2013 లో కి అడుగుపెట్టినా, ఇంకా 2012 మన మనస్సుల్లో మెదులుతూనే ఉంది... పోయిన సంవత్సరంతో పాటు, ఆ సంవత్సరం విడుదల అయ్యి మనల్ని అలరించిన చిత్రాలు కూడా మనం మరచిపోలేం... 2012 అనగానే, మనకు గుర్తు ఒచ్చే కొన్ని 3 సినిమాల రీకేప్ మీ కోసం.2012 సంవత్సరాన్ని ఇక ఏ హీరో మరచిపోయినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మరచిపోలేడు... 'తోలి ప్రేమ', 'ఖుషి', 'బద్రి' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించి, తిరుగులేని స్టార్ హీరోగా నిలిచిపోయిన పవన్, 'జల్సా' తరువాత, కనీస విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు.తన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యి, అంతే అంచల మధ్య విడుదలయ్యి, ఫ్లాప్లుగా మిగిలిపోయేవి. కాని 2012 సంవత్సరం ప్రదమార్ధం మాత్రం, పవన్ కళ్యాణ్ కి కాసుల వర్షం కురిపించింది... హిందీ చిత్రం 'దబంగ్' ఆధారంగా, పవన్ కళ్యాణ్ హీరో గా నిర్మించి విడుదల చేసిన 'గబ్బర్ సింగ్', ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది... పవన్ స్టార్ కి తిరుగులేదని మరొక్కసారి రుజువయ్యింది... ఆ వెంటనే కొన్ని నెలల వ్యవధిలో విడుదల అయిన పవర్ స్టార్ ఇంకొక సినిమా 'క్యామేరామ్యాన్ గంగ తో రామ్ బాబు' చిత్రం ఆశించినంత విజయం సాధించలేకపోయిన, పవన్ తన భరోసా వదలకుండా 2013 మళ్లీ ఇంకొక సూపర్ హిట్ అందించే దిశగా, దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి ఆలోచించే విధంగా ప్రేరేపించాయి... ఇదే నెలలో, పవర్ స్టార్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది... ఈ చిత్రం లో పవన్ సరసన జోడి కడుతోంది, సమంతా... దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి, 'జల్సా' టీం (పవన్ స్టార్, త్రివిక్రమ్, దేవి శ్రీ) మరొక్కసారి జతకట్టారు కాబట్టి, చిత్ర విజయం పై ధీమాగా ఉంది, ఫిలిం నగర్...
ఇక 2012 దర్శకుడు రాజ మౌళి, ఇంకొక అద్భుతాన్ని తేరా మీదకేక్కించాడు... హీరో అవసరం లేకుండా, ఒక కీటకం లో కూడా హీరోని చూబిస్తూ, కధని నడిపించి, 'ఈగ' చిత్రం తీసి, తెలుగు లోనే కాక తమిళం లో కూడా ఘన విజయాన్ని సాధించింది... ఒక విధంగా, చిత్ర హీరో నాని కి 'స్టార్' హీరో హోదాని ఈ చిత్రమే తెచ్చిపెట్టింది... పలుమార్లు విడుదల వాయిదా వేసుకున్న ఈ చిత్రం విడుదల అయ్యి, ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది... 'రాజ మౌళి ఈ సారి మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సిందే' అన్న చాలామంది అంచనాలని తారుమారు చేస్తూ, 'ఈగ' సూపర్ హిట్ గా నిలిచింది... ఇప్పుడు రాజ మౌళి ప్రభాస్ - రణాలతో ఒక భారీ బడ్జెట్ చిత్రం నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు, త్వరలోనే షూటింగ్ మొదలుకాబోతోంది...
2012 నవంబర్ సినిమా ను ఆదరించే ప్రేక్షకులు, హీరో నాగార్జున అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు... ఈ సమయానికే బాబా గా అలరించిన నాగార్జున, 'ఢమరుకం' వంటి సోషియో ఫ్యాంటసీ చిత్రం తో, 50 ల వయసులో కూడా సిక్స్ ప్యాక్ తో సిద్ధం అయ్యాడు... చిత్రం లోని పాటలు అప్పటికే విజయం సాధించాయి... సినిమా మీద అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి... ఇటు వంటి సమయం లో ఈ సినిమా పలు నిర్మాణ సంబంధీత వివాదాలలో చిక్కుకుంది... ఎట్టకేలకు ఈ చిత్రాన్ని విడుదల చేసారు... అయితే చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది... సినిమా బాగానే ఉంది అనిపించినా, 50 రోజులకు మించి ఆడలేకపోయింది... అయితే, కొత్త సంవత్సరం కమర్షియల్ ఫార్ములా ని నాగ్ నమ్మాడు... 'లవ్ స్టోరి', 'భాయి' వంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం కాబోతున్నాడు...మరిక 2013 సినిమా పరిశ్రమకి ఏ విధంగా పలితాలని ఇవ్వబోతోందో వేచి చూడాలి...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more