రాణి తలచుకుంటే .. తోటలోని పువ్వులన్ని .. రాణి గారి జడలోనే ఉంటాయట? రాణి ఏరీ కోరి అడిగితే.. ఏలాంటి వారైన .. అన్ని సమర్పించుకోవాల్సిందే. ఇక్కడ కోరిక అంటే .. మరోలా అనుకోండి? ఆ మంత్రి గారి పర్సనల్ కోరిక. పాపం మహిళ మంత్రి ముచ్చటపడుతోంది అన్న కోణం నుంచి ఆలోచించారా? లేక బడుగు బలహీన వర్గం నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఆమె కృషి, పట్టుదలకు విలువనిచ్చారా? ఆమె కున్న పవర్ కు విలువనిచ్చారా? ఏదైతేనేం…మంత్రిగారిపై తమ భక్తి చాటుకొన్నారు రవాణా శాఖాధికారులు. భారీ పరిశ్రమల శాఖమంత్రి ముందు రాష్ట్ర రవాణాశాఖాధికారులు తమ కృతజ్ఞత చెల్లించుకొన్నారు. సాధారణ నంబర్లనే ఫ్యాన్సీ నంబర్ల గాటిన కట్టి వాటికి వేలాన్ని నిర్వహించి సామాన్యుల నుంచి దండుకొనే రవాణా అధికారులు గీతారెడ్డి విషయంలో మాత్రం తమ శాఖ ప్రయోజనాల విషయంలో ఆదమరిచారు. 9999 అనే ఫ్యాన్సీ నంబర్ ను గీతారెడ్డి పర్సనల్ కారు కోసం ఉచితంగా కేటాయించారు. మంత్రి గారు అడిగిందే తడవుగా ఆ నంబర్ ను కేటాయిస్తూ పని చక చక కదిలింది. ఎటువంటి తలనొప్పి లేకుండానే కేవలం మూడువారాల్లో మంత్రి గారి కారుకు 9999 నంబర్ చేరిపోయింది. రవాణాశాఖలోని సంజయ్ కుమార్ అనే అధికారి ప్రత్యేక ఆసక్తితో మంత్రిగారి పనిచేసిపెట్టినట్టు సమాచారం.మంత్రి స్థాయి వ్యక్తికి కేవలం నంబర్ కేటాయించడంపై ఎందుకిలా ఆడిపోసుకొంటున్నారు? అని అనుకొంటున్నారా…ఈ కేటాయింపు వల్ల రవాణాశాఖ నష్టపోయింది అక్షరాలా పది లక్షల రూపాయలు! కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో బీఎమ్ డబ్ల్యూ కారు యజమాని ఒకరు 9.6 లక్షల రూపాయలు చెల్లించి ఏపీ 9 సీఏ 9999 అనే నంబర్ వేలంలో కొనుక్కొన్నాడు.
ఈ మ్యాజిక్ నంబర్ సొంతం చేసుకోవాలనే ఏ కారు ఓనరైన కనీసం ఆరు లక్షల రూపాయలపైనే బిడ్ వేయాల్సి ఉంటుంది. ఆ మధ్య అడ్డమైన నంబర్లన్నింటినీ ఫ్యాన్సీ నంబర్లుగా పేర్కొంటూ రవాణాశాఖ వేలం నిర్వహించిందని వార్తలు వినిపించాయి. ఎటువంటి ప్రత్యేకతా లేని , సాధారణ నంబర్లు వేలానికి పెట్టడం ఏమిటనే ప్రశ్నలు ఎదురయ్యాయి.కానీ మంత్రిగారు ముచ్చట పడ్డారనే మాట వినగానే రవాణా అధికారులు సర్వం మరచి మోస్ట్ ప్రీమియర్ కేటగిరిలోని నంబర్ ను ఉచితంగా కేటాయించారు. దాదాపు 15 లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కొన్న గీతారెడ్డిగారు కూడా కనీస బాధ్యత, విజ్ఞత మరచి రవాణాశాఖ ఆదాయానికి గండి కొడుతూ నంబర్ ను తీసేసుకొన్నారు. అయితే ఈ వ్యవహారంలో రవాణా శాఖ నష్టపోయిందేమీ లేదని గీతారెడ్డి ని 50,000 రూపాయలు చెల్లించమని తాము కోరామని అధికారులు తేల్చేశారు!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more