Ap telugu politcal gossip balakrishna effect is dadi veerabhadra rao to join in ysrcp

balakrishna effect is dadi veerabhadra rao to join in ysrcp, dadi veerabhadra rao, tdp senior leader dadi veerabhadra rao, dadi veerabhadra rao to join in ysrcp, actor balakrishna, tdp, chandrababu naidu, purandeswari, ys jagan, visakhapattanam, erramnaidu, tdp mlas, tdp leaders,

balakrishna effect is dadi veerabhadra rao to join in ysrcp

‘దాడి ’వెళ్లటానికి కారణం బాలయ్యేనట?

Posted: 05/03/2013 05:13 PM IST
Ap telugu politcal gossip balakrishna effect is dadi veerabhadra rao to join in ysrcp

30 ఏళ్లు తెలుగుదేశం పార్టీ లో సీనియర్ నాయకుడిగా ఉన్న దాడి వీరభద్రరావు. నేటితో కొత్త  ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తెలుగుదేశం పార్టీలో రెండో నాయకుడిగా ఎదిగే సమయంలో..  విభిన్నమైన నిర్ణయం తీసుకోని టిడిపిలో.. పెను సంచలనం పుట్టించారు. చంద్రబాబు కంటే.. రాజకీయ ప్రత్యర్థులపై.. ఎదురు ‘దాడి ’ చెయ్యటంలో  ముందుండే నాయకుడు పార్టీని వదిలి వెళ్లిపోయాడు. 30 సంవత్సరాల .. రాజకీయ అనుభవం ఉన్న దాడి  పార్టీని ఎందుకు వీడినట్లు?  అసలు దాడి వెళ్లటానికి ముఖ్య కారణం ఏమిటి? టిడిపి నుండి  నాయకులు ఎందుకు వలసలు పోతున్నారు?  పార్టీలో ఉన్న లోపం ఏమిటి?  కేవలం డబ్బు కోసమే వెళ్లుతున్నారా?  వలస వెళ్లిన ప్రతి నాయకుడు  పార్టీ పై, అధినేత ఏదో ఒక కారణం చెబుతున్నారు.

అసలు 2013 సంవత్సరం టిడిపి కలిసి రాలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరుతున్నారు? అనే ప్రశ్నలు  టిడిపి కార్యకర్తలను వేధిస్తున్నాయి. ఇప్పటి వరకు చేరిన వారిలో మైసూర రెడ్డి, ప్రసన్న కుమార్, ప్రవీణ్ కుమార్, అనిత, ఇంక కొంతమంది నాయకులు  వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే  వెళ్లిన నాయకులు ఏవో కారణాలు చెప్పివెళ్లిపోయారు. కానీ  దాడి వీరభద్రరావు వెళ్లటానికి ఒక బలమైన కారణం ఉందని  పార్టీ శ్రేణులు అంటున్నాయి.  టిడిపి అధినేత చంద్రబాబు కంటే.. ఇటీవల పార్టీలోకి వచ్చిన  సినీ నటుడు బాలయ్య వలనే పార్టీ నాయకులు వెళ్లిపోతున్నారనే  విమర్శలు పార్టీలో  బలంగా వినిపిస్తున్నాయి. 

చంద్రబాబు పాదయాత్ర  చేస్తున్న సమయంలో  సీనియర్ నాయకులపై.. బాలయ్య తన హవా చూపించినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు. సీనియర్ నాయకులను చులకనగా చూడటం, వారితో సంప్రదించకుండానే.. కొన్ని నిర్ణయాలు తీసుకోవటంతో  పార్టీ నాయకులకు బాలయ్య బాధలు రోజు రోజుకు ఎక్కువ కావటంతో.. విసిగిపోయిన నాయకులు  వెళ్లిపోవటం జరిగినట్లు  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అంతేకాకుండా రాబోయో రోజుల్లో టిడిపి  కుటుంబం పార్టీగా మారిపోతుందనే పుకార్లు పార్టీ శ్రేణుల మద్య బలంగా వినిపిస్తున్నాయి.  చంద్రబాబు విశాఖ జిల్లాలో  పాదయాత్ర చేస్తున్నప్పడు  బాలయ్య పెత్తనం ఎక్కువుగా ఉందని దాడి అనుచరులు చెబుతున్నారు. 

విశాఖ నియోజక వర్గం .. బాలయ్య  చిన్నమ్మది (పురందేశ్వరి) కావటంతో చాలా హడావుడి చేసి.. దాడి వీరభద్రరావును   బాబుకు దూరం చేసినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  అప్పటికే విసిగిపోయిన దాడి, ఈ చర్యతో  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు.  అంతేకాకుండా బాబు పాదయాత్ర ముగింపుసభలో కూడా  బాలయ్య హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం ముందే గ్రహించిన  దాడి . ముగింపు సభకు దూరంగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బాలయ్య దెబ్బకు టిడిపి పిట్టలు లేచిపోతున్నాయానే  విషయాన్ని  అధినేత చంద్రబాబు కు సీనియర్ నాయకులు అనేక సార్లు చెప్పినట్లు.. పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అయితే అధినేతలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవటంతో చివరకు సీనియర్ నాయకులే  కొత్త గూటికి వెళ్లిపోవటం  జరుగుతుందని  దాడి అనుచరులు అంటున్నారు.

బాలయ్య పరిస్థితి ఇలా కొనసాగితే.. 2014 నాటికి .. టిడిపీలో సీనియర్ నాయకులు ఎవరు ఉండారని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  టిడిపిలో బాలయ్య రాకతో.. కమ్మ వర్గం పార్టీగా పేరు వినబడుతుందనే విమర్శలు సీనియర్ నాయకుల మధ్య బలంగా వినిపిస్తున్నాయి. అందువలనే  రెడ్డీ వర్గం నాయకులు ముందుగానే మేలుకొని పార్టీ వీడి వెళ్లిపోతున్నారనే విమర్శలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.  ఏమైన బాలయ్య రాకతో పార్టీకి బలం కంటే.. నష్టమే ఎక్కువగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ముందు చూపు లేకపోవటంతో బాలయ్య వలన దాడి లాంటి నాయకులు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు విశాఖ జిల్లాల్లో  , ఎర్రంనాయకుడు, దాడి లాంటి నాయకుల తరువాత బలమైన నాయకుడు లేకపోవటం పార్టీ ఆయా జిల్లాలో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని  రాజకీయ మేథావులు అంటున్నారు.  ఇప్పుడు ఆ ప్రాంతంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.  బాలయ్య తొడ కొట్టే శబ్దం కన్న.. కంటి చూపుతోనే  పార్టీ  సీనియర్ నాయకులు వెళ్లిపోతున్నారని సామాన్య ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more