సొంత ఇంటి కల, ఆర్ధిక పరిస్థితులకు అతీతంగా ప్రతీ ఒక్కరి ఆకాంక్ష... ఇక దిగువ మధ్య తరగతి వారికైతే, సిటీ లో సొంత ఇల్లు ఒక వరం... ఈ వరాన్ని అందించడానికి, జవహర్లాల్ నెహ్రు పట్టణ పునర్నిమాణ పధకం కింద కేంద్ర ప్రభుత్వం జేహెచ్ఏంసి కి 51, 340 ఇళ్ళను 2007 - 08 లో మంజూరు చేసింది... నేటికి, మన అధికారుల చాలవ వల్ల ఇంకా 6, 009 ఇళ్ళ నిర్మాణం పూర్తీ కావలసి ఉంది. ఇలా నత్త నడకన సాగుతున్న నిర్మాణం ఒక వైపు అయితే, ఇళ్ళ నిర్మాణాలకి కావలసిన సిమెంట్, ఇటుకలు, లబ్దిదారులకు బ్యాంకులు అందించే రుణ సదుపాయాలూ, ఇవన్ని కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటు వంటి పరిస్థితుల్లో ఇంకొక కొసమెరుపు వంటి వార్త వెలుగులోకి వచ్చింది..
'దిగువ మధ్యతరగతి వారికి సొంత ఇళ్ళు, అది కూడా ఏంతో చవకగా, సులువైన రుణ సదుపాయాలతో... ఇంతకన్నా సదవకాశం ఇంకొకటి ఉంటుందా? కానీ మాకొద్దు'... అంటున్నారు, లబ్దిదారులు... ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్ళల్లో తాము ఉండటానికి ఆసక్తి చూపడం లేదు అని అపష్టం చేస్తున్నారు... ఎందుకు అంటారా.
పిచ్చుక గూళ్ళను తలపించే ఇళ్ళు, సిటీకి ఏంటో దూరం అంటే, కీసర, ఘటకేసర్, శంషాబాద్ ప్రాంతాలలో ఉన్న ఈ ఇళ్ళను కొనుగోలు చేసి, సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నా, దిగువ మధ్యతరగతి వారు, రోజు వారీ పనులకు, అంత దూరం నుండి సిటీకి రావడం అనేది ఏంతో సమయం, ఖర్చుతో కూడుకున్న పని... అందునా, ఈ ఇళ్ళు నిర్మించిన ప్రాంతాలలో కనీస సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి... అందుకే, 'మా సొంత ఇంటి కల కలగానే ఉండనివ్వండి... ఇంట ఖర్చు పెట్టి మేము నిజం చేసుకోలేం' అంటున్నారు, లబ్దిదారులు. ఇక ఎన్నో వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మిచిన ఈ ఇళ్ళు ఎవరిపాలు అవుతాయో వేచి చూడటం తప్ప, చేసేది ఏమి లేదు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more