ప్రాంతీయ ఫిలిం సెన్సార్ బోర్డు రీజినల్ అధికారి ధనలక్ష్మి తీరును నిరసిస్తూ తాము విధులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు సెన్సారు బోర్డు సభ్యులు సునీతాచౌదరి, కర్నాటి విద్యాసాగర్, మద్దిపట్ల సూర్యప్రకాశ్‌లు తెలిపారు. సెన్సారుబోర్డులో కొంతమందితో కోటరి ఏర్పాటు చేసుకుని నిబంధనలకు పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తున్న ధనలక్ష్మిపై కేంద్ర సమాచార మంత్రి అంబికాసోనికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సెన్సారు చేయాల్సిన అంశాలను వదిలేసి, వదిలేయాల్సిన అంశాలను సెన్సారు చేయటంతో పాటు సభ్యుల హక్కులను హరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.వాస్తవానికి రీజినల్ ఆఫీసర్ నియామకమే సరైనది కాదని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె తన మాతృభాష తెలుగుగా తప్పుడు ధృవీకరణ ఇచ్చారని, వాస్తవానికి ఆమె మాతృభాష తమిళమని విద్యాసాగర్ చెప్పారు. సెన్సారు బోర్డులో సర్టిఫికెట్ల జారీ, సభ్యుల అధికారాల హరింపు తదితర అంశాలపై తాము రివ్యూ కమిటీ ఛైర్మన్ కేసీ శేఖర్‌బాబు దృష్టికి తీసుకువెళ్లామని, సమస్యలన్నింటికి ఒకటి రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపకపోతే సెన్సారు బోర్డు కార్యాలయం ఎదుట సత్యాగ్రహం చేపడతామని సునీత, విద్యాసాగర్, సూర్యప్రకాశ్‌లు చెప్పారు. త్వరలో ప్రతినిధి బృందం ఎంపీలతో కలిసి అంబికాసోనిని కలవాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు.
‘ఐ లవ్ యూ టీచర్’ టైటిల్ సెన్సారు బోర్డుకు వచ్చిన సినిమాపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తే... దాన్ని ‘సారీ టీచర్’గా మార్చారని సభ్యులు విద్యాసాగర్ తెలిపారు. అయితే సినిమాలో తాము అభ్యంతరం పెట్టిన సీన్లను మాత్రం ట్రె యిలర్‌లో యథావిధిగా ఉంచి అనుమతించారని, ఇందులో రీజినల్ ఆఫీసర్ ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more