Raj tarun Raju gadu movie review ప్రేక్షకుడిని ఆదరించని రాజుగాడు

Teluguwishesh రాజు గాడు రాజు గాడు Debutant director Sanjana Reddy has made a lot of clamour about her debut film ‘Raju Gadu’. Unfortunately, the film does not live up to anything she claimed it to be. Product #: 87839 1.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  రాజుగాడు

 • బ్యానర్  :

  ఏకే ఎంటర్ టైన్మెట్స్

 • దర్శకుడు  :

  సంజనా రెడ్డి

 • నిర్మాత  :

  అనిల్‌ సుంకర

 • సంగీతం  :

  గోపి సుందర్

 • సినిమా రేటింగ్  :

  1.75  1.75

 • ఛాయాగ్రహణం  :

  రఘు-విజయ్

 • ఎడిటర్  :

  ఎంఆర్ వర్మ

 • నటినటులు  :

  రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌, రాజేంద్రప్రసాద్‌, నాగినీడు, ప్రవీణ్‌, సితార, పృథ్వీ తదితరులు

Raju Gadu Movie Review

విడుదల తేది :

2018-06-01

Cinema Story

‘‘రాజుగాడు’ ఓ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్ ‌టైనర్‌. ఓ అబ్బాయి వల్ల కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనే కోణంలో సాగే చిత్రమిది. తనకు కనిపించిన ప్రతి వస్తువుని దొంగతనం చేస్తుంటాడు హీరో. అయితే ఇది అతనిలో వున్న బలహీనత. ఆ వస్తువుతో అతనికి వున్న ఉపయోగం ఏమిటన్నది తెలయకపోయినా.. కనిపించగానే వాటిని తస్కరించడమే అతనికి వున్న రుగ్మత. సాధారణంగా ప్రతి 10 మందిలో ఒకరు ఈ రుగ్మత వారిన పడుతుంటారు.

ఈ సమస్య వున్న హీరో తన రుగ్మతతో తన కుటుంబానికి తెచ్చిన కష్టాలు ఏంటీ..? స్వయంగా తాను ఎదుర్కొన్న కష్టాలు ఏంటీ అన్నది చిత్ర కథ. దీని వల్ల హీరో‌ ఉద్యోగం పోతుంది. అంతేకాదు కొడుకు కోసం తన తండ్రి ‌కూడా ఉద్యోగం మానేసి, సూపర్ మార్కెట్‌ నడుపుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో హీరో‌ ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఎలా చేరుకుంటాడు.. చేరువవుతాడు.. తన రుగ్మత వారి ప్రేమ మధ్య గొడవలు తెచ్చిపెడుతుందా.? వాటిని ఎలా అధిగమించాడు.. అనేది చిత్రకథ.

cinima-reviews
రాజు గాడు

హీరో పాత్రకు క్లెప్టోమేనియా అనే జబ్బును అద్దిన సినిమా మొత్తాన్ని కామెడీ ట్రాక్ లో ప్రెజంట్ చేయాలన్నారు దర్శకురాలు చిత్ర కథ.. కథనంలో మాత్రం అలా రాణించలేక విఫలమయ్యారు. కామెడీ ట్రాక్‌ కథను ఎంచుకోవడంతో కథ, కథనంలో కూడా హాస్యాన్ని పండించేలా చూసుకోవడంలో రాణించలేకపోయారు. కామెడీ ట్రాక్ కథ, కథనంలో కొత్తధనం లేకుండా రోటిన్ చిత్రాల మాదిరిగా సాగదీత ధోరణిలో ఈ చిత్రం సాగడంతో అమె సక్సెస్ సాధించలేకపోయారు. పూర్తిస్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయారు. కథను వినోదాత్మకంగా మొదలుపెట్టి హీరో పాత్రతో కొంత కామెడీ పండించారు.

అయితే ఆ కామెడీ కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. బలమైన సన్నివేశాలు కూడా చిత్రంలో లోపించాయి. ఈ సినిమాకు నాని నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా స్ఫూర్తి అంటూ దర్శకురాలు సంజనా రెడ్డి చెప్పినా. అ చిత్రంలో వున్నట్లుగా కొత్త కాన్సెప్ట్ తో పాటు కామెడీ ఎపిసోడ్స్, ఎమోషన్ ను పండించలేకపోయారు సంజన. ఫస్ట్ హాఫ్ రెండు కామెడీ సన్నివేశాలు ఓ లవ్ ట్రాక్ అంటూ సాగిపోతుంది. హీరో పాత్ర గ్రామంలో ఎంటర్ అయినప్పటి నుండి కామెడీ మళ్లీ పుంజుకుంటుంది. సన్నివేశాలను సాగదీసి చూపించడంతో ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇక క్లైమాక్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనిపించేలా వుంది.

నటీనటుల విషయానికోస్తే..

తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో సినిమాను నడిపించే రాజ్ తరుణ్ ఈ సినిమాలో మాత్రం అలా నటించలేదన్న అభిప్రాయం కలుగుతుంది. తన పాత్ర ద్వారా కామెడీ అందించే ప్రయత్నం చేసినా అది ప్రేక్షకుల అదరణను మాత్రం రాబట్టుకోలేకపోయింది. ఇక సినిమాకు హైలైట్ గా నిలిచింది రాజేంద్రప్రసాద్ నటన. హీరో తండ్రిగా అతడు చేసిన నటనకు ఫుల్ మార్క్ ఇవ్వోచ్చు. అతడి బాడీ లాంగ్వేజ్, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

హీరోయిన్ అమైరా దస్తూర్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చినప్పటికీ.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ పెద్దగా ఆకట్టుకోదు. నాగినీడు, రావు రమేష్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. డాక్టర్ పాత్రలో పృధ్వీ అక్కడక్కడా ప్రేక్షకులను నవ్విస్తాడు. కామెడీ ప్రెజెంటేషన్ లోనే లోపం వుందన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే నటీనటులు మాత్రం తమ పాత్రలను అనుగూణంగా నటనను ప్రదర్శించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని దర్శకురాలు రాసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం పేలవంగా తయారైంది. దీంతో కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏదీ లేకుండా పోయింది. కొత్త దర్శకులు తమదైన వైవిధ్యమైన చిత్రాలతో టాలెంట్ చూపిస్తుంటే సంజనా మాత్రం కనీసపు అంచనాలను అందుకోలేకపోయింది. నిర్మాతలు మాత్రం సినిమాపై బాగానే ఖర్చు పెట్టారు. గోపి సుందర్ మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగుకి వచ్చేసరికి మాత్రం అతడు సరైన మ్యూజిక్ చేయలేకపోతున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌ పరంగా కూడా కేర్‌ తీసుకోలేదనిపిస్తుంది సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సివుంది. సంభాషణలు సహజంగా ఉన్నప్పటికీ ఆకట్టుకోవు.

తీర్పు:

టైటిల్‌ని బట్టి, ప్రోమోస్‌ చూసి ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్ అనే భావన కలుగుతుంది కానీ ఇందులో వినోదం కంటే కూడా విచారమే ఎక్కువుంది. ప్రథమార్ధమంతా రెండు మూడు కామెడీ సన్నివేశాలు, రొటీన్ లవ్ ట్రాక్ తో సాగుతుంది. కానీ వాటిని అంతే రొమాంటిక్ గా, కామెడీగా తెరకెక్కించలేకపోయారు దర్శకురాలు. తొలి ప్రయత్నంలో విమర్శలు వస్తే మలిచిత్రానికి కాన్ఫిడెన్స్ తో ఒకటికి రెండు పర్యాయాలు కథను,కథనాన్ని, కామెడీ ట్రాక్ ను, సన్నివేశాలను, మాటలను, డైలాగులను చూసుకుంటారు. అయితే సంజనా రెడ్డి రాజగాడిని ప్రేక్షకుడు ఎంతలా అదరిస్తారో వేచి చూడాలి.

చివరగా.. ప్రేక్షకుల మనసును తస్కరించలేని రాజుగాడు..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh