NOTA: Vijay Devarakonda is riveting in a political drama ‘నోటా’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘నోటా’ ‘నోటా’ Vijay Devarakonda’s first straight Tamil film NOTA, directed by Anand Shankar, is an intense political thriller, without any commercial frills. Product #: 88787 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘నోటా’

  • బ్యానర్  :

    స్టూడియో గ్రీన్

  • దర్శకుడు  :

    ఆనంద్ శంక‌ర్

  • నిర్మాత  :

    కేఈ జ్ఞాన‌వేల్ రాజా

  • సంగీతం  :

    శ్యామ్ సిఎస్‌

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    శంతన్‌ కృష్ణ‌ణ్ ర‌విచంద్ర‌న్

  • ఎడిటర్  :

    రేమాండ్ డెరిక్ క్రాస్టా

  • నటినటులు  :

    విజయ్ దేవరకొండ, మెహ్రీన్, యాషికా ఆనంద్, నాజర్, సత్యరాజ్, ప్రియదర్శి త‌దిత‌రులు

Nota Moive Review

విడుదల తేది :

2018-10-05

Cinema Story

వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) కొడుకు. తన తండ్రికి దూరంగా లండన్ లో ఉంటాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటాడు. వాసుదేవ్ అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే సీఎం పదవిని తన వారసుడికి అప్పగించాలని వాసుదేవ్ విపరీతంగా నమ్మే ఓ స్వామీజీ చెప్తాడు. ఆయన చెప్పినట్టే తన పదవికి రాజీనామా చేసి సీఎం సీటులో కొడుకు వరుణ్‌ను కూర్చోబెడతాడు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తరువాత మళ్లీ పదవిని అందుకుందామని అనుకుంటాడు.

ఈ కేసులో వాసుదేవ్ ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో కథలో ట్విస్టు ఏర్పాడుతుంది. వాసుదేవ్ జైల్లో ఉన్న కాలంలో వరుణ్ మంచి సీఎంగా ప్రజలకు చేరువైపోతాడు. అసలు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియకుండా సీఎం పదవి చేపట్టిన వరుణ్.. జర్నలిస్టు మహేందర్(సత్యరాజ్) సాయంతో ప్రజలు మెచ్చే నాయకుడిగా ఎలా మారుతాడు. ఇక మరోవైపు బెయిల్ వచ్చిన వాసుదేవ్ పై బాంబ్ దాడి జరుగుతుంది. అది చేసిందెవరు.? ఈ దాడిలో వాసుదేవ్ కు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

cinima-reviews
‘నోటా’

విశ్లేషణ

అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎం అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం లేదా చనిపోవడం.. అసలు రాజకీయమంటేనే తెలియని ఆయన కొడుకు సీఎం కావడం.. ఆ తరవాత మంచి సీఎంగా ప్రజల మన్ననలు పొందడం.. రాజకీయ ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదుర్కోవడం.. ఇలాంటి అంశాలతో ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘లీడర్’, ‘భరత్ అనే నేను’ ఈ కోవకు చెందినవే. ‘నోటా’ కూడా ఇలాంటి సినిమానే. కాకపోతే దీనిలో కాస్త కొత్తధనం ఉంది. గత సినిమాల్లో తండ్రిని మంచోడిగా చూపించారు. ఈ సినిమాలో తండ్రిలోనే నెగిటివ్ యాంగిల్ ఉంటుంది. అది తెలుసుకున్న కొడుకు సీఎం పదవి తన చేతిలోనే ఉండాటానికి ఎలా ప్రయత్నించాడో చూపించారు.

ఇది పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామా. ప్రేమాయణాలు, ప్రేమగీతాలకు దీనిలో స్థానం లేదు. ఉన్నవి రెండే పాటలు. అవి కూడా ఫస్టాఫ్‌లోనే అయిపోతాయి. సెకండాఫ్ మొత్తం పొలిటికల్ థ్రిల్లరే. అయితే సినిమాకు మైనస్ కూడా సెకండాఫే. ఫస్టాఫ్‌ను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్.. సెకండాఫ్‌ను బాగా సాగదీశారు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. ముఖ్యంగా ప్రెస్ మీట్ సీన్ అదుర్స్ అనే చెప్పాలి. ఈ ప్రెస్‌ మీట్‌లో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సూపర్. అసలు ఈ ప్రెస్ మీట్‌తోనే రౌడీ సీఎం అనే ముద్ర ఆయనపై పడుతుంది. ఇంటర్వల్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. తరవాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరుగుతుంది.

అయితే ఇంటర్వల్ తర్వాత అందరికీ తెలిసిన కథనే దర్శకుడు చూపించారు. రాజకీయ ఎత్తులు, పదవిని కాపాడుకోవడానికి సీఎంలు చేసే ప్రయత్నాలు ఇలా అన్నీ ఊహించినవే. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వాళ్లను రిసార్ట్‌లకు పంపడం, డబ్బు ఆశచూపడం ఇప్పటికే బయట చూశాం. అవే సన్నివేశాలను మళ్లీ తెరపై చూపించారు. ముఖ్యంగా తమిళనాడులో జరిగే పొలిటికల్ డ్రామాను దర్శకుడు ప్రధానంగా చేసుకుని సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు సెకండాఫ్‌లో వచ్చే మహేందర్ (సత్యరాజ్) లవ్ స్టోరీ కాస్త బోర్ కొట్టిస్తుంది. కానీ ఆ స్టోరీతో కథకు పెద్ద లింకే ఉంటుంది. మొత్తానికి సినిమాను రెండున్నర గంటల్లో ముగించినా శుభం కార్డు మాత్రం వేయలేదు. విలన్‌ని శిక్షించలేదు. వచ్చే ఎన్నికల కోసం సీఎం కొత్త వ్యూహాన్ని తన అనుచర వర్గానికి చెబుతారు. ఈ క్లైమాక్స్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందేమో అనిపిస్తోంది.

నటీనటుల విషానికి వస్తే

రౌడీ సీఎంగా విజయ్ దేవరకొండ నటన చాలా బాగుంది. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ, జీవితాన్ని సరదాగా గడిపే కుర్రాడిలా.. సీఎం పదవి చేపట్టి, దానికి అనుగుణంగా మారిన బాధ్యత గల పౌరుడిలా విజయ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా తన రౌడీ యాటిట్యూడ్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ఆ తరవాత నాజర్ నటన సినిమాకు మరో ప్లస్. ఆయన డబ్బింగ్, నటన నవ్వు తెప్పిస్తుంది.

సత్యరాజ్‌ పాత్రకూ ప్రాధాన్యత అధికంగానే వుంది. ఎప్పటిలానే ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. యువ రాజకీయ ప్రత్యర్థి పాత్రలో సంచన నటరాజన్ నటన బాగుంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు. సినిమాలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో మెహ్రీన్ మెరువలేకపోయింది. ఎం.ఎస్.భాస్కర్, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. దర్శకుడు ఆనంద్ శంకర్ గురువు ఎ.ఆర్.మురుగుదాస్ కూడా ఒక చిన్న పాత్రలో మెరిశారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. జ్ఞానవేల్ రాజా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ‘రామ్ లీల’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ వంటి బాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేసిన సంతాన క్రిష్ణన్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక శామ్ సీఎస్ అందించిన సంగీతం పర్వాలేదు. ఆల్బమ్‌లో ఆరు పాటలున్నా.. సినిమాలో మాత్రం రెండే పాటలు పెట్టారు.

తీర్పు..

కమర్షియల్ అంశాలు లేని పొలిటికల్ డ్రామా.. అసలు సినిమాకు నోటా అనే టైటిల్ ఎందుకుపెట్టారో అర్థంకాదు. కామెడీ, వినోదం వంటి కమర్షియల్ అంశాలు లేకుండా సాగే సినిమా ఇది.

చివరగా... ప్రేక్షకులకు బోర్ కొట్టించే నోటా..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh