Ap telugu political gossip tdp mla revanth reddy like to join ysrcp

tdp mla revanth reddy like to join ysrcp, dadi veerabhadra rao, ysr congress party, revanth reddy, chada suresh, malkajgiri lok sabha seat, tdp leaders, chandra babu naidu, ysrcp, ys jagan, 2014 election, lok sabha seat,

tdp mla revanth reddy like to join ysrcp?

నేడు దాడి....రేపు రేవంత్ రెడ్డి? వైసీపీలోకి

Posted: 05/03/2013 03:39 PM IST
Ap telugu political gossip tdp mla revanth reddy like to join ysrcp

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయకుడు  పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుండి నాయకులు ఇతర పార్టీలోకి వలసలు వెళ్లుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ఎనిమిది మంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లినట్లు  సమాచారం.  చంద్రబాబు తరువాత పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నాయకుడు దాడి వీరభద్రరావు.,  కొన్ని కారణాలు చెప్పి,  పార్టీ వీడి,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి  చెరటంపై  పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల మీద కూడా అనుమానం వస్తుందని  టిడిపి కార్యకర్తలు అంటున్నారు. నిన్న టిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన  ముగ్గురు నాయకులు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.  వారు వచ్చిన ఆనందంకంటే,  ‘దాడి ’ పార్టీ నుండి వెళ్లిపోవటం కార్యకర్తలు, సీనియర్ నాయకులు  జీర్ణించుకులేకపోతున్నారు.  అయితే టిడిపికి మరో షాక్  తగలనుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నేడు  దాడి,  రేపు రేవంత్ రెడ్డి కూడా... ? అనే పుకార్లు పార్టీ శ్రేణుల మధ్య వినిపిస్తున్నాయి.

చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు .. ఈ మధ్య కాలంలో  పార్టీలోని  కొంతమంది నాయకులకు నచ్చటం లేదనే వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి.  సీనియర్ నాయకులను పక్కన పెట్టి.. కొత్తగా వచ్చిన వారికి .. పార్టీ టిక్కెట్లు కేటాయించటం పై .. పార్టీలోని సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నిరాశతోనే దాడి పార్టీ వదిలి వెళ్లిపోవటం జరిగినట్లు సీనియర్ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. ఇప్పుడే అదే బాటలో  రెబల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధినేత తీసుకొనే నిర్ణయాల  విషయంలో  రేవంత్ రెడ్డి కూడా కొంచెం గుర్రుగానే ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దాడి వీరభద్రరావు పార్టీ వీడిన తరువాత ..రేవంత్ రెడ్డి పై కూడా అనుమానం వస్తుందని  పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. 

అందుకు కారణం .. మల్కాజిగిరి లోక్ సభ సీటు టిక్కెట్ ను టిఆర్ఎస్ లోనుంచి తిరిగి టిడిపిలో చేరిన  మాజీ ఎమ్.పి సురేష్ రెడ్డికి ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి.  అయితే టిడిపిలో కూడా మల్కాజిగిరి టిక్కెట్ పై పలువురు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా టిడిపి అధికార ప్రతినిధి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పోటీచేయాలని సంకల్పించారు. నిజంగానే చంద్రబాబునాయుడు కనుక సురేష్ రెడ్డికి హామీ ఇచ్చి ఉంటే అది రేవంత్ కు ఇరకాటంగా మారుతుంది. చంద్రబాబుకు అత్యంత విధేయుడుగా ఉన్న తనను కాదని సురేష్ కు ఇస్తారా అని ఆయన ప్రశ్నించవచ్చు. అందువల్ల మల్కాజిగిరి సీటు నిజంగానే సురేష్ రెడ్డి కి చంద్రబాబు ఇచ్చేసి ఉంటారని టిడిపి భవనంలో సీనియర్ నాయకులు చెప్పుకుంటున్నారు.  ఈ విషయం పై రేవంత్ రెడ్డి  చంద్రబాబు తో మాట్లాడటానికి  సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ చంద్రబాబు తో రేవంత్ రెడ్డి చర్చలు విఫలమైతే .. మాత్రం  వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లతాడనే.. ఊహగానాలు .. పార్టీ కార్యకర్తల మధ్య బలంగా వినిపిస్తున్నాయి.   అంటే  ఈసారి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. లోక్ సభకు పోటీ చెయ్యాలనే ఉద్దేశంలో ఉన్నట్లు, ఈ విషయాన్ని  పార్టీ సీనియర్ నాయకులకు తెలిపినట్లు తెలుస్తోంది.   ఇదే విషయాన్ని గతంలో  చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చెప్పినట్లు పార్టీ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా  మల్కాజిగిరి లోక్ సభ సీటునే రేవంత్ రెడ్డి చంద్రబాబును అడిగినట్లు సమాచారం.  మల్కాజిగిరి లోక్ సభ సీటు పై  ఆశ పెట్టుకున్న రేవంత్ రెడ్డికే  అన్యాయం జరిగితే.. పరిస్థితి ఏమిటి?  అన్న ఆలోచనలు కార్యకర్తలను తికమక పెడుతున్నాయి. ఒకవేళ నిజంగా అలాగే జరిగితే.. దాడి వీరభద్రరావు మాదిరే. బాబు మీద కొన్ని విమర్శలు చేసి, జగన్ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని టిడిపి సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కోసం వైసీపీ ఎప్పటి నుండి ఎదురుస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more