Allari nareshs sudigadu movie release

Allari Naresh's Sudigadu Movie Release,Allari Naresh Sudigadu Movie first look posters, sudigadu 1st day collections, sudigadu 1st week collections, sudigadu 1week collections, sudigadu 2nd

Allari Naresh's Sudigadu Movie Release

Sudigadu.gif

Posted: 08/16/2012 08:03 PM IST
Allari nareshs sudigadu movie release

Allari Naresh's Sudigadu Movie Release

అల్లరి నరేష్ కు సుడి బాగా ఉన్నట్లు ఉంది.  తన అల్లరి సినిమాతో  ఇంటిపేరు అల్లరిగా మార్చుకొని .. వెండి తెరపై తన అల్లరి చూపించి  తన సినిమాలను విజయం బాటలో నడిస్తున్నాడు. గతంలో  నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్  కామెడీ  సినిమాలు తెలుగు ప్రజలకు ఎంతగానో  ఆదరించాయి. ఇప్పుడు అదే తరహాలో  అల్లరి నరేష్ వస్తున్నాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో  ఎక్కువ భాగం  డబుల్ మినింగ్ అర్థలతో.. కొంచెం ఇబ్బందిగా ఉండేవి.  కొంచెం వల్గరుగా సన్నివేశాలు ఉండటంతో  రాజేంద్ర ప్రసాద్ సినిమాలకు క్రేజ్ తగ్గిందని అప్పట్లో టాలీవుడ్ టాక్. ఇప్పుడు అల్లరి నరేష్ కూడా కొంచెం ..అతి.. వల్గర్ పదాలను  రాకుండా చేస్తే ..  అల్లరి నరేష్ మంచి కమెడీ నటుడు అవుతాడని  టాలీవుడ్  ప్రముఖులు అంటున్నారు. త్వరలో  విడుదలకు సిద్దంగా ఉన్న సుడిగాడు  సినిమా పై అప్పడే భారీ కలెక్షన్  కురిపించినట్లు తెలుస్తోంది.  సుడిగాడు ట్రైలర్ చూసిన  ప్రతి ఒక్కరు  భారీ కలెక్షన్లు వసూలు చేస్తుందని  అందరు అంటున్నారు.  ‘‘ఒక సామాన్యుడు జీరో స్టేజ్ నుంచి హీరో స్జేజ్‌కి ఎదిగే క్రమమే ‘సుడిగాడు’. తెలుగులో ఇప్పటివరకూ రాని వినూత్న ప్రయత్నం ఈ సినిమా’’ అంటున్నారు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు.

అల్లరి నరేష్ కథానాయకుడిగా భీమినేని దర్శకత్వంలో డి.చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘సుడిగాడు’. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. సినీరంగం నేపథ్యంలో చాలా సినిమాలొచ్చినా ఇది మాత్రం ప్రత్యేకం. ‘ఒకే టిక్కెట్‌పై వంద సినిమాలు’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. దానికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. 82 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వంద సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అంశం పేరడీగా ఈ సినిమాలో కనిపిస్తుంది. తెలుగులో వినూత్న ప్రయత్నం ఇది. భారతీయుడు, అపరిచితుడు, గబ్బర్‌సింగ్... ఇలా ఎన్నో రూపాల్లో ఇందులో నరేష్ కనిపిస్తాడు. కడుపుబ్బ నవ్వుకునేలా సన్నివేశాలుంటాయి. అయితే పేరడీ రూపంలో మేం ఎవ్వరినీ టార్గెట్ మాత్రం చేయలేదు. కేవలం నవ్వించడం కోసమే ఈ ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత... ఆ హీరోలు కూడా నవ్వుకుంటారు. గతంలో తమిళంలో వచ్చిన ఓ సినిమా దీనికి ప్రేరణ. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. చంద్రశేఖర మంచి అభిరుచి గల నిర్మాత. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. టీమ్ మొత్తానికి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun and kajal acts in ramcharan yevadu movie
Akkineni family heroes ruling tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more