Ante Sundaraniki Movie Review Rating Story Cast and Crew 'మేజర్' మూవీ రివ్యూ

Teluguwishesh 'అంటే సుందరానికి' 'అంటే సుందరానికి' Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 98016 3.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  'అంటే సుందరానికి'

 • బ్యానర్  :

  మైత్రి మూవీ మేకర్స్

 • దర్శకుడు  :

  వివేక్ అత్రేయ

 • నిర్మాత  :

  నవీన్, వై.రవిశంకర్, సివి మోహన్

 • సంగీతం  :

  వివేక్ సాగర్

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  నిఖిత్ బొమ్మరెడ్డి

 • ఎడిటర్  :

  రవితేజ గిరిజాల

 • నటినటులు  :

  నాని, నజ్రియా నజీమ్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, పృధ్దీరాజ్, అళగం పెరుమాళ్, రాహుల్ రామకృష్ణ, హర్షవర్థన్, నదియ, నిఖ్కి తంబొలి, తన్విరామ్ తదితరులు

Ante Sundaraniki Movie Adivi Sesh Movie Gets Phenomenal Response From Audience

విడుదల తేది :

2022-06-10

Cinema Story

విభిన్నమైన సినిమాలతో తన పేరును ఒక బ్రాండుగా మార్చుకున్న న్యాచురల్ స్టార్ నాని.. గత ఏడాది శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో చక్కటి హిట్ అందుకున్న తరువాత.. తన ఒరవడిని కొనసాగిస్తూ.. రోమాన్స్ జోనర్ లో నటించిన చిత్రం అంటే సుందరానికి. మెంటల్ మదిలో.. బ్రోచేవారెవరురా చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్ర దర్శకుడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు ఇవాళే వచ్చింది. మరి శ్యామ్ సింగరాయ్ తో హిట్ అందుకున్న నాని.. తన విజయ పరంపరను ఈ చిత్రంతోనూ కొనసాగిస్తాడా.? అన్నది తెలుసుకోవాలంటే చిత్ర కథలోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే.

సుందర్ (నాని) ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. ఆచారాల విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండే కుటుంబం నుంచి వచ్చిన అతను.. తన చిన్ననాటి స్నేహితురాలైన లీల (నజ్రియా నజ్రీన్)ను ఇష్టపడతాడు. ఆమెది సంప్రదాయ క్రిస్టియన్ కుటుంబం. వాళ్ల ఇంట్లోనూ తమ మత సంబంధిత ఆచారాలకు చాలా విలువ ఇస్తారు. లీల కూడా సుందర్ను ఇష్టపడుతుంది. కానీ ఇరువురి కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి పెళ్లికి అంగీకరించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో తమ పెళ్లి కోసం సుందర్-లీల ఒక ప్రణాళిక రచిస్తారు. ఆ ప్రణాళిక ఎంతమేర సఫలమైంది.. దీని వల్ల రెండు కుటుంబాల్లో ఎలాంటి పరిణామాలు తలెత్తాయి.. చివరికి వీరి పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.

cinima-reviews
'అంటే సుందరానికి'

విశ్లేషణ

వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు. ఐతే ‘అంటే సుందరానికీ’లో హీరో-హీరోయిన్ తమ ఇళ్లలో వేర్వేరుగా రెండు అబద్ధాలు చెబుతారు. ఇలా పెళ్లి కోసం అబద్ధాలు చెప్పేయడం తేలిక కానీ.. ఆ అబద్ధాల పరిణామాలు తీవ్రతను అంచనా వేయడం కష్టం. అబద్ధాలు చెప్పడంతో తలెత్తే సమస్యలు.. ఆ క్రమంలో ఎదురయ్యే సంఘర్షణ ఏ స్థాయిలో ఉంటాయి అనే పాయింట్ మీదే ‘అంటే సుందరానికీ’ చిత్రకథ. ఈ చిన్న పాయింట్ మీదే సినిమాను నడిపించి.. నవ్వుల్ని పంచి.. ప్రేక్షకులను ఆసాంతం కుదురుగా కూర్చోబెట్టగలిగాడు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ. మతాంతరవివాహాల నేపథ్యంలో దశాబ్దాల క్రితం దర్శకదిగ్గజం కె.బాలచందర్ రూపోందిచిన చిత్రం సీతాకోక చిలుక గుర్తుందా.? అదే పాయింట్ పై తెరకెక్కిన ఈ చిత్రం.. కథనంలో మాత్రం కోత్తదనం ఉండేలా చూసుకన్నాడు దర్శకుడు.  

‘అంటే సుందరానికీ’ చిత్రం కామెడీ ప్రథానంగా తెరకెక్కిన నేపథ్యంలో ప్రధాన పాత్రలు ప్రేక్షకులకు బాగా అలవాటు చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కథను నాన్ లీనియర్ స్టయిల్లో చెప్పడంతో అసలు పాయింట్ అర్థం కావడానికి టైం పడుతుంది. ఆచారాలకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అబ్బాయి జీవితం ఎలా ఉంటుందో.. మూఢ నమ్మకాల వల్ల అతనెంత ఇబ్బంది పడతాడో చూపిస్తూ సాగే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నాని-నరేష్ లాంటి మంచి ఆర్టిస్లుల చేతుల్లో పడ్డ ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు మంచి వినోదాన్నిస్తుంది. ఇక హీరోయిన్ తో హీరో వన్ సైడ్ లవ్ స్టోరీ.. హీరోయిన్ లవ్ స్టోరీ.. దాని చుట్టూ నడిపిన డ్రామా ప్రేక్షకులను తికమక పెట్టింది.

ఓవరాల్ గా ప్రథమార్ధం ఓకే అనిపించినా.. ద్వితీయార్ధంలో మాత్రం హీరో హీరోయిన్లు చెప్పిన అబద్ధాలతో తలెత్తే పరిణామాలు.. ఇరు కుటుంబాల రియాక్షన్... ఈ నేపథ్యంలో నడిచే క్రేజీ సన్నివేశాలతో కథనం పరుగులు పెడుతుంది. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. సన్నివేశాల్లో కొంచెం బలం తగ్గినా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ ఆ లోటు కనిపించనివ్వకుండా చేసింది. ‘‘పెళ్ళి చేసుకుందాం. నీకు ఓకేనా’’ అని హీరోయిన్ అడిగితే.. ‘‘నువ్వు చెప్పు నాకు ఓకేనా కాదా’’ అంటూ నాని ఇచ్చే రియాక్షన్.. ‘‘ఏం సాధించావని నిన్ను పెళ్లి చేసుకుంటుందా అమ్మాయి’’ అని తండ్రి అడిగితే.. ‘‘ఎవరో ఏదో సాధించారనే అందరమ్మాయిలు పెళ్లి చేసుకోరు. కావాలంటే అమ్మనడుగు’’ అంటూ నాని ఇచ్చే సమాధానం.. ఇలాంటి మెరుపులతో అటు ఎమోషన్లూ పండాయి. ఇటు కామెడీ కూడా వర్కవుట్ అయింది.

దీంతో ద్వితీయార్ధం పూర్తిగా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. చివరి అరగంటలో కొన్ని హార్ట్ టచింగ్ సీన్లతో ప్రేక్షకులు సినిమాకు మరింతగా అటాచ్ అయ్యేలా చేశారు దర్శకుడు వివేక్ అత్రేయ. కాకపోతే ముందే అన్నట్లు ప్లాట్ పాయింట్ చాలా చిన్నది కావడం.. దాని చుట్టూనే పెద్ద నిడివితో సినిమాను నడిపించడం కొంత సమస్యగా మారింది. కథనం ఆద్యంతం ఎంగేజింగ్ గా అనిపించినా.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ అదిరిపోయినా.. టెక్నీషియన్లందరూ ప్రతిభ చాటుకున్నా.. నాని-వివేక్ ఆత్రేయ-నజ్రియా-మైత్రీ మూవీ మేకర్స్.. ఇలాంటి కాంబినేషన్ నుంచి వచ్చిన కామెడీ చిత్రం నుంచి ప్రేక్షకుడికి కావాల్సినన్ని నవ్వులు, భావోద్వేగాలు పంచింది.

నటీనటుల విషాయానికి వస్తే..

సాధారణమైన పాత్రలను కూడా తనదైన సహజనటనతో మరో స్థాయిలో నిలబెట్టగల నైపుణ్యం నాని సొంతం. అందుకనే సుందర్ పాత్రలో నాని పరకాయ ప్రవేశం చేశాడు. ఈ చిత్రంలోని పాత్రను నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోగల పాత్రల్లో ఒకటిగా మారింది. డిఫరెంట్ ఎమోషన్స్ పండించే అవకాశమున్న ఈ పాత్రలో నాని చెలరేగిపోయాడు. నాని మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ చేయగలడు అనిపించాడు. ఇలాంటి అచ్చ తెలుగు పాత్రలో నానిని చూసి ప్రేక్షకులు బాగా ఐడెంటిఫై అవుతారు. నరేష్ కాంబినేషన్లో నాని చేసిన సన్నివేశాలన్నీ భలేగా పేలాయి. ఆ సన్నివేశాల్లో వారిలోని నటులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.

తాను ఎంత మంచి నటుడో.. పాత్రను ఓన్ చేసుకుంటే ఎంత బాగా దాన్ని పండిస్తారో నరేష్ మరోసారి ఈ సినిమాలో రుజువు చేశారు. హీరోయిన్ నజ్రియా లుక్స్ పరంగా చూస్తే యావరేజ్ అనిపిస్తుంది. పాత్రకు అవసరమైనంత క్యూట్నెస్ తనలో కనిపించలేదు. కానీ తనెంత మంచి పెర్ఫామరో ప్రతి సన్నివేశంలోనూ తెలుస్తూనే ఉంటుంది. నానితో ఆమె కెమిస్ట్రీ బాగా పండింది. అన్ని రకాల ఎమోషన్లనూ ఆమె బాగా పలికించింది. నదియా.. రోహిణి తమ అనుభవాన్ని చూపించారు. తమిళ నటుడు అళగం పెరుమాల్ కూడా బాగా చేశారు. అనుపమ పరమేశ్వరన్ చిన్న పాత్రలో మెరిస్తే.. హర్షవర్ధన్.. రాహుల్ రామకృష్ణ తక్కువ స్క్రీన్ టైంలోనే తమ ప్రత్యేకతను చాటుకున్నారు.టెక్నికల్ అంశాలకు వస్తే..

సంగీత స్వర మాంత్రుకుడిగా గుర్తింపు వచ్చినా.. ఇప్పటికీ చిన్న సినిమాలనే చేస్తూ.. తన సంగీతం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరాలని భావించే నిత్యతపస్వి వివేక్ సాగర్. ఆయన కెరీర్లో కాస్త పెద్ద స్థాయి సినిమా అంటే ఇది. ఆ అవకాశాన్ని సాగర్ అందిపుచ్చుకుని తనదైన ముద్ర వేస్తాడు. నేపథ్య సంగీత పరంగా వివేక్ సాగర్ అదరగొట్టాడు. కొన్ని చోట్ల మాత్రం ఆర్ఆర్ మరీ లౌడ్ అనిపిస్తుంది. పాటల విషయంలో మాత్రం వివేక్ కొంత నిరాశ పరిచాడు. పాటలు చరణాలు వినగానే అందుకునేలా లేకపోవడం కాస్తా నిరాశపర్చింది. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం బాగుంది. చక్కటి ఫ్రేమ్స్ తో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు మైత్రీ మూవీ మేకర్స్ స్థాయికి తగ్గట్లే ఉన్నాయి.

ఇక రైటర్ కమ్ డైరెక్టర్.. వివేక్ ఆత్రేయ తాను టేకింగ్ పరంగా ఈ తరానికి చెందిన న్యూ యేజ్ ఫిలిం మేకర్ అని చాటుతూనే.. భాష మీద.. మన సంస్కృతి సంప్రదాయాల మీద పట్టు చూపించి తన విలక్షణతను చాటాడు. అతడిలోని రచనా ప్రతిభ మరోసారి కనిపించింది. కాకపోతే తొలి సినిమా ‘మెంటల్ మదిలో’ తరహాలోనే కథ.. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కోసం బాగా సమయం తీసుకోవడం.. కొన్నిచోట్ల నరేషన్ స్లోగా ఉండడం మైనస్ అయ్యాయి. ఈ సినిమా కథ పరిధి కూడా చిన్నదైపోవడంతో అతను తనకు తాను బంధనాలు వేసుకున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా వివేక్ మంచి సినిమానే తీశాడు. తన దర్శకత్వ ప్రతిభను చాటాడు.

తీర్పు: కామెడీతో నవ్వులు పంచడంతో పాటు కట్టిపడేసే భావోద్వేగాలు సమ్మేళనం.. ‘అంటే సుందరానికి’.!

చివరగా.. ప్రేక్షకులకు నచ్చే ‘అంటే సుందరానికి’!!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh