Kiran kumar is jagans covert t congress mp

Kiran Kumar is Jagan's Covert : T Congress MP,CM Kirankumar Congress Telangana, YS Jagan,

Kiran Kumar is Jagan's Covert : T Congress MP

Jagan.gif

Posted: 07/25/2012 05:26 PM IST
Kiran kumar is jagans covert t congress mp

Kiran Kumar is Jagan's Covert : T Congress MP

కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారా? ఉంటే వాళ్లు ఏ స్థాయి నాయకులు? అధికారుల్లోనూ విభీషణులు ఉన్నారా? ఉంటే వారెవరు? మంత్రుల్లోనూ కోవర్టులు ఉన్నారా? ఉంటే వారికి ఆ కుటుంబంతో ఉన్న ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలేమిటి?.. ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలమిది. సొంత పార్టీలో ఉంటూ జగన్‌ పార్టీ ఉన్నతి, విస్తృతిని కోరుకుంటున్న విభీషణులు అటు మంత్రుల్లోనూ, ఇటు ఉన్నతాధికారుల్లోనూ ఉన్నారని, వారి నిర్లిప్తత, అనుభవలేమి, తప్పుడు సలహాల వల్లే రాష్ట్రంలో జగన్‌ పార్టీ బలోపేతమవుతోందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో పెరిగిపోతోంది. ఫలితంగా, విజయమ్మ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్‌ను మళ్లీ రెండుగా చీల్చడానికి దోహదపడిందంటున్నారు. రాష్ట్రంలో జగన్‌ పార్టీని అణచివేయాలని ఓ వైపు సోనియాగాంధీ పట్టుదలతో ఉంటే, ఇక్కడ నాయకత్వం, కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ఆ పార్టీని పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఢిల్లీ దాకా చేరాయి.

Kiran Kumar is Jagan's Covert : T Congress MP

తాజాగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయిన తెలంగాణ ఎంపీలు విజయలక్ష్మిని సిరిసిల్లకు అనుమతించే వ్యవ హారంలో ముఖ్యమంత్రి కిరణ్‌ అనుసరించిన విధానంపై ఫిర్యాదుల వర్షం కురిపించారు. కిరణ్‌ జగన్‌ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, విజయలక్ష్మిని సిరిసిల్ల వరకూ అనుమతించవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కిరణ్‌ అసమర్థ్ధ వైఖరి వల్లనే తెలంగాణలో జగన్‌ పార్టీ బలోపేతమయే అవకాశం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు.గతంలో చంద్రబాబునాయుడు వరంగల్‌ పర్యటన కంటే విజయలక్ష్మి పర్యటనకు రెట్టింపు బందోబస్తు ఏర్పాటుచేసి, ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలపై దాడులు చేయించారని, ఇది తెలంగాణ ప్రాంతంలో పార్టీని ప్రజల దృష్టిలో ముద్దాయిలుగా నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. జగన్‌ మహబూబాబాద్‌ పర్యటన సందర్భంగా అక్కడి ఉద్రిక్త పరిస్థితులను గమనించిన ప్రభుత్వం, జగన్‌ను అక్కడికి వెళ్లనీయకుండా మధ్యలోనే వెనక్కి పంపిందని గుర్తు చేస్తూ... ముఖ్యమంత్రికి ఆ పాటి విషయం కూడా తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. వారంతా దాదాపు జగన్‌ పార్టీ-కిరణ్‌ కుమ్మక్కయ్యారన్నట్లుగానే ఆజాద్‌కు ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమయింది. ఇదిలాఉండగా.. ఏనాడూ ముఖ్యమంత్రి కిరణ్‌ను విమర్శించని సీనియర్‌ నేత వి.హన్మంతరావు సైతం విజయమ్మ పర్యటన సందర్భంగా కిరణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో సీఎంపై ఏ స్థాయి ఆగ్రహం వ్యక్తమవుతోందో స్పష్టమవుతోంది. నిజానికి, విజయమ్మ పర్యటనకు అంత హడావిడి చేయవలసి అవసరం లేదని, ఆమెకు అనవరస ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌లో మళ్లీ ప్రాంతాల వారీగా చిచ్చు రేపినట్టయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తు న్నారు. విజయమ్మ పర్యటనపై అటు సీమాంధ్ర- ఇటు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మళ్లీ రెండుగా చీలిపో యారని, ఆ రకంగా వారి మధ్య చీలికలు సృష్టించడంలో వైకాపా విజయం సాధించిందని చెబుతున్నారు.

Kiran Kumar is Jagan's Covert : T Congress MP

అసలు విజయమ్మ పర్యటనను జిల్లా పోలీసులు అనుమతించకుండా ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదంటున్నారు. లేకపోతే విజయమ్మను సిరిసిల్లకు హెలికాప్టర్‌లో వెళ్లాలని చెప్పినా ఇంత రభస జరిగేది కాదంటున్నారు. టీఆర్‌ఎస్‌ సభను అనుమతించకుండా విజయమ్మను అనుమతిస్తే ఎక్కడ టీఆర్‌ఎస్‌ ఆగ్రహానికి గురి కావలసి వస్తుందోనన్న భయంతో ఇద్దరికీ అనుమతి ఇచ్చిన అతి లౌక్యం ఇప్పుడు పార్టీని తెలంగాణ ప్రజల దృష్టిలో ముద్దాయిగా నిలబెట్టడమే కాకుండా, తమకు తెలియకుండానే సీమాంధ్ర నేతలు విజయలక్ష్మిని సమర్థించే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు.విజయమ్మ పర్యటనకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌ వేసి, తెలంగాణ ప్రజాప్రతినిధులను అరెస్టు చేయటం వల్ల.. సీమాంధ్ర నేతలు తెలం గాణ దాడులు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్న భావన తెలంగాణ ప్రజల్లో నెలకొందని కాంగ్రెస నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం-పోలీసులు కలసి జగన్‌ పార్టీపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారని పొన్నం ప్రభాకర్‌ ఆజాద్‌ వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. అటు సీమాంధ్రలో కూడా విజయమ్మ పర్యటనపై ముఖ్యమంత్రి సరైన వ్యూహం అవలంబించలేదని, ఫలితంగా తాము కూడా సమైక్యాంధ్ర కోణంలో ఆమె పర్యటనను తప్పనిసరిగా సమర్థించవలసిన పరిస్థితి కల్పించారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఆమె పర్యటనతో పాటు, టీఆర్‌ఎస్‌ ధర్నా, ధూంధామ్‌ కార్యక్రమానికీ జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరిస్తే ఇంత రభస జరిగేది కాదని వ్యాఖానిస్తున్నారు. లగడపాటి వంటి నేతలు సైతం సమైక్యాంధ్ర కోణంలో మాట్లాడటం అనివార్యమయిందని గుర్తు చేశారు. కిరణ్‌ పార్టీలకు అతీతంగా ఎవరైనా తెలంగాణకు వెళ్లవచ్చన్న సంకేతాలిచ్చారని ప్రశంసించారు. విజయమ్మ పర్యటనను సీమాంధ్ర నేతలు సమర్ధించడం, తెలంగాణ నేతలు ఖండించడం ద్వారా పార్టీలో తమకు తెలియకుండానే జగన్‌ పార్టీని హీరోగా చేస్తూ తమంతట తామే దొరికిపోయామని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu meets jagan in jail
Bhimineni srinivasa rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more