తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం .. ఇప్పటి నుండే అందరికి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. మొన్నటి బిసిలకు 100 సీట్లు తెలుగు దేశం పార్టీ ఇస్తుందని మీడియ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే .. ఇప్పుడు కొత్తగా ఎస్సీలను .. తమ ఖాతలోకి వేసుకోవటానికి ఎస్సీ రిజ్వరేషన్ పేరిట ఎస్సీ నాయకులను కలుస్తూ ..వారికి అరచేతిలో .. చంద్రబాబు, చందమామాను చూపిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ వర్గానికి చెందిన హస్తం రాజకీయ నాయకులు పై కూడా చంద్రబాబు కరెంట్ పాస్ చేసినట్లు తెలుస్తోంది. బాబు వేసిన పాచికలకు కాంగ్రెస్ పార్టీ లో ఎస్సీ నాయకులు .. టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి .
ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహాలమ్మ ఎస్సీ వర్గానికి చెందిన విషయం తెలిసిందే. అయితే కుతూహాలమ్మలో కొత్త కోరికలు పుట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అందుకు నిదర్శనంగా .. ఆమె చంద్రబాబుకి జై కొట్టినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఆమె మొదట టిడిపి నాయకురాలే . వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తరువాత ఆమె కాంగ్రెస్ చేరినట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ కార్య క్రమంలో పాల్గొన్న కుతూహలమ్మ తనకు రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబేనని , చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చారని ఆమె మీడియా ముందు చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. కుతూహాలమ్మ గత కొంతకాలంగా సీఎం కిరణ్ తీరు పట్ల అసహనంతో ఉన్నట్లు ఆమె వర్గీయులు అంటున్నారు. కాంగ్రెస్ లో పరిస్థితులు అస్సలు బాలేవనీ, కాంగ్రెస్ కోసం పని చేసిన వారిని పూచిక పుల్లతో సమానంగా చూస్తున్నారని ఆమె మీడియా చెబుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆమె మాటలు చూస్తోంటే .. కాంగ్రెస్ ను వీడి సైకిల్ పై ఎక్కటం ఖాయమాని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. తనకన్నా ముందుగా తన కుటుంబ సభ్యుల్ని టీడీపీలోకి పంపినట్లు రాజకీయ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more