ఈ ఏడాది తెలుగు తెరపై ఒకసారి తమిళ తెరపై రెండు సార్లు కనిపించబోతున్నారు రానా. క్రిష్ దర్శకత్వంలో రానా నటిస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తెలుగు, తమిళ (ఓంకారం) భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు భాషల్లోనూ దసరాకి ఈ చిత్రం విడుదల కానుంది. వాస్తవానికి ‘వడ చెన్నయ్’ అనే చిత్రం ద్వారా రానా తమిళ తెరకు పరిచయం కావల్సింది. రానాతో ఆ చిత్రదర్శకుడు వెట్రిమారన్ సంప్రదింపులు కూడా జరిపారు.అయితే రానా ఆ చిత్రం చేయలేదు.
‘ఓంకారం’ ద్వారా తమిళంలో హీరోగా పరిచయం కానున్న రానా ప్రస్తుతం అజిత్ హీరోగా విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయడానికి అంగీకరించారు. హీరోగా చేస్తున్న రానా స్పెషల్ రోల్ ఒప్పుకున్నారంటే, ఈ పాత్ర ఎంత తనకు నచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ముంబయ్‌లో చిత్రీకరిస్తున్నారు. ‘‘నా మాతృభాష తెలుగు. ప్రస్తుతం నేను ఉన్నది తమిళ చిత్రం షూటింగ్‌లో. చిత్రీకరిస్తున్నది ముంబయ్‌లో. భలే ఉంది’’ అని ఈ సందర్భంగా రానా అన్నారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more