Tamanna to play sridevis role in himmatwala remake

Tamanna to play Sridevi's role in Himmatwala remake,Tamanna back to Bollywood with Himmatwala,Hot Tamanna Bollywood Movie, Hot Actress Tamanna in Ajay Devgn Himmatwala, Tamanna

Tamanna to play Sridevi's role in Himmatwala remake

Tamanna.gif

Posted: 06/27/2012 06:53 PM IST
Tamanna to play sridevis role in himmatwala remake

Tamanna to play Sridevi's role in Himmatwala remake

పాలబుగ్గల సుందరి తమన్నా ఏడేళ్ల తర్వాత మళ్లీ ఓ హిందీ సినిమా చేయబోతున్నారని సమాచారం. 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ చిత్రం ద్వారా ఆమె కథానాయికగా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం, తెలుగులో ‘శ్రీ’ చిత్రానికి అవకాశం రావడంతో తమన్నా ఇక్కడకు రావడం జరిగింది. అనంతరం ‘హ్యాపీడేస్’ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఎంత మంచి మలుపు తీసుకుందో తెలిసిందే. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నాపై ఇప్పుడు బాలీవుడ్‌వారి దృష్టి కూడా పడింది. బాలీవుడ్‌కి చెందిన రెండు అగ్రనిర్మాణ సంస్థలు త్వరలో తీయబోయే చిత్రాల్లో తమన్నాని నాయికగా ఎన్నుకోవడానికి ముందుకొచ్చాయని సమాచారం.

వీటిలో జితేంద్ర, శ్రీదేవి నటించిన ‘హిమ్మత్‌వాలా’ రీమేక్ ఒకటని వినికిడి. ఇందులో అజయ్‌దేవగన్ హీరోగా నటించబోతున్నారట. సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ప్రస్తుతం ఈ చిత్రదర్శక,నిర్మాతలు తమన్నాతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అన్నీ కుదిరితే త్వరలో ఆమె ఈ సినిమాకి సైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘హిమ్మత్‌వాలా’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్‌లో తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభమైతే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.

 తమన్నా ప్రస్తుతం బొద్దుగా మారే పనిలో ఉన్నారట. బాలీవుడ్‌లో శ్రీదేవికి స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన ‘హిమ్మత్‌వాలా’ బాలీవుడ్ రీమేక్‌లో తమన్నా నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే తమన్నా బొద్దుగా మారుతున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ‘హిమ్మత్‌వాలా’ టైమ్‌లో శ్రీదేవి కూడా బొద్దుగానే ఉన్నారు. ముద్దుగా బొద్దుగా ఉన్న శ్రీదేవిని చూసి ఆ రోజుల్లో బాలీవుడ్ జనం ఆకర్షితులయ్యారు. అలాగే తను కూడా బొద్దుగా మారి శ్రీదేవిలా బాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేయాలనుకుంటున్నారట తమన్నా.

ఇలాంటి పుకార్లు ఎవరు సృష్టిస్తారో కానీ.. వాళ్లను నిజంగా అభినందించాలి. వాళ్ల చానల్స్ రేటింగుల కోసం వాళ్లు పడే పాట్లవి. ఎలాగోలా కష్టపడి రేటింగులు పెంచేసుకుంటారు. కాబట్టి అలాంటి రూమర్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. అసలు ‘హిమ్మత్‌వాలా’ సినిమా కథకు, శ్రీదేవి బొద్దుగా ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె శారీర తీరు అలా ఉంటుంది.

అదే శ్రీదేవికి అందం కూడా. ఆ సినిమాలో శ్రీదేవి బొద్దుగా ఉన్నారని నేను కూడా బొద్దుగా తయారైతే... చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. నిజంగా నచ్చిన పాత్ర డిమాండ్ చేస్తే లావవ్వడానికి నాకేం అభ్యతరం లేదు. ‘హిమ్మత్‌వాలా’ విషయంలో నాపై వినిపిస్తున్న కథనాలు మాత్రం పూర్తిగా వాస్తవదూరం  అని చెప్పారు తమన్నా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ata conference and youth convention 2012
Congress leaders from andhra pradesh queue up to meet sonia gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more