పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే 'మెగా' అభిమానుల్లో యెనలేని ఉత్సాహం కలుగుతుంది... పవర్ స్టార్ సినిమా అంటే, ఆడియో విడుదల కంటే ముందు నుంచీ భారీ అంచనాలు ఉంటాయి... సినిమా విడుదల అయిన మొదటి వారం అంటా ఆ సినిమా హిట్ టాక్ నే సంపాదించుకుంటుంది... ఆ తరువాత అసలు సినిమా విజయం సాధించిందా, లేక పరాజయం పాలయ్యిందా అని నిలకడ మీద తెలుస్తుంది. కలెక్షన్ల పరంగా సినిమా జయాపజయాలతో పని లేకుండా, పవర్ స్టార్ సినిమా అంటే కలెక్షన్ల వర్షమే అనే టాక్ తెలుగు సినీ పరిశ్రమలో ఉంది...
గత కొద్ది సంవత్సరాలుగా, ముఖ్యంగా 'జల్సా' తరువాత విజయవంతమైన సినిమాని అందించని పవర్ స్టార్, ఈ యాడాది 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ ని అందించి, తన సత్తా ఏంటో మరొక్కసారి నిరూపించుకున్నాడు... ఈ విజయాన్ని క్యాష్ చేసుకుందాం అని, పవన్ తో 'క్యామెరామ్యాన్ గంగ తో రాంబాబు' చిత్రాన్ని తీసాడు, దర్శకుడు, పూరి జగన్నాథ్... వీరిద్దరి కలయిక లో వచ్చిన 'బద్రి' సూపర్ హిట్ గా నిలవడం వల్ల, 'రాంబాబు' గా కూడా, పవన్ మరొకసారి సూపర్ హిట్ సాధిస్తాడు అని అనుకున్నారు అంతా... 'గబ్బర్ సింగ్' విడుదల అయిన తరువాత, కొన్ని నెలల వ్యవధిలోనే విడుదల అయిన ఈ చిత్రం, ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది... అతి కష్టం మీద ఫరవాలేదు అనిపించుకుంది...
ఏమనుకున్నాడో ఏమో, మళ్ళీ తన పాత పద్ధతినే అనుసరించడం మొదలు పెట్టాడు పవర్ స్టార్... ఇప్పుడు తాను చెయ్యబోతున్న సినిమా తప్ప, ఇక ఏ సినిమా ఒప్పుకోవడం కాదు కదా, కనీసం కధలు కూడా వినడానికి ఇష్టపడటం లేదట పవర్ స్టార్... పవర్ స్టార్ తనకు 'జల్సా' తో విజయం తెచ్చిపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే... ఈ చిత్రం పూర్తీ అవ్వడానికి కనీసం 8 నెలలు పడుతుంది... ప్రస్తుతం ఈ చిత్రం రేగులర్ షూటింగ్ ఇంకా త్వరలో మొదలు కావలసి ఉంది... ఈ చిత్రం పైనే పూర్తీగా మనసు లగ్నం చెయ్యాలని పవర్ స్టార్ ఆలోచన... పవర్ స్టార్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పూర్తీ అయ్యి, విడుదల అయిన తరువాతే, పవన్ తదుపరి చిత్రం పై ప్రకటన ఉంటుంది
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more