Hanuma vihari

Hanuma Vihari,under-19 World Cup,Hyderabad, cricketer, Hanuma Vihari,

Hanuma Vihari

Vihari.gif

Posted: 08/30/2012 05:44 PM IST
Hanuma vihari

Hanuma Vihari

ఆఖరి నిమిషంలో కలిసొచ్చిన అదృష్టం అతడిని ఇప్పుడు హీరోని చేసింది. ముందుగా జట్టులో చోటు లేకపోయినా చివరకు వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడయ్యాడు. అతడే గాదె హనుమ విహారి. ఇటీవల ప్రపంచకప్ నెగ్గిన భారత అండర్-19 జట్టులో హైదరాబాద్‌కు చెందిన విహారి సభ్యుడు. లక్ష్మణ్ రిటైర్మెంట్ అనంతరం భారత జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న పదహారణాల అచ్చ తెలుగు ఆటగాడు.విహారి కాకినాడలో జన్మించినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. మైనింగ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న తండ్రి సత్యనారాయణ ఆకస్మిక మరణం అతడిని కలచివేసింది. అయితే పాఠశాల విద్యార్థిగా అప్పటికే అండర్-13, అండర్-16 విభాగాల్లో భారీగా పరుగులు సాధిస్తున్న విహారి ఆ బాధను అధిగమించి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగాడు. అందుకు మారేడ్‌పల్లిలోని సెయింట్ జాన్స్ కోచింగ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందాడు. తల్లి ప్రస్తుతం సొంతంగా డెయిరీఫామ్ నిర్వహిస్తుండగా, సోదరి వైష్ణవి ఇంజినీరింగ్ చదువుతోంది. ఆంధ్రాబ్యాంక్ అతనికి ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించింది. సచిన్, లక్ష్మణ్‌లను అభిమానించే విహారి తరచూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లి తన బ్యాటింగ్ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటాడు. ఇప్పటి వరకు 7 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 25.77 సగటుతో 232 పరుగులు చేశాడు.చాలా సంతోషంగా అనిపిస్తోంది. బాగా ఆడతామని మొదటినుంచి మా జట్టులో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. అయితే తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత కొంత నిరాశ ఎదురైంది.

Hanuma Vihari

అయితే మళ్లీ కోలుకొని కీలక సమయంలో సత్తా చాటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి పెంచుకోవద్దని టోర్నీకి ముందు సచిన్ ఇచ్చిన సలహా బాగా పని చేసింది. టోర్నీలో అన్ని జట్లకంటే మన ఫీల్డింగ్ అత్యుత్తమంగా ఉండటం కూడా కలిసొచ్చింది.పాక్‌తో ఆఖరిసారి ఆడినప్పుడు ఓడిపోయాం. ఈసారి గెలవాలని మ్యాచ్‌కు ముందు సగటు అభిమానుల్లాగే మేం కూడా చాలా ఉద్వేగంగా కనిపించాం. అయితే లో స్కోరింగ్ కావడంతో హోరాహోరీగా సాగింది. చివరకు మనదే పైచేయి అయింది. ఆస్ట్రేలియాతో ఫైనల్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. గతంలో ఆసీస్‌ను ఓడించాం కాబట్టి ఈసారి కూడా తడబడలేదు. నాలుగు వికెట్లు కోల్పోయినా మేం విజయంపై ధీమాతో ఉన్నాం. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బాగా సంబరాలు చేసుకున్నాం. అక్కడి భారతీయ హోటల్‌లో ప్రత్యేక డిన్నర్‌కు హాజరయ్యాం. ఒక్క మాటలో ఆ ఆనందాన్ని వర్ణించాలంటే ఇప్పటికీ నేను గాల్లో తేలిపోతున్నాను.ఈ విషయంలో నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. గతంలో భారత అండర్-19కు ఆడినా వరల్డ్ కప్ అవకాశం రాలేదని బాధపడ్డాను. అయితే స్టాండ్‌బైగా ఉన్న నాకు చివరి క్షణాల్లో జట్టులో చోటు దక్కింది.

Hanuma Vihari

ఇప్పుడు ఏకంగా విన్నింగ్ టీమ్‌లో సభ్యుడినయ్యాను. అక్కడ ఆడటం వల్ల చక్కటి అనుభవం లభించింది. అందుకే నా కెరీర్‌లో ఇవి మరచిపోలేని క్షణాలు. నా కెరీర్‌లో అండగా నిలుస్తున్న కోచ్‌లు జాన్ మనోజ్, ఆర్.శ్రీధర్‌లకు కృతజ్ఞతలు.అండర్-19 ఆడటమంటే ఇక సీనియర్ జట్టుకు ఒక అడుగే దూరమని అందరూ భావిస్తారు. నిజంగానే ఈ విజయం మా సహచరులందరికీ స్ఫూర్తి. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణించడం కీలకమనే విషయాన్ని మరువరాదు. ఇప్పుడు అండర్-19ను దాటి సీనియర్‌గా నా బాధ్యత నిర్వర్తించాల్సి ఉంది. లక్ష్మణ్ వారసుడంటూ ప్రశంసలు అందుకోవడం గర్వంగా అనిపిస్తోంది. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో బాగా ఆడి హైదరాబాద్‌కు విజయాలు అందించాలని పట్టుదలగా ఉన్నాను. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత జట్టులో చోటు దక్కించుకోవడమే నా అంతిమ లక్ష్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No anger about the gandhi family says amitabh bachchan
Chandra shriya sarans intense kalari martial arts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more