రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు అదే విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా పార్టీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చ జరిగింది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి ఓటు వేసే విషయంపై మొగ్గు చూపాలని భావించింది. ఆయన మైనార్టీ కాబట్టి ఓటు వేయవచ్చని అనుకున్నారు. కాని ప్రణబ్ విషయంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యుపిఎకి మద్దతు ఇవ్వడంతోనే కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ అన్న ఆరోపణలను టిడిపి పెద్ద ఎత్తున గుప్పించింది. ఎప్పటికైనా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో కలవక తప్పదని ప్రచారం చేసింది.
ఈ నేపధ్యంలో ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికలో యుపిఎ అభ్యర్ధికి మద్దతు ఇస్తే ఇరకాటంలో పడతామన్న నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతోంది. ఇంతవరకు టిడిపి తీసుకున్న నిర్ణయం సరైనదిగానే కనిపిస్తుంది.లేకుంటే ఇన్ని రోజులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు బదులు తాను విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.కాగా రాష్ట్రం నుంచి రత్నగిరి (మహారాష్ట్ర)కి గ్యాస్ తరలింపుపై నిరసన వ్యక్తం చేస్తూ మొదటి రోజునే పార్లమెంటును స్తంభింప చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు గ్యాస్ తరలింపుపై నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంటును స్తంభింపచేయాలని పార్టీ నిర్ణయించింది. జైపాల్‌రెడ్డి సొంత రాష్ట్రానికే తీరని అన్యాయం చేస్తున్నారని తెదేపా విమర్శించింది. గ్యాస్ కేటాయింపు, పెట్రోల్ ధరల పెంపు, కరువు సాయం, పోలవరం, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more