hello guru prema kosame: a comedy entertainer ‘హలో గురు ప్రేమకోసమే’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘హలో గురు ప్రేమకోసమే’ ‘హలో గురు ప్రేమకోసమే’ ‘Hello Guru Prema Kosame’ is a comedy, youthful romantic entertainer with energetic star Ram and happening beauty Anupama Parameshwaran, produced by Dil Raju. Product #: 88887 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘హలో గురు ప్రేమకోసమే’

 • బ్యానర్  :

  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

 • దర్శకుడు  :

  త్రినాథ‌రావు న‌క్కిన‌

 • నిర్మాత  :

  శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌

 • సంగీతం  :

  దేవిశ్రీ ప్ర‌సాద్‌

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  విజ‌య్ కె.చ‌క్ర‌వర్తి

 • ఎడిటర్  :

  కార్తీక శ్రీనివాస్‌

 • నటినటులు  :

  రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌ణీత‌, స‌త్య తదిత‌రులు

Hello Guru Prema Kosame Moive Review

విడుదల తేది :

2018-10-18

Cinema Story

సంజు (రామ్)ది కాకినాడ. సొంతూరులో తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా వుండటం తప్ప అతడికి పెద్దగా లక్ష్యాలు లేవు. మావయ్య (పోసాని)తో మాట్లాడిన తరవాత అతడిలో మార్పు వస్తుంది. తను ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులు సంతోషపడతారని తెలుసుకుని హైదరాబాద్ ట్రయిన్ ఎక్కుతాడు. రైల్వే స్టేషన్ లో కాకినాడ కుర్రాళ్లను తక్కువచేసి మాట్లాడిన అనుపమ (అనుపమ పరమేశ్వరన్)ను భయపెడతాడు. హైదరాబాద్ చేరాక ఆ అమ్మాయి, తన తల్లి స్నేహితుడు విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) కూతురు అని తెలుస్తుంది.

సంజు కూడా వాళ్ళింట్లో వుండవలసి వస్తుంది. రైళ్లో చేసిన ప‌నికి సారీ చెప్పి అనుపమతో స్నేహం చేస్తాడు సంజు. ఆఫీసులో రీతు (ప్రణీత)కు అకర్షితుడు అవుతాడు. అమెతో తన ప్రేమను బయట పెట్టాలనుకునే సమయానికి తనను అనుపమను ప్రేమిస్తుందని సంజు తెలుసుకుంటాడు. అనుప‌మ‌తో సంజు ఫ్రెండ్‌షిప్ ల‌వ్ గా ఎప్పుడు మారింది? ఆ ప్రేమ సంగతి తెలిసిన విశ్వనాథ్ ఏం చేశాడు? సంజు ప్రేమను అనుపమ అంగీకరించిందా? లేదా? చివరికి ఏం జరిగింది? కథ సుఖాంతమయ్యిందా.? లేదా.? అన్నదే కథ..

cinima-reviews
‘హలో గురు ప్రేమకోసమే’

విశ్లేషణ

తన కుమార్తెను ఒక అబ్బాయి ప్రేమించాడని తెలిసిన తర్వాత ప్రతి తండ్రి... ఒక తండ్రి స్థానంలో కాకుండా ప్రేమించిన అబ్బాయి స్నేహితుడు స్థానంలో వుండి ఆలోచిస్తే ఎలా వుంటుంది? అని అలోచించి రాసిన కథ, తీసిన సినిమా ఈ 'హలో గురు ప్రేమ కోసమే'. ఈ ఆలోచనలో వున్నంత కొత్తదనం కథలో, సినిమాలో లేదు. రొటీన్‌గా వుంటుంది. కానీ, కామెడీ మాత్రం వర్కవుట్ అయ్యింది. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా వెళ్తుంది. మూడు పంచ్ డైలాగులు, ఆరు నవ్వులు అన్నట్టు వెళ్తుంది. ఇందులో భాగంగా వచ్చే సన్నివేశాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ట్ర‌ైనింగ్ క్లాస్ రూమ్ సీన్‌, కాఫీ షాప్ సీన్.. యూత్ కి నచ్చుతాయి. వాటిలో తమను తాము చూసుకుంటారు. ముందు ప్రణీత వెంటపడిన రామ్, ప్రణీత ప్రపోజ్ చేసే సమయంలో తను అనుపమను లవ్ చేస్తున్నానని అర్థం చేసుకునే సన్నివేశం అంత కన్వీన్సింగ్ గా అనిపించదు. కానీ, అప్పటివరకూ నవ్వించారు కాబట్టి ప్రేక్షకులు ఎవరూ పెద్దగా నోటీస్ చేయరు. కానీ, అప్పటినుంచి అసలు కథ ఎప్పుడు మొదలైందో? అన్న ప్రేక్షకుడికి కథ మరీ రొటీన్ గా వెళ్తుందన్న విషయం అప్పుడు కానీ అవగతం కాదు. అయితే సినిమా మాత్రం దసరా పండుగ వేళ.. సరదాగా సాగిపోయే కామెడీ, యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటైర్ టైనర్ గా నిలించింది.

నటీనటుల విషానికి వస్తే

హీరో రామ్ చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. లవ్, కామెడీ స్టోరీల్లో అతడి నటన ఎలా ఉంటుందో.. రెడీ, నేను శైలజ చిత్రాల తరహాలో మాదిరిగా ఈ సినిమాలోనూ రామ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తాయి. ఫ్యామిలీ గర్ల్‌గా, తండ్రిని ఎంతో ఇష్టపడే అమ్మాయి పాత్రకు అనుపమ న్యాయం చేసింది. ఇక అను తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

హీరో రామ్.. హీరోయిన్ తండ్రి ప్రకాష్ రాజ్ ల మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. ఓ పక్క అమ్మాయి తండ్రిగా.. మరో పక్క తన కూతుర్ని ప్రేమించిన కుర్రాడికి స్నేహితుడిగా తనకే సాధ్యమైన నటనను కనబరిచారాయన. అను తల్లిగా ఆమని మాట్లాడే బట్లర్ ఇంగ్లిష్ నవ్విస్తుంది. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ప్రణితది. నాలుగు సన్నివేశాల్లో నటించి.. ఓ పాటలో మెరిసినా.. అమె పాత్రకు మాత్రం అంత ప్రాముఖ్యత లేదు. మిగతా పాత్రలన్నీ సందర్భానుసారం వచ్చి వెళ్తుంటాయి. కానీ వాటికి కూడా అంతగా ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి.

టెక్నికల్ అంశాలకు వస్తే..

ఇది రొటీన్ కథే అయినప్పటికీ.. వైవిధ్యంగా తెరకెక్కించేందుకు డైరెక్టర్ ప్రయత్నించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించారు. కానీ సెకండ్ హాఫ్ లో ప్రకాశ్ రాజ్-రామ్ మధ్య వచ్చే సీన్లు మరింత ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అనుపమ క్యారెక్టర్ ను మరింత ఎలివెట్ చేస్తే ఆడియెన్స్ మరింతగా కనెక్ట్ అయ్యేవారు. స్టోరీ ముందే అర్థమైపోవడం వల్ల ప్రేక్షుకుడిలో ఆసక్తి తగ్గుతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

రామ్ కాస్ట్యూమ్స్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ప్రసన్న కుమార్ డైలాగ్స్ పేలాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్, దేవీ శ్రీ సంగీతం ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మెత్తానికి దసరా పండగ పర్వదినాన విడుదలైన ఈ సినిమా సరదాగా కాసేపు నవ్వుకోవాలని ఆలోచించే వాళ్ళ కోసమే. లాజిక్స్ గురించి కాకుండా మేజిక్స్ ఎంజాయ్ చేస్తూ కాసేపు నవ్వుకుందాం అనుకుంటే సినిమాకు హాయిగా వెళ్లొచ్చు.

తీర్పు..

మాట‌ల తూటాలను పేల్చుతూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యూత్ పుల్ రోమాంటిక్ చిత్రంగా.. రామ్ ఎనర్జిటిక్ పర్మామెన్స్, ప్రకాష్ రాజ్ నటన చిత్రానికి బలంగా నిలుస్తుంది.

చివరగా... పండగ వేళ.. సరదగా చూసి నవ్వుకునే చిత్రం..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh