అవకాశాలు ఆమెను వెతుకుంటు వస్తున్నాయి. ఇటీవల జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అనంతరం స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బ్రాండ్ వాల్యూ అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ భాగ్యనగర్ బ్యూటీ మరో బంపర్ ఆపర్ కొట్టేసింది. బాలీవుడ్ హీరోయిన్ గా అవ్వాలనే కోరిక ఉన్నప్పటికి దానికంటే సూపర్ చాన్స్ కొట్టేసింది. అయితే క్రీడారంగంలో ప్రముఖ సోర్డ్స్ మేనేజ్ మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ సంస్థతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల డీల్ ఒప్పుకుంది. అయితే ఇప్పటి వరకు డెక్కన్ చార్జర్స్ తో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో క్రికెట్ ఆటగాళ్ల తర్వాత అత్యధిక మొత్తంలో ఒప్పందం కుదుర్చుకున్న క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 'రితి స్పోర్ట్స్‌కు పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
రితికి ఉన్న ఘనమైన చరిత్ర, విశ్వసనీయత, వారి వ్యాపార చతురత నాకు కలిసివచ్చే అంశం' అని అంది. గతకొంత కాలంగా క్రీడా పరిశ్రమలో రితి సాధిస్తున్న ప్రగతిని చూసే ఈ ఒప్పందం కుదుర్చుకున్నానని సైనా తెలిపింది. ఈ ఒప్పందంలో కీలకపాత్ర పోషించినందుకు బాయ్ ఉపాధ్యక్షుడు వినోద్ ధవన్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఇకపై సైనాకు సంబంధించిన ఎండార్స్‌మెంట్లు, బ్రాండ్, కార్పొరేట్, పేటెంట్స్, డిజిటల్ రైట్స్, ఫోటోలు, ఇతర వ్యాపార సంబంధాలు రితి స్పోర్ట్స్ నిర్వహిస్తుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ద్వారా దేశానికి ఖ్యాతి తీసుకొచ్చిన సైనా నెహ్వాల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని రితి స్పోర్ట్స్ చైర్మన్ అరుణ్ పాండే చెప్పారు. ఇప్పటికే రితి స్పోర్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న టీమిండియా కెప్టెన్ ధోనీ సరసన సైనా నిలిచింది. ఈ ఒప్పందంతో వచ్చే ఏడాదిలోపల సైనా బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు డెక్కన్ చార్జర్స్‌తో సైనా మూడేళ్ల ఒప్పందం ఈ నెల మొదటి వారంతో ముగిసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more