HIT Movie Review ‘హిట్’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘హిట్’ ‘హిట్’ Get information about HIT Telugu Movie Review, Vishwak Sen HIT Movie Review, HIT Movie Review and Rating, HIT Review, HIT Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 92478 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘హిట్’

 • బ్యానర్  :

  వాల్ పోస్ట‌ర్ సినిమా

 • దర్శకుడు  :

  శైలేష్ కొలను

 • నిర్మాత  :

  ప్రశాంతి తిపిర్నేని

 • సంగీతం  :

  వివేక్ సాగర్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  మణికందన్

 • ఎడిటర్  :

  గ్యారీ బి.హెచ్

 • నటినటులు  :

  విశ్వక్సేన్, రుహాని శర్మ, మురళీ శర్మ, భాను చందర్, బ్రహ్మాజీ, హరితేజ తదితరులు

Hit Movie Review Rating Story Cast And Crew

విడుదల తేది :

2020-02-28

Cinema Story

విక్ర‌మ్ రుద్రరాజు(విశ్వ‌క్ సేన్‌) ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌. సిటీలో క్రైమ్ రేటు త‌గ్గించ‌డానికి హోమిసైడ్ ఇంటెర్వెన్ష‌న్ టీమ్‌(హిట్‌)లో స‌భ్యుడుగా ఉంటాడు. ప‌లు కేసుల‌ను సాల్వ్ చేసే క్ర‌మంలో చిన్న‌ప్పుడు అత‌ని జీవితంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల కార‌ణంగా త‌ను మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతుంటాడు. డాక్ట‌ర్స్ రెస్ట్ తీసుకోమ‌ని చెప్పినా వినిపించుకోడు. త‌న డిపార్ట్‌మెంట్‌కి చెందిన లేడీ ఆఫీస‌ర్ నేహ‌(రుహానీ శ‌ర్మ‌)ను ప్రేమిస్తాడు. నేహా కోరిక మేర‌కు ఆరు నెల‌లు సెల‌వులు తీసుకుంటాడు. రెండు నెల‌ల త‌ర్వాత నేహా మిస్ అయ్యింద‌ని తెలిసిన త‌ర్వాత విక్ర‌మ్ లీవ్ క్యాన్సిల్ చేసుకుంటాడు.

కానీ నేహా కేసుని మ‌రో ఆఫీస‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. అయినా కూడా నేహా ఇంట్లోకి వెళ్లిన విక్ర‌మ్ కొన్ని క్లూలు సేక‌రిస్తాడు. అదే స‌మ‌యంలో నేహా హ్యాండిల్ చేసిన ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసుకి, నేహా క‌న‌ప‌డ‌కుండా పోవ‌డానికి ఏదో సంబంధం ఉంద‌నిపించ‌డంతో విక్ర‌మ్ ప్రీతి కేసుని ఇన్వెస్టిగేట్ చేయ‌డం ప్రారంభిస్తాడు. క్ర‌మంగా ప్రీతి కేసులో అనుకోని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? అస‌లు ప్రీతి ఎవ‌రు? ఆమె క‌న‌ప‌డ‌కుండా పోవ‌డానికి, నేహా క‌న‌ప‌డ‌కుండా పోవ‌డానికి గ‌ల కార‌ణాలేంటి?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

cinima-reviews
‘హిట్’

విశ్లేషణ

‘హిట్’ సినిమా ఏ రకమైన డీవియేషన్ లేకుండా.. అంతుచిక్కని ఓ మర్డర్ మిస్టరీ కేసును పాయింట్ టు పాయింట్ డీటైల్డ్ గా చదువుకుంటూ వెళ్తున్న తరహాలో నడుస్తుంది. మిస్టరీ థ్రిల్లర్లు చూసే వాళ్లకు కచ్చితంగా ‘హిట్’ మంచి అనుభూతిని కలిగిస్తుంది. మరీ చిత్ర బృందం చెప్పుకున్న స్థాయికి ఒక్క క్షణం కూడా తల తిప్పలేనంత బిగి లేదు కానీ.. ఉత్కంఠ రేకెత్తించడంలో థ్రిల్ చేయడంలోమాత్రం ‘హిట్’ విజయవంతమైంది. ‘హిట్’ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇందులోని డీటైలింగ్. అసలేమాత్రం క్లూస్ లేని ఒక హత్య కేసును ఛేదించే క్రమంలో ఒక నిపుణుడైన పోలీస్ ఆఫీసర్ ఎలా ఆలోచిస్తాడో.. అతడి ప్లానింగ్ ఎలా ఉంటుందో.. ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడో.? అని రూపోందించిన తీరు అకట్టుకుంది.

కొత్త దర్శకుడు శైలేష్ కొలను.. నిజంగానే ఒక మర్డర్ కేసును సొంతంగా డీల్ చేసి సాల్వ్ చేసిన తరహాలో తన సినిమాను తెరపై ప్రెజెంట్ చేశఆడు. ఏదో ఊహించి రాసినట్లు కాకుండా.. పరిశోధించి తెలుసుకున్న సమాచారంతో అతను స్క్రిప్టును మలిచినట్లు అనిపిస్తుంది. ఐతే కొన్ని చోట్ల డీటైలింగ్ పేరుతో మరీ లోతుగా వెళ్లిపోవడం సినిమాకు సమస్యగా కూడా మారింది. హీరో కేసును పరిశోధిస్తుండగా.. ఒక దశలో దారులన్నీ మూసుకుపోయి.. సరైన బ్రేక్ త్రూ లేక స్ట్రక్ అయిపోతాడు. అప్పుడు హీరోలోని అసహనం ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది. కథ ముందుకు సాగక సినిమా కూడా కొంచెం స్ట్రక్ అయినట్లు అనిపిస్తాయి. ఐతే ద్వితీయార్ధంలోని ఈ పోర్షన్ మినహాయిస్తే ‘హిట్’ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

‘హిట్’ సిన్సియర్ గా.. జానర్ కు కట్టుబడి సాగే థ్రిల్లర్ అని ఆరంభంలోనే అర్థమైపోతుంది. ఎక్కడా డీవియేషన్ లేదు. ప్రతి సన్నివేశం ప్రతి షాట్.. కథను అనుసరించే సాుతుంది. హీరో ఎంత తెలివైనవాడో చూపించే ఒక సన్నివేశంతో అతడి ఇంట్రోను సింపుల్ గా అవగొట్టేశాడు దర్శకుడు. ఆ తర్వాత హీరోకు సవాలుగా నిలవబోయే మిస్సింగ్ కేసు ఎపిసోడ్ మొదలవుతుంది. ప్రీతి అనే అమ్మాయి మిస్సవడం..  ఆ కేసును పరిశోధిస్తున్న హీరో ప్రేయసి కనిపించకుండా పోవడం.. ఈ రెండు కేసుల్ని ఛేదించేందుకు హీరో రంగంలోకి దిగడంతో కథ రసపట్టులో పడుతుంది. అక్కడి నుంచి డాక్యుమెంటరీ స్టయిల్లో సాగే పరిశోధన సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి.

ప్రథమార్థం షార్ప్ గా ఉండి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతుంది. రెండో అర్ధంలో టెక్నికల్ విషయాల్ని మరీ లోతుగా చర్చించే సన్నివేశాలు ప్రేక్షకుల ఆసక్తిని తగ్గిస్తాయి. ఐతే అసలు గుట్టేంటో వెల్లడయ్యే ముందు హీరోకు దొరికే లీడ్స్.. ఆ తర్వాత ట్విస్టు.. కిల్లర్ నేపథ్యం.. హత్య చేయడానికి కారణాలు.. అన్నీ కూడా ప్రేక్షకులకు షాకిస్తాయి. మొత్తంగా చూస్తే థ్రిల్లర్ ప్రియులు సినిమా నుంచి సంతృప్తిగానే బయటికొస్తారు. ఐతే ఇలాంటి సినిమాలకు బాగా అలవాటు పడ్డ వాళ్లు మరీ థ్రిల్లవుతారా అన్నది డౌట్. అలాగే దర్శకుడు పూర్తిగా జానర్ కు కట్టుబడి సిన్సియర్ గా సినిమాను నడిపించిన నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్.. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ‘హిట్’ ఏమేర రుచిస్తుందన్నదీ సందేహం.

నటీనటుల విషాయానికి వస్తే..

బయట విశ్వక్సేన్ ప్రవర్తించే.. మాట్లాడే తీరుకు భిన్నమైన పాత్రలో కనిపించాడు ఈ సినిమాలో. విశ్వక్సేన్ ఏంటి.. సీరియస్ పోలీసాఫీసర్ ఏంటి అనే వాళ్లను ఆశ్చర్యపరిచేలా అతను ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ పాత్రకు ఇతనే కరెక్ట్ అనే ఫీలింగ్ చాలా త్వరగా కలిగించి.. తనతో పాటు ట్రావెల్ అయ్యేలా చేశాడతను. ఓ చేదు గతం తనను వెంటాడుతుండగా.. సంఘర్షణకు లోనవుతూ.. ఎమోషనల్ అవుతూ కేసును డీల్ చేసే పాత్రలో విశ్వక్సేన్ నటన స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుండిపోతాయి. హీరోయిన్ రుహాని శర్మ టాలెంట్ చూపించే అవకాశం ఈ సినిమా ఇవ్వలేదు. మురళీ శర్మ.. భాను చందర్.. హరితేజ పాత్రలకు తగ్గట్లు నటించారు. నెగెటివ్ రోల్స్ చేసిన వాళ్లు ఫిట్ అనిపించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సినిమాలో దర్శకుడు హీరో తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది సంగీత దర్శకుడు వివేక్ సాగరే. థ్రిల్లర్ సినిమాకు పర్ఫెక్ట్ అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ తో అతను ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ గా తెలుగు సినిమాల్లో వినిపించే వాటికి భిన్నమైన శబ్దాలతో అతను తన పనితనం చూపించాడు. కొన్నిచోట్ల లౌడ్ అనిపించినా ఓవరాల్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మణికందన్ ఛాయాగ్రహణం కూడా సినిమాలోని ఇంటెన్సిటీని చూపించడానికి తోడ్పడింది.

నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు శైలేష్ కొలనుకు థ్రిల్లర్ జానర్ మీద పట్టుందని సినిమా చూస్తే అర్థమవుతుంది. అతను మర్డర్ మిస్టరీ కేసుల్ని బాగా పరిశోధించి సినిమా తీశాడనిపిస్తుంది. అతడి డీటైలింగ్ బాగుంది. టెక్నికల్ విషయాలపై బాగా పట్టున్నట్లు కనిపిస్తుంది. మధ్యలో కొంత డీవియేట్ అయినట్లు అనిపించినా.. ఓవరాల్ గా తన ‘ఫస్ట్ కేస్’ను అతను బాగానే డీల్ చేశాడు.

తీర్పు..

కమర్షియల్ ఎలిమెంట్స్ లేని.. పక్కా సస్పెన్స్ థ్రిల్లర్.. ఈ తరహా కథా ప్రేమికులకు గుడ్ చిల్లర్.. ‘‘హిట్’’

చివరగా... ప్రేక్షకులను కట్టిపడేసి సస్పెన్స్ థ్రిల్లర్.. ..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh