల్‌ల మ‌ధ్య వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. నిజానికి సినిమా అస‌లు క‌థపై ద‌ర్శకుడు అంత దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. గురుసింగానికి సంబంధించిన రూ.10వేల కోట్లను డెవిడ్ ముఠా కొట్టేయ‌డం.. ఈ క్రమంలో వ‌చ్చే ఛేజింగ్ ఎపిసోడ్లతో క‌థ‌లో కాస్త వేగం పెరుగుతుంది. విరామానికి ముందు మోహ‌న్ గాంధీ పాత్ర అస‌లు క‌థ‌ను రివీల్ చేయ‌డం.. ఈ సంద‌ర్భంగా అర్జున్‌, గాంధీ పాత్రల మ‌ధ్య వ‌చ్చే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయి.

సెకండాఫ్ నుంచి సినిమా పూర్తిగా థ్రిల్లర్ ట్రాక్ ఎక్కిన‌ట్లు క‌నిపించినా.. కాసేప‌టికే క‌థ మొత్తం రొటీన్ వ్యవ‌హారంలా మారిపోతుంది. రూ.10 వేల కోట్లు కొట్టేయ‌డం కోసం మోహ‌న్ గాంధీ ముఠా చేసే ప్రయ‌త్నాలు చాలా వర‌కు సిల్లీగా ఉంటాయి. అయితే మ‌ధ్యమ‌ధ్యలో వ‌చ్చే యాక్షన్ ఎపిసోడ్‌లు కాస్త ఊపు తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తాయి. థ్రిల్లర్ క‌థ‌ల‌కు ముగింపు రసవత్తరంగా ఉండాలి. అయితే ఈ చిత్రంలో క్లైమాక్స్ పెద్ద మైన‌స్‌. ఊహ‌కంద‌ని మ‌లుపులు..ట్విస్ట్‌లతో.. కథను రూపోందించిన ద‌ర్శకుడు సాగ‌దీశాడు.దీంతో క్లైమాక్స్ విసుగు తెప్పించేలా వున్నా.. యాక్షన్ సీక్వెన్స్ ఆక‌ట్టుకుంటాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

నాని ఇటు వాసుగా, అటు శ్యామ్ సింగరాయ్ గా రెండు పాత్రలతోనూ సహజంగా సెట్ అయ్యాడు. పెర్ఫామెన్స్ పరంగా సవాలు విసిరే ఏ కొత్త పాత్ర ఇచ్చినా.. అందులో సులువుగా ఒదిగిపోయి.. ఆశ్చర్యపరుస్తాడు. శ్యామ్ సింగ రాయ్ గా నాని ఆహార్యం మొదలుకుని.. నటన వరకు అన్నీ ఆకట్టుకుంటాయి. నాని కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఆద్యంతం అతను ఆకట్టుకున్నాడు. వాసు పాత్ర సాధారణంగా అనిపించడంతో నటన పరంగా నాని కొత్తగా చేయడానికేమీ లేకపోయింది. నాని తర్వాత ఆటోమేటిగ్గా ఎక్కువ స్కోర్ చేసేది సాయిపల్లవినే. మైత్రి పాత్రకు అమె తనదైన అభినయంతో వన్నెతెచ్చింది.

ఆమె తెరపై కనిపించిన తొలి మూమెంట్ నుంచి ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంది. చిన్న చిన్న హావభావాల విషయంలోనూ సాయిపల్లవి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీ మెచ్చిన నృత్యకారిణిగా పేరుతెచ్చుకున్న ఆమె.. ఈ చిత్రంలోనూ కొత్త మూవ్ మెంట్స్ వేసి.. తనకు తానే సాటి అని చాటుకుంది. దేవదాసి పాత్రలోని సంఘర్షణను ఆమె సరిగ్గా చూపగలిగింది. తన నాట్యంతోనూ సాయిపల్లవి మెప్పించింది. కృతి శెట్టి జస్ట్ ఓకే అనిపిస్తుంది. తొలి సినిమాలో మాదిరి ఇందులో పెద్దగా ఆకర్షించలేకపోయింది. మడోన్నా సెబాస్టియన్ బాగానే చేసింది కానీ.. ఆమె మరీ జీవం కోల్పోయినట్లు కనిపించింది. రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు న్యాయం చేశాడు. జిష్ణు సేన్ గుప్తా ఓకే. అభినవ్ గోమఠం బాగా చేశాడు.టెక్నికల్ అంశాలకు వస్తే..

టెక్నికల్ గా ‘శ్యామ్ సింగ రాయ్’లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. మిక్కీ జే మేయర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. అందులో వచ్చే పాటలు కూడా బాగున్నాయి. ఐతే పాటల్లో సాహిత్య.. సంగీత పరంగా ఒక స్థాయి కనిపించినప్పటికీ.. వినసొంపుగా లేకపోవడం కొంత ప్రతికూలతే. సాను వర్గీస్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్ అనడంలో మరో మాట లేదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ప్రతి సన్నివేశంలోనూ ఛాయాగ్రాహకుడి ప్రతిభ కనిపిస్తుంది. దర్శకుడి అభిరుచి కూడా తోడవడంతో విజువల్ గా ఒక క్లాసిక్ లుక్ వచ్చింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ఇలాంటి కథకు రాజీ లేకుండా ఖర్చు పెట్టిన నిర్మాత అభినందనీయుడు. సత్యదేవ్ జంగ ఎంచుకున్న కథ ఒక ఫార్మాట్లో సాగినప్పటికీ.. మాస్ మసాలా సినిమాల మధ్య భిన్నంగానే కనిపిస్తుంది. రాహుల్ సంకృత్యన్ దర్శకుడిగా తన అభిరుచిని చాటాడు. ఫ్లాస్ బ్యాక్ లో దర్శకుడిగా అతడి అత్యుత్తమ ప్రతిభ కనిపిస్తుంది. అతడి స్క్రీన్ ప్లేలోనూ కొన్ని మెరుపులున్నాయి. ఐతే కథ మీద ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే.. ముగింపును ఇంకా ఆసక్తికంగా తీర్చిదిద్దుకుని ఉంటే రాహుల్ కు ఇంకా మంచి మార్కులు పడేవి.

తీర్పు:  ఊహ‌కంద‌ని మ‌లుపులు.. విప‌రీత‌మైన ట్విస్ట్‌లతో అలరించిన.. ‘ఖిలాడీ’.!

చివరగా.. మోతాదు మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడీ’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh