సార్వత్రిక ఎన్నికలకు 12నెలల సమయం ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ నాయకుల్లో అప్పుడే ఎన్నికల ఫివర్ మొదలైంది. అన్నీ రాజకీయ పార్టీలకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో వడ దెబ్బకు అనేక మంది చనిపోతున్నా విషయం తెలిసిందే. అయితే వడ దెబ్బ రాజకీయ నాయకులకు బాగా కలిసి వచ్చింది. నగరంలో అనేక చోట్లు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే చలివేంద్రంలో మంచి నీళ్ల సంగతి ఎలా ఉన్నా..? ఆయా చలివేంద్రాలపై రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ గుర్తులు, దర్శనమిస్తున్నాయి. సమాజ సేవా పేరుతో కూడా రాజకీయ నాయకులు ఇలా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని, దప్పిక తీర్చుకోవటానికి వచ్చిన సామాన్య ప్రజలు అంటున్నారు.
అన్నీ రాజకీయ పార్టీలు ఇలా సమ్మర్ చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ముందుగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే దాహం వేసిన వ్యక్తి, దాహం తీర్చుకోవటానికే చలివేంద్రానికి వస్తారు గానీ, మా పార్టీ నాయకుడు, మా పార్టీ, అని ఎవరైన వచ్చి దాహం తీర్చుకుంటారా, అని సామాన్య ప్రజలు అంటున్నారు. చలివేంద్రంలో పని చేసేవారికి ఆ పార్టీ నాయకుడికి, ఆ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని ప్రజలు చెబుతున్నారు. కానీ వారి బ్రతుకు జీవనంలో.. కొన్ని రోజులు, సమ్మర్ చలివేంద్రాల వలన పని దొరుకుతుంది, కొంచెం డబ్బులు సంపాదించుకోవటం జరుగుతుందని పేద ప్రజలు అంటున్నారు.
సమాజ సేవా పేరుతో ఆ పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలుగానీ వాలెంటరీలుగా మారి ప్రజలకు సేవా చెయ్యటంలేదని సినీయర్ సిటిజన్స్ అంటున్నారు. రాజకీయ నాయకుల స్వార్థంతోనే ఇలాంటి చలివేంద్రాలు పెడుతున్నారు గానీ, మనస్పూర్తిగా ప్రజలకు సేవా చేసే నాయకులు, కార్యకర్తలు, రాజకీయ పార్టీలు, లేరని నగర ప్రజలు అంటున్నారు. మంచినీళ్ల పేరుతో రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం చేసుకోవటం చాలా దారుణమని.. సంఘ సేవా సభ్యులు అంటున్నారు.
ఆ చలివేంద్రానికి అయ్యే ఖర్చును, ఆయా రాజకీయ నాయకులు భరిస్తున్నారు కాబట్టి వారు ఫోటోలు, పార్టీ గుర్తులు వేసుకోవటం తప్పులేదని వాదించే మహా మనుషులు కూడా ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడైతేనేం , ఏ పార్టీ అయితేనేం.. సమ్మర్ కాలంలో కొంత మందికి ఉపాది, ప్రజలకు మంచినీళ్లు అందిస్తున్నారు అదిచాలు. అని సర్థుకుపోయే పుణ్యమూర్తులు కూడా ఉన్నారు. ఏమైన ఈ చలివేంద్ర సేవా వలన ఎవరు నష్టపోతున్నారో, ఎవరు లాభపడుతున్నారో అంత ఆ పేరుమళ్లకే తెలియాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more