రెండువేల పద్నాలుగులో కాంగ్రెస్,బిజెపి ల ఆధ్వర్యంలో కాకుండా వేరే పార్టీ వ్యక్తి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడవచ్చన్న బిజెపి సీనియర్ నేత , మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వాని వ్యాఖ్యలు సహజంగానే కలకలం సృష్టిస్తాయి. ఒకపక్క బిజెపి నేతలు వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ఎన్నో ఆశలు పెంచుకుంటుండగా , అద్వాని అంతటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారికి తీవ్ర ఆశాభంగం కలిగిస్తుంది.అద్వాని తరచు తన బ్లాగులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా ప్రముఖంగా ఫోకస్ అవుతున్న తరుణంలో పార్టీని ఏకోన్మోఖంగా ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేయవలసిన అద్వాని ఇలా మాట్లాడవచ్చా అన్న ప్రశ్న వస్తుంది.తాను ప్రదాని కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన ఇప్పుడు అది నెరవేరే పరిస్థితి లేకపోవడం వల్ల ఇలా అంటున్నారా అన్న చర్చ ఉంది.అయితే మరో విధంగా చూస్తే కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా గడ్డు పరిస్థితి కనిపిస్తోంది.
అదే సమయంలో బిజెపి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యానిచి ఉండవచ్చన్న భావన కూడా ఉంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్, అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ప్రయోగాలు ఇలాగే జరిగాయి.కాని అవి ఎక్కువ కాలం నిలవలేదు. అయినప్పట్టికీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అన్నది చెప్పలేం. కాని సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ ప్రధాని పీఠం పై కన్ను వేశారని,అరవై సీట్లు కనుక తెచ్చుకుంటే తమనే కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా చేయవచ్చన్న ఆశతో ఉన్నారని చెబుతున్నారు. అలాగే నితీష్ కుమార్ కూడా మరో వైపు పోటీలో ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది.ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవే. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రధాని అభ్యర్థే ఇతర పార్టీలకు ఆమోదయోగ్యుడుగా తెరపైకి వచ్చే అవకాశం ఉందని అద్వానీ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. గతంలో చరణ్ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవెగౌడ కాంగ్రెస్ మద్దతుతో, వీపీ సింగ్ బీజేపీ మద్దతులో ప్రధానులుగా పనిచేశారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీలతోనే కేంద్రంలో సుస్థిర పాలన సాధ్యమని అద్వానీ పేర్కొన్నారు. అద్వానీ వ్యాఖ్యలు ఇలా ఉండగా…దీనిపై జరుగుతున్న పోస్టుమార్టాలు మాత్రం అనేక రకాల నివేదికలు ఇస్తున్నాయి. బీజేపీ ఓటమిని అద్వానీ ముందుగానే ఒప్పుకొంటున్నాడని కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకొంటుండగా, తమ నేత మాటలను ఎలా చక్కదిద్దుకోవాలో అర్థం కాని పరిస్థితి బీజేపీ నేతలది. ప్రాంతీయ పార్టీల హవా మధ్య జాతీయ పార్టీలేవి సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా నిలిచే అవకాశాలు లేవనేది జగమెరిగిన సత్యమే! అయితే సొంతంగా కాకుండా, ఎన్డీఏ తరపున అయినా అధికారంలోకి వస్తామనే విశ్వాసం అద్వానీలో లేదని స్ఫష్టమవుతోంది. మరి అద్వానీ విశ్లేషణ కార్యరూపంద దాలిస్తే…ప్రాంతీయ పార్టీలు గుండెలపై చెయ్యేసుకొని నిద్రపోవచ్చేమో!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more