ప్రత్యేక తెలంగాణ కోసం .. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరు ఒకతాటిపై ఉన్న విషయం తెలిసిందే. అయితే ఉప ఎన్నికల తరువాత వారి పరిస్థితి మారిపోతుంది. మొన్న పాల్వాయి గోవర్థన్ రెడ్డి, నిన్న సర్వే సత్యనారాయణ, నేడు రాజయ్య రేపు మరొక్కరు .. ఇలా ఒక్కొక్కరు దొరికిపోతున్నారు. అంటే ప్రత్యేక తెలంగాణకు దూరమవుతున్నారని.. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వీరిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాచికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు కూడా రోజు రోజుకు కిరణ్ కుమార్ రెడ్డిపై అభిమానం చూపిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అంటే తెలంగాణ ఎంపీల మద్దతు పెరుగుతోందట. వీరిలో ఒక్కొక్కరు సీఎంకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. వారికి ఆ మాటలు నేర్పించింది సిఎం కిరణ్ కుమార్ రెడ్డే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తన క్యాంపు ఆఫీస్ కు పిలిపించుకోవడం ద్వారానే లేక తనే స్వయంగా ఫోన్ చేయడం ద్వారానో ఈ బుజ్జగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చేది మేడం సోనియా గాంధీనే గానీ తాను కానన్న సంగతిని వారికి తేల్చి చెబుతున్నట్లు సమాచారం. సీఎంను మార్చితే తెలంగాణ వస్తుందా ఇంత సీనియర్లు మీకు తెలియదా అంటూ వారిని ఇరకాటంలో పెడుతుండడంతో ప్రస్తుత పరిస్థితిల్లో కిరణ్ కు మద్దతు తెలపడమే మంచిదనే అభిప్రాయం వారిలో కలగజేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పల్లవిని మీరు అందుకున్న నాకు ఎటువంటి అభ్యంతరం లేదని సీఎం మార్పు అంశాన్ని మాత్రం లేవనెత్తవద్దంటూ కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పరిస్థితి బాగా లేదని పాలన కూడా ముందుకు సాగడం లేదని , 2014 ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్లాలంటే తెలంగాణ అంశాన్ని అదిష్టానానికి వదిలి పెట్టడం మంచిదని సూచించారని దీంతో తెలంగాణ ఎంపీలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ అంశం తేలేవరకు కిరణ్ ను మార్చే అవసరం లేదన్నది వీరి అభిప్రాయం. మొత్తం ముఖ్యమంత్రి వేసిన వలలో తెలంగాణ ఎంపీలు ఒక్కొక్కరు పడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంపీలు ఫైట్ చెయ్యటం విరమిస్తున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more