F3 Movie Review Rating Story Cast and Crew 'ఎఫ్-3' మూవీ రివ్యూ

Teluguwishesh 'ఎఫ్-3' 'ఎఫ్-3' Get information about F3 Telugu Movie Review, Venkatesh F3 Movie Review, F3 Movie Review and Rating, F3 Review, F3 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 97912 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    'ఎఫ్-3'

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్

  • దర్శకుడు  :

    అనిల్ రావిపూడి

  • నిర్మాత  :

    దిల్ రాజు, శిరీష్

  • సంగీతం  :

    దేవిశ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    సాయి శ్రీరామ్

  • ఎడిటర్  :

    తమ్మిరాజు

  • నటినటులు  :

    వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాలి చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, ఆలీ, రఘుబాబు, వెన్నెలకిషోర్, సంపత్, సత్య, ప్రగతి, అన్నపూర్ణ, వై.విజయ, ప్రదీప్ తదితరులు

F3 Movie Venky, Varun Tej Movie Gets Phenomenal Response From Audience

విడుదల తేది :

2022-05-27

Cinema Story

మూడేళ్ల కిందట సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చిన ఎఫ్ 2 నవ్వులను పంచిన చిత్రంగా మంచి హిట్ కోట్టిన తర్వాత దానికి సీక్వెల్ గా రూపోందించిన ఈ చిత్రం మోర్ ఫన్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాంది. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్.. వీరికి జోడీగా తమన్నా, మెహ్రీన్ లు కలసినటిస్తున్న చి్త్రంలో సునీల్ యాడ్ అవ్వడం ప్లస్ పాయింట్ గా మారింది. మోర్ ఫన్ లో భాగంగా.. ఈ చిత్రంలో కథ మొత్తంగా డబ్బు చుట్టూ తిరిగేలా రాసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇస్తున్నట్లు ప్రకటించిన టీమ్.. మరీ చెప్పినట్టుగానే ఎఫ్ 3 నిజంగానే ఎఫ్ 2కు మించిన వినోదాన్ని పంచిందా, ఎఫ్ 4 తీసే అవకాశాన్ని ఇస్తుందా.? అన్న విషయాలను తెలుసుకుందాం.

వెంకీ (వెంకటేష్).. వరుణ్ (వరుణ్ తేజ్) ఆర్థికంగా బాగా దెబ్బ తిని.. ఏదో ఒకటి చేసి బాగా డబ్బు సంపాదించి జీవితంలో సెటిలవ్వాలని చూస్తున్న వ్యక్తులు. కానీ వాళ్లు ఎంత గట్టిగా ప్రయత్నించినా డబ్బులు సంపాదించే మార్గం మాత్రం కనిపించదు. ఇలాంటి తరుణంలో హనీ (మెహ్రీన్)ను చూసి డబ్బున్న అమ్మాయిగా పొరబడి.. ఆమెను పెళ్లాడి తన ఆస్తినంతా దక్కించుకోవడం కోసం వెంకీతో కలిసి ప్రణాళిక రచిస్తాడు వరుణ్. అందుకోసం అప్పులు చేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాక హనీ నిజ స్వరూపం బయటపడుతుంది. వరుణ్ తనకిచ్చిన డబ్బులన్నీ ఆమె కుటుంబం పోగొట్టేయగా.. అప్పుల భారం వెంకీ-వరుణ్ మీద పడుతుంది. ఈ పరిస్థితుల్లో డబ్బుల కోసం వాళ్లేం చేశారు.. దాని వల్ల తలెత్తిన ఇబ్బందులేంటి.. వీటి నుంచి వాళ్లు చివరికి ఎలా బయటపడ్డారు అన్నది మిగతా కథ.

cinima-reviews
'ఎఫ్-3'

విశ్లేషణ

లాజిక్ అనీ... రియలిస్టిక్ అనీ మ‌మ్మల్ని ఎంత‌కాలం దూరం పెడ‌తారంటూ ఒక‌ప్పటి తెలుగు సినిమా స్టైల్ పోలీస్ అధికారిగా త‌నికెళ్ల భ‌ర‌ణి క్లైమాక్స్‌లో వ‌చ్చి ఏక‌రువు పెడ‌తాడు. యు ఆర్ అండ‌ర్ అరెస్ట్ అంటూ అరిగిపోయిన డైలాగ్ చెప్పి న‌వ్వులు పూయిస్తాడు. అచ్చం ఈ డైలాగ్‌కి త‌గ్గట్టుగానే... ఇప్పుడొస్తున్న రియ‌లిస్టిక్ క‌థ‌ల మ‌ధ్య లాజిక్‌ల‌తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని న‌వ్వించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ సినిమా తీసిన‌ట్టున్నారు ద‌ర్శకుడు అనిల్ రావిపూడి. కొంత‌కాలంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న భారీద‌నం, యాక్షన్ సినిమాల మ‌ధ్య ఆహ్లాదంగా సాగుతూ వినోదాన్ని పంచుతుందీ చిత్రం. కాక‌పోతే ఈ సినిమా చూస్తున్నప్పుడు లాజిక్ లెక్కల‌కి దూరంగా ఉండాల్సిందే.

ఇలా ఎలా సాధ్యం? అనే ప్రశ్న మొద‌లైతే మాత్రం ఈ సినిమాని ఆస్వాదించ‌లేరు. ఆ లెక్కల‌కి దూరంగా పాత్రల‌తో క‌లిసి ప్రయాణం చేస్తే మాత్రం ఎఫ్‌2ని మించి వినోదాన్ని ఆస్వాదించొచ్చు. పాత్రల‌న్నీ అత్యాశ‌తో వ్యవ‌హ‌రిస్తుంటాయి. అందుకోసం అడ్డదారులు తొక్కుతుంటాయి. ఆ క్రమంలో పండే వినోదం క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. రేచీక‌టి స‌మ‌స్యని క‌ప్పి పుచ్చుకునేందుకు వెంక‌టేష్ ప‌డే పాట్లు ఫస్టాప్ లో హైలెట్‌గా నిలుస్తాయి. వెంక‌ట్రావు పెళ్లాన్ని చూశా... అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ప్రతిసారీ న‌వ్వించింది. న‌త్తితో బాధ‌ప‌డుతూ వ‌రుణ్‌తేజ్ ర‌క‌ర‌కాల మేన‌రిజ‌మ్స్‌ని ప్రద‌ర్శించిన తీరు చాలా బాగుంటుంది.

పాత సినిమాల పాట‌ల్ని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ న‌వ్వించిన తీరు బాగుంది. సెకండాఫ్ లో క‌థంతా విజయనగరంలోని ఆనంద్ ప్రసాద్ ఇంటికి మారుతుంది. వార‌సులం మేమంటే మేమంటూ త‌మ‌న్నాతో స‌హా పోటీప‌డ‌టం, వాళ్లకి ర‌క‌ర‌కాల ప‌రీక్షలు పెట్టడం ఆ నేప‌థ్యంలో పండే వినోదంతో స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతాయి. పిల్లలను సెల్ ఫోన్ లకు దూరం పెట్టి చదువులపై దృష్టి సారించేలా ఎఫ్ 3 టాయ్స్ పేరుతో ప్రభాస్, బన్నీ, మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి క‌థానాయ‌కుల్ని చూపించ‌డం, ప‌తాక స‌న్నివేశాల్లో వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో ఫైట్లు చేయించిన తీరు పైసా వ‌సూల్ సూత్రానికి త‌గ్గట్టుగా ఉంటాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

‘ఎఫ్-2’లో మాదిరే ‘ఎఫ్-3’లో కూడా షో స్టీలర్ వెంకటేషే. వినోదం పండించడంలో తనకు తిరుగులేదని వెంకీ మరోసార ిచాటి చెప్పాడు. కామెడీ విషయానికి వస్తే ఇమేజ్ సంకెళ్లన్నీ పక్కన పెట్టి చెలరేగిపోయే వెంకీ.. మరోసారి అదే శైలిలో అదరగొట్టాడు. రేచీకటి పాత్ర అంటే మామూలుగా కమెడియన్లే చేస్తారు. అలాంటిది వెంకీ ఏ భేషజం లేకుండా ఆ పాత్ర చేశాడు. అదే సమయంలో తన తర్వాత వచ్చిన యువ కథానాయకులను అనుకరిస్తూ నవ్వించడం కూడా ఆయనకే చెల్లింది. తనకు రేచీకటి లేదని కవర్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాల్లో వెంకీ కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. మిగతా సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు.

నత్తి ఉన్న కుర్రాడిగా వరుణ్ తేజ్ సైతం బాగానే చేశాడు. నత్తిని కవర్ చేసే సన్నివేశాల్లో అతను కూడా బాగా నవ్వించాడు. అతడి మేనరిజమ్స్ కూడా ఆకట్టుకుంటాయి. కానీ ద్వితీయార్ధంలో పాత్ర వీక్ అయిపోవడంతో అతను కూడా కొంచెం తగ్గాడు. తమన్నా.. మెహ్రీన్ పాత్రలు ‘ఎఫ్-2’ స్థాయిలో లేవు. వీళ్లిద్దరూ అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయారు. మెహ్రీన్ అయినా పర్వాలేదు కానీ.. తమన్నా పాత్ర మరీ నామమాత్రంగా అనిపిస్తుంది. మెహ్రీన్ పాత్రకు ప్రథమార్ధంలో బాగానే అనిపించినా.. లుక్స్ తేడా కొట్టడం మైనస్.  మరీ బక్కచిక్కిన ఆమె వరుణ్ పక్కన అస్సలు సెట్ కాలేదు. సునీల్.. రఘుబాబు.. వెన్నెల కిషోర్.. రాజేంద్ర ప్రసాద్.. ఆలీ.. సహాయ పాత్రల్లో తమ పరిధి మేరకు బాగానే నవ్వించారు. మురళీ శర్మ.. మిగతా నటీనటులు ఓకే.



టెక్నికల్ అంశాలకు వస్తే..

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. సినిమాలో పాటలు పర్వాలేదనిపిస్తాయి కానీ.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేవు. లైఫ్ అంటే.. ఊ ఆ.. పాటలు స్క్రీన్ మీద ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కొత్తగా అనిపించకపోయినా.. బాగానే సాగిపోతుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా సాగాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకు అలవాటైన రీతిలోనే వినోదం పండించే ప్రయత్నం చేశాడు. ఎప్పట్లాగే అతను కథ గురించేమీ తల బద్దలుకొట్టేసుకోలేదు. కొత్తగా ఏదో చేసేయడానికి ప్రయత్నించలేదు. చాలా కామెడీ సినిమాలను అటు ఇటు తిప్పి.. స్క్రిప్టు రెడీ చేసుకుని.. ఓవర్ ద టాప్ స్టయిల్లో సన్నివేశాలను నడిపిస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా ‘ఎఫ్-2’ కొనసాగింపు చిత్రంతో అనీల్ రావిపూడి..ఓ మోస్తరుగా అయితే నవ్వించి ప్రేక్షకులను సంతృప్తి పరచగలిగాడు.

తీర్పు: కథనంపై మరింత దృష్టిపెట్టి.. కొత్తదనం జతకలసివుంటే.. బ్లాక్ బస్టర్ కామెడీ..!

చివరగా.. అభిమానులకు నవ్వుల పండగ.. ‘ఎఫ్-3’!!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh