Bheeshma Movie Review ‘భీష్మ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘భీష్మ’ ‘భీష్మ’ Get information about Bheeshma Telugu Movie Review, Nithiin Bheeshma Movie Review, Bheeshma Movie Review and Rating, Bheeshma Review, Bheeshma Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 92417 3.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘భీష్మ’

 • బ్యానర్  :

  సితార ఎంటర్‌టైన్‌మెంట్‌

 • దర్శకుడు  :

  వెంకీ కుడుముల

 • నిర్మాత  :

  సూర్యదేవర నాగవంశీ

 • సంగీతం  :

  మహతి స్వర సాగర్‌

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  సాయి శ్రీరామ్

 • ఎడిటర్  :

  న‌వీన్ నూలి

 • నటినటులు  :

  నితిన్‌, రష్మిక మందన, అనంత్‌ నాగ్‌, జిష్‌సేన్‌ గుప్త, వెన్నెల కిశోర్‌, రఘుబాబు తదితరులు

Bheeshma Movie Review Rating Story Cast And Crew

విడుదల తేది :

2020-02-21

Cinema Story

‘అఆ’ చిత్రంతో క‌థానాయ‌కుడిగా యువహీరో నితిన్ స్థాయి పెరిగిపోయింది. మ‌రో ద‌శ‌లోకి వెళ్లాల్సిన ఆయ‌న కెరీర్.. వరుసగా హ్యట్రిక్ ‘లై’, ‘చ‌ల్ మోహ‌న్ రంగా’, ‘శ్రీనివాస‌క‌ళ్యాణం’తో పరాజయాలతో ఆయన విజయాలు తీసుకువచ్చిన మెట్టును అందుకోలేకపోయారు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని మంచి హిట్ కోసం వేచిచూస్తున్న నితిన్  భీష్మ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘దిల్’‌, ‘సై’ త‌ర్వాత మ‌ళ్లీ అతంటి మాస్ ఎలిమెంట్స్ వున్న చిత్రంగా దీనిని చిత్ర యూనిట్ ప్రమోట్ చేసింది. మ‌రి చిత్రం ఎలా ఉంది? నితిన్‌కి విజ‌యం ద‌క్కిన‌ట్టేనా? త‌దిత‌ర విష‌యాల్ని తెలుసుకునే ముందు క‌థేంటో చూద్దాం..

ఎనిమిది వేల కోట్ల విలువ చేసే భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ అధిప‌తి భీష్మ (అనంత‌నాగ్‌). ఆయ‌న త‌న కంపెనీకి కొత్త సీఈఓని నియ‌మించే ప‌నిలో ఉంటాడు. అర్హత‌ల‌క‌న్నా కూడా నాణ్యమైన వ్యక్తి అయితేనే త‌న సంస్థ లక్ష్యాలను నెర‌వేర్చుతాడ‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. చాలా మంది ఆ స్థానం కోసం పోటీ ప‌డుతుండ‌గా.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో డిగ్రీ కూడా పాస్ కాని భీష్మ(నితిన్‌) ముప్పై రోజుల‌పాటు ఆ కంపెనీకి సీఈఓగా ఎంపిక‌వుతాడు. ఇంత‌కీ ఆ భీష్మకీ, ఈ భీష్మకీ మ‌ధ్య సంబంధ‌మేమిటి? సీఈఓ స్థానంలో కూర్చున్న ముప్పై రోజుల్లో జూనియ‌ర్ భీష్మ ఏంచేశాడు? ఛైత్ర (ర‌ష్మిక‌)తో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు? వాళ్ల ప్రేమ‌క‌థ కంచికి చేరిందా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

cinima-reviews
‘భీష్మ’

విశ్లేషణ

ఎక్కడా డీవియేట్‌ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్‌ చేశాడు. ఈ విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. సేంద్రీయ వ్యవ‌సాయం అనే నేప‌థ్యం మినహా క‌థ సాధార‌ణ‌మైన‌దే. కానీ ఆ క‌థ‌కే త‌గిన‌న్ని మ‌లుపులు, సంద‌ర్భోచితంగా పండే హాస్యాన్ని జోడించి చిత్రాన్ని తీర్చిదిద్దారు. క‌థ చూసిందే క‌దా అనే విష‌యాన్ని కూడా గుర్తురానీయ‌కుండా త‌ర‌చూ న‌వ్విస్తుంటాయి పాత్రలు. ద‌ర్శకుడు త‌న తొలి సినిమాతోనే క‌థ‌లో హాస్యాన్ని మేళ‌వించ‌డంపై త‌న‌కి మంచి ప‌ట్టుంద‌ని నిరూపించారు.

మ‌రోసారి త‌న బ‌లాన్నే వాడుకుని చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అనంత్‌ నాగ్‌ ఆర్గానిక్‌ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్‌ ఎంట్రీ, వెన్నెల కిశోర్‌, సంపత్‌, నరేశ్‌, నితిన్‌, బ్రహ్మాజీల కామెడీ, నితిన్‌, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్‌ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. ద్వితీయార్థంలో కొన్నిచోట్ల సాగ‌దీత‌లా అనిపించినా.. అది హాస్యానికి బ్రేక్ అనిపిస్తోందే తప్ప మరీ బోర్ అనిపించదు. హీరో పాత్ర స‌గ‌టు తెలుగు సినిమాల్లోలాగే ఉంటుంది. ఆరంభ స‌న్నివేశాలు సాధార‌ణంగానే అనిపిస్తాయి.

ఇక సెకండాఫ్‌ కామెడీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్‌ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్‌ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్‌ డైలాగ్‌లు వావ్‌ అనిపించేలా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందని ‘భీష్మ’ సినిమాతో మరోసారి రుజువైంది.

నటీనటుల విషాయానికి వస్తే..

భీష్మ సినిమాలో మన పక్కింటి కుర్రాడిలా కనిపించాడు హీరో నితిన్. ఆయన లుక్, మేకింగ్ విషయంలో గత చిత్రాల స్టైల్లోనే కనపడ్డాడు. సందర్భానుసారం వచ్చే కామెడీ సన్నివేశాల్లో నితిన్ చక్కగా నటించాడు. ముఖ్యంగా మీమ్స్ డైలాగ్స్ చెప్పే సీన్స్, వెన్నెలకిషోర్ కామెడీ..రఘుబాబు కామెడీ ఆకట్టుకుంటుంది. రష్మికతో లవ్ సీన్స్‌లోనూ నితిన్ నటన ఆకట్టుకుంటుంది. ఇక రష్మిక విషయానికి వస్తే.. తను పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది.

ముఖ్యంగా వాట్టే బేబీ పాటలో.. తన నటన ఆకట్టుకుంటుంది. సంపత్, నరేశ్, బ్రహ్మాజీ తదితరులు వారి పాత్రల మేరకు చక్కగా నటించారు. సంపత్ క్యారెక్టర్‌ను చూపించినంత సీరియస్‌గా క్యారీ చేయకుండా కమర్షియల్ సినిమాలో కామెడీ చేసేసినట్టు చేసేశారు. ఇక సినిమాలో కమర్షియల్ కామెడీని పండించడంలో వెన్నెల కిషోర్ తనదైన పాత్రను పోషించాడు. వాస్తవానికి దూరంగా ఉండే ఈ పాత్రలో వెన్నెల కిషోర్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ప్రతినాయకుడి పాత్రకు బలం లేకపోవడమే కొంత మైనస్ గా నిలుస్తోంది.

టెక్నికల్ అంశాలకు వస్తే..

మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వర సాగర్‌ అందించిన సంగీతం చిత్రానికి బలాన్ని అందించింది. ఈ సినిమా పాటలు ఎంతటి హిట్‌ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాగర్ మహతి సంగీతంలో వాట్టే బేబీ... సాంగ్ అందులో నితిన్, రష్మిక డాన్స్ చాలా బావున్నాయి. ఇక బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. సింగర్స్‌, లిరక్‌ రైటర్స్‌ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్ గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్‌ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్ గా చూపించారు. నవీన్ నూలీ ఎడిటింగ్‌ బాగుంది.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా.. నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రం ‘భీష్మ’. కమర్షియల్ పంథాలో సినిమాను ఆసాంతం ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.. నితిన్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుంది.

తీర్పు..

భీష్మడు అధృష్టవంతుడని చాటుతున్న రెగ్యూలర్ కమర్షియల్.. ‘‘ పక్కా పైసా వసూల్ చిత్రం’’

చివరగా... రోమాన్స్, కామెడీ, యాక్షన్ కలగలిపిన సందేశాత్మక చిత్రం..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh