Samaikyandhra movement away to balakrishna and lokesh babu

samaikyandhra movement away to balakrishna and lokesh babu, Samaikyandhra movement, tdp, Nara Lokesh Babu, Chandrababu in busyatra,

samaikyandhra movement away to balakrishna and lokesh babu

సమైక్యానికి దూరంగా బాలయ్య అల్లుడు?

Posted: 09/02/2013 05:45 PM IST
Samaikyandhra movement away to balakrishna and lokesh babu

తెలుగుదేశం పార్టీలోకి యువకులు రావాలని, పార్టీకి యువ రక్తం కావాలని పిలుపునిచ్చిన బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ బాబు ఇప్పుడు సమైక్యానికి దూరంగా ఉన్నాడు. రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ట్విట్టర్ ద్వారా ఘాటైన కామెంట్స్ చేసి ట్విట్టర్ బాబుగా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ బాబు ఈ మద్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన పై ఇప్పటి వరకు లోకేస్ బాబు ఒక్క కామెంట్ చెయ్యకపోవటంతో పార్టీలోని నాయకులకు అనేక అనుమానాలు రేకేత్తున్నాయి.. లోకేస్ బాబును కావాలనే పార్టీ దూరంగా పెట్టినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల కాలంలో లోకేష్ పెంచిన దూకుడు వలన నారా కుటుంబం, నందమూరి కుటుంబం మద్య పెరిగిన అగాధం గురించి అందరికి తెలిసిన విషయమే. బాలయ్య అల్లుడు పై నందమూరి హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి దంపతులు ద్వేషంగా ఉన్నట్లు పార్టీలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో..స్టూడియ్ ఎన్ బాధ్యతలను లోకేష్ చూసిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తరువాత పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు టిడిపిలో ఏ నాయకుడు తుమ్మినా, దగ్గినా, దానిపై స్టూడియ్ ఎన్ టీవీలో ఒక ఎపిసోడ్ తప్పనిసరిగా వచ్చేది. కానీ రానురాను అది కాస్తా తగ్గిపోయి, జూనియర్ ఎన్టీఆర్ గురించి, పెద్ద ఎన్టీఆర్ గురించి, పురందేశ్వరి దంపతులు గురించి గంటల తరబడి కార్యక్రమాలు రావటంతో..బాలయ్య అల్లుడు తప్పకోవటం జరిగింది. అయితే అప్పటి నుండి ట్విట్టర్ మీద ఆధారపడి.. రాజకీయ నాయకుల మీద ఘాటైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే టిడిపి యువ నాయకుడుగా ఎదుగుతున్న తరుణంలో సమైక్యాంద్ర ఉద్యమానికి దూరంగా లోకేష్ ఉండటంపై సీమాంద్ర ప్రజలు మండిపడుతున్నారని, పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న ఆత్మగౌరవ యాత్రలో బాలయ్య, లోకేష్ బాబు కనిపిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more