హస్తిన తెలంగాణ నినాదాలతో మారు మ్రోగిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధనకోసం భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో తపపెట్టిన తెలంగాణ పోరు యాత్ర మూడురోజుల ఉపవాస దీక్ష ను ఆ పార్టీ నేత రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దమ్ముంటే కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టాలని సవాల్ విసిరారు. ఇప్పటికే తమ పార్టీ సభ్యుడు రాజ్యసభలో ప్రయివేటు తీర్మానం పెట్టారంటూ రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే తెలంగాణ ఏర్పాటు చేస్తామని వాగ్ధానం చేశారు.తెలంగాణ ఏర్పాటు తరువాతే మిగిలిన రాష్ట్ర డిమాండ్లపై దృష్టి సారిస్తామని వివరించారు. వాటి కోసం రెండో రాష్ట్ర పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ)ను నియమిస్తామంటూ బీజేపీ రోడ్‌మ్యాప్ ప్రకటించింది.ఏ హామీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండదని, అందుకే దేశ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. అందుకు భిన్నంగా తమ పార్టీ ఆలోచించకుండా హామీలు ఇవ్వబోమని, ఇస్తే అమలు చేసి తీరుతామంటూ మూడు రాష్ట్రాల ఏర్పాటును ప్రస్తావించారు. టీడీపీ మద్దతు ఉండి ఉంటే అప్పుడే తెలంగాణ కూడా ఇచ్చేవారమని చెప్పారు.
తెలంగాణ ప్రజల బలిదానాలను బీజేపీ వృథా కానివ్వదని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే మొదటి మంత్రివర్గ భేటీలో మొదటి ఫైలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుదే అవుతుందని ఆ పార్టీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ వెల్లడించారు.ఉద్యమం ముసుగులో దందాలు చేసే చిన్నాచితక పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదే సమయంలో నిజాయితీగా పోరాడుతున్న పార్టీలకు మద్దతివ్వాలని సూచించారు. పార్లమెంటులో ఇద్దరు సభ్యుల టీఆర్ఎస్ హడావుడితో ఒరిగేదేమీ ఉండదని పెదవి విరిచారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సత్వరం పార్లమెంటులో బిల్లు పెట్టాలని, ఎవరు వ్యతిరేకించినా తమ పార్టీ దానికి మద్దతునిస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. బిల్లు పెట్టడం వరకు కాంగ్రెస్ పని అయితే, ఆమోదింపచేసే బాధ్యత తమ అగ్రనేతలు అద్వానీ, సుష్మ, రాజ్‌నాథ్‌లదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎవరికీ వ్యతిరేకంగా పుట్టుకొస్తున్నది కాదన్నారు.తెలుగు రాష్ట్రాలు రెండు ఉంటే సమాంతరంగా, వేగంగా అభివృద్ధి చెందగలుగుతాయన్నారు. తెలంగాణ ఏర్పాటు కావటం లేదన్న నిరాశ, నిస్పృహలను దరిచేరనీయొద్దని జేఏసీ నాయకులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ గౌరవించకుంటే 2014లో ప్రజలే ఆ పార్టీని భూస్థాపితం చేస్తారని, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీలకు పట్టం కడతారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more